
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 1న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సీఎం తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి గుంటూరు భారత్‌పేట ఆరో లైన్‌లోని 140వ వార్డు సచివాలయానికి 11.10 గంటలకు చేరుకుంటారు. ఆ సమయం నుంచి 11.25 గంటల సమయం వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటారు. 11.25 గంటల నుంచి 11.55 గంటల వరకు అబ్జర్వేషన్‌లో ఉండటంతోపాటు సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు.
11.55 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి 12.35 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 3 గంటలకు విజయవాడలోని ఏ–కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ 3.25 గంటల వరకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 3.35 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.