![Chittoor Kuppam Massive Fire Accident At Milk Production Center - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/29/fir.jpg.webp?itok=XFuhT6s_)
సాక్షి, చిత్తూరు: కుప్పంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సైబర్ డైనమిక్ పాల ఉత్పత్తి కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భారీగా అస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.