సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 600 కేజీల భారీ కేక్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు కట్ చేశారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మైలు రాయి సెంటర్ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి గ్రామ సచివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు, సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు , కైలే అనీల్ కుమార్, ఎంపీ నందిగం సురేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహల్లా, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment