సంక్షేమ సామ్రాట్‌కి జన్మదిన శుభాకాంక్షలు | Leaders Birthday Wishes To AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సంక్షేమ సామ్రాట్‌కి జన్మదిన శుభాకాంక్షలు

Dec 21 2023 8:52 AM | Updated on Dec 21 2023 2:37 PM

Leaders Birthday Wishes To CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో 3 దశాబ్దాలపాటు సీఎంగానే ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. రాష్ట్రవాప్తంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి.

సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు. సంక్షేమ సామ్రాట్ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు.

అనంతపురం జిల్లా:
సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కేక్‌ కట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement