ఏప్రిల్‌ 1 నుంచి రెండో విడత ‘మనబడి నాడు-నేడు’ | CM YS Jagan Review Meeting On Manabadi Nadu Nedu | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లగా అంగన్‌వాడీలు

Published Tue, Dec 22 2020 6:55 PM | Last Updated on Tue, Dec 22 2020 7:03 PM

CM YS Jagan Review Meeting On Manabadi Nadu Nedu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘మనబడి నాడు– నేడు, జగనన్న విద్యా కానుక’పై  సమీక్ష నిర్వహించారు.  రెండో విడతలో భాగంగా ప్రైమరీ పాఠశాలలు 9,476, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 822, రెసిడెన్షియల్‌ స్కూళ్లు సహా హైస్కూళ్లు 2,771, జూనియర్‌ కాలేజీలు 473, హాస్టళ్లు 1,668, డైట్‌ కాలేజీలు 17, ఎంఆర్‌సీఎస్‌ 672, భవిత కేంద్రాలు 446 చోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. (చదవండి: వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్‌)

ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజా శంకర్, మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వ శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’)

టాయిలెట్‌ కేర్‌టేకర్‌:
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు
దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కేర్‌ టేకర్‌కు సగటున రూ.6 వేలు చెల్లింపు.
టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా
పిల్లల సంఖ్యను అనుసరించి నలుగురు వరకు టాయిలెట్ల కేర్‌ టేకర్లు. వేయికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురు కేర్‌ టేకర్లు.
టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్న సీఎం

అంగన్‌వాడీలు:
అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న కార్యక్రమాలపైనా  సీఎం సమీక్ష
మార్చి 2021లో మొదటి దశ పనులు మొదలుపెట్టాలని నిర్ణయం
రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
మొదటి విడతలో 6,407 కొత్త అంగన్‌వాడీల నిర్మాణం, 4,171 అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు
మొత్తం 27,438 కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణం. 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపడుతున్న ప్రభుత్వం
మొత్తంగా సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా

వైఎస్సార్‌ ప్రీప్రైమరీలు:
వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లగా అంగన్‌వాడీలు
ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలను సీఎంకు చూపించిన మంత్రి, అధికారులు
పుస్తకాల నాణ్యత బాగుండాలని అధికారులకు సీఎం ఆదేశాలు
పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామన్న అధికారులు 

జగనన్న విద్యాకానుక:
వచ్చే ఏడాది ఇవ్వాల్సిన విద్యాకానుకపైనా సీఎం సమీక్ష
స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
స్కూలు యూనిఫారమ్స్‌ సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలన్న సీఎం
వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement