
సాక్షి, అమరావతి: భూ పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న భూములకు అనుభవదారులుగా ఉన్న రైతన్నలకు నేడు మన ప్రభుత్వంలో పూర్తి హక్కులు కల్పించాం, అలాగే పలువురికి కొత్తగా డీకేటీ పట్టాలను కూడా అందజేశాం’’ అని సీఎం పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి పేదవాడిని గుండెల్లో పెట్టుకుని, ముందుకు నడిపించే కార్యక్రమం ఈ 53 నెలల పాలనలో జరిగింది. పేదవారిపై ప్రేమ చూపిస్తూ నేనెప్పుడు మాట్లాడినా ఆ మాటలు పెత్తందారులకు నచ్చవు. కానీ మన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవకుండా పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో.. బాధ్యతతో వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమమే నిదర్శనం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న భూములకు అనుభవదారులుగా ఉన్న రైతన్నలకు నేడు మన ప్రభుత్వంలో పూర్తి హక్కులు కల్పించాం. అలాగే పలువురికి కొత్తగా డీకేటీ పట్టాలను కూడా అందజేశాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టాం. గతంలో… pic.twitter.com/a6WijlZP4x
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2023