కోవిడ్‌ వారియర్స్‌ కోసం ఈఎస్‌ఐలో ప్రత్యేక వార్డు | Chief Wip Chevireddy Bhaskar Reddy About Corona At Tirupati | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వారియర్స్‌ కోసం ఈఎస్‌ఐలో ప్రత్యేక వార్డు

Published Sat, Jul 25 2020 8:58 PM | Last Updated on Sat, Jul 25 2020 9:19 PM

Chief Wip Chevireddy Bhaskar Reddy About Corona At Tirupati - Sakshi

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి 

సాక్షి, తిరుపతి: కరోనా వైరస్‌కు ఎవరు అతీతులు కారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్‌, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరస్‌ సోకిన వారిలో 99 శాతం మంది రికవరీ అవుతున్నారని తెలిపారు. తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో అన్ని శాఖలతో సమన్వయ కమిటీలు వేశామని తెలిపారు. కరోనా బాధితులకు ఈ కమిటీలు అండగా ఉంటాయన్నారు. ఐఎంఏ తిరుపతి శాఖ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మీడియా ప్రతినిధులు, డాక్టర్లు, పోలీసుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉండగా ఈ రోజు రుయా ఆ‍స్పత్రి నుంచి 79 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అందించారు. 

కరోనాను జయించిన 101 సంత్సరాల బామ్మ
నమ్మకం, సంకల్పబలం ఉంటే ఎలాంటి సమస్యనైనా జయింవచ్చని నిరూపించింది తిరుపతికి చెందిన ఓ 101 సంవత్సరాల బామ్మ. 60 ఏళ్లకు పైబడిన వారికి కరోనా సోకితే కష్టమని నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ వీరి వ్యాఖ్యలను తప్పని నిరూపిస్తూ.. ఓ 101 సంవత్సరాల వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నారు. వారం రోజుల క్రితం తిరుపతికి చెందిన ఈ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో తిరుపతి స్విమ్స్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో చేరింది. 14 రోజుల క్వారంటైన్‌ తప్పని సరిగా భావిస్తుండగా.. ఈ బామ్మ మాత్రం కేవలం 10 రోజుల్లోనే కోలుకుని డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో మరోసారి బామ్మకు కరోనా టెస్ట్‌ చేయగా నెగిటివ్‌ రావడంతో శనివారం ఆమెను డిశ్చార్జ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement