mana badi
-
YS Jagan: ఓ తరం.. అంతరం
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నాంది పలుకుతూ.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తీసుకున్న ప్రతి నిర్ణయం పేదోడికి మేలు చేకూర్చింది. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐబీ సిలబస్, టోఫెల్ ఇలా ఒకటేమిటి అధికారంలో ఉన్నన్నాళ్లూ సంస్కరణల పథాన ముందుకు సాగారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాటి నవశకం కాస్త.. నేడు అదోరకం అన్నట్లుగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి.వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. దీని కోసం విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసి విద్యార్థులకు సమకాలీన ఆధునిక వసతులతో కూడిన విద్యారంగం వైపు అడుగులు వేయించింది. కానీ ప్రస్తుతం కూటమి సర్కార్ ఆ పథకానికి ఎగనామం పెట్టి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాక విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విద్యావిప్లవానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు తీసుకుంటూ ఓ తరాన్ని బలి తీసుకుంటోందని పలువురు విద్యారంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమ్మ ఒడితో ఆనందాలు.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టి ఆ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రోజూ తమ పిల్లలను బడికి పంపించే కుటుంబానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా సాయమందించారు. కృష్ణాజిల్లాలో 1,35,434 మంది విద్యార్థులకు రూ.203 కోట్లు, ఎనీ్టఆర్ జిల్లాలో 1,80,254 మంది విద్యార్థులకు రూ.266 కోట్లు చొప్పున ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.469 కోట్లు ఏటా ఆయా కుటుంబాలకు అందించిన ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిది. విద్యా, వసతి దీవెనలతో అండదండలు.. గత ప్రభుత్వ హయాంలో ఏటా ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేర్లతో కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ చేసేది. ప్రధానంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి రూ.43 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీజులుండగా వాటిని విడతల వారీగా అందించింది. ఎనీ్టఆర్ జిల్లాలో గత సర్కార్ సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఏటా విద్యాదీవెన పథకం ద్వారా రూ.406.56 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ.152.49 కోట్లు అందించింది. అలాగే కృష్ణా జిల్లాలోను 35 వేల మంది విద్యార్థులకు సుమారుగా రూ.350 కోట్ల మేర సాయమందించింది.‘నాడు–నేడు’ అద్భుతం..గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో పాఠశాలల రూపురేఖలు సైతం మార్పు చేసేందుకు నాడు–నేడు పథకం ద్వారా విశేష కృషి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోనే తొలి విడతగా 341 పాఠశాలలకు రూ.96.32 కోట్లు, రెండో విడతగా 596 పాఠశాలలకు రూ.240 55 కోట్లు కేటాయించారు. రెండో విడత పనుల ముగింపు దశలో ఉండగా కూటమి సర్కార్ వాటిని పూర్తిగా నిలిపివేసింది. కృష్ణాజిల్లాలోనూ రెండో విడత పనులను సైతం పూర్తిగా ఆపేసింది.ఆధునికతకు అందలం.. గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఆయా పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఏటా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను అందించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి ఏడాది 26,334 మంది విద్యార్థులకు రెండో ఏడాది సైతం అదే రీతిలో కొనసాగించింది. ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీలతో పాటుగా ప్రాథమిక పాఠశాలలో ఇంటర్నల్ ప్యానల్స్‌ను అందించింది.ఆరోగ్యానికి ప్రాధాన్యం.. జగనన్న గోరుముద్దతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పరిపూర్ణమైన పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు గత ప్రభుత్వం ప్రారంభించింది. రోజుకొక మెనూతో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అంతేకాకుండా విద్యార్థులకు కోడిగుడ్డు, చెక్కీలు, రాగిజావ వంటి కొత్త ఆహారాలను సైతం పరిచయం చేసి విద్యార్థులకు పరిపూర్ణమైన ఆహారాన్ని జగన్ అందించారు.ఆంగ్ల బోధనతో కొత్త చరిత్ర.. సమకాలీన సమాజంలో మాతృభాషతో పాటుగా ఆంగ్ల భాషలో బోధన జరిగినప్పుడు విద్యార్థులకు మేలు జరుగుతుందని గత జగన్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రారంభించింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తెలుగు– ఆంగ్ల భాషల్లో ముద్రించిన పుస్తకాలను అందించి వారికి పాఠ్యాంశాలు చక్కగా అర్థమయ్యేందుకు గత ప్రభుత్వం సహకరించింది. పథకాలు అమలు చేయాలి విద్యారంగంలో గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పథకాలన్నీ కూటమి సర్కార్ అమలు చేయాలి. అవి పేద విద్యార్థులకు మేలు చేశాయి. అమ్మ ఒడి వంటి పథకాలను ఇంకా విస్తృతంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి నేడు దాని ప్రస్తావన ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావటం లేదు. నాడు–నేడు సైతం నిలిపివేసింది. – సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అద్భుతమైన ప్రగతి.. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విద్యారంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. దేశంలోనే మొదటి సారిగా బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, ఒకటి నుంచి 5వ తరగతికి బొమ్మలతో కూడిన డిక్షనరీని, ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ట్యాబ్‌లు ఇలా ఒకటేమిటి ప్రతిఅంశంలో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు మేనమామగా ఆయన చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. – టి. కల్పలత, ఎమ్మెల్సీవిద్యాకానుకకు జాతీయ గుర్తింపు.. గతంలో టీడీపీ సర్కార్ పాఠశాలలు ప్రారంభమైన ఆరు మాసాలైనా విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి కనపడేది కాదు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు తెరిచిన రోజునే అందరికీ జగనన్న విద్యాకానుక పేరుతో పాఠ్యపుస్తకాలతో పాటుగా అత్యధిక నాణ్యత కలిగిన నోటు పుస్తకాలు, బూట్లు, బ్యాగ్, డిక్షనరీలు ఇలా ఎనిమిది రకాల వస్తువులను అందించేవారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న విద్యాకానుకకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అభించాయి. కూటమి సర్కార్ తూట్లు..కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగానికి సంబంధించి అనేక పథకాలకు తూట్లు పొడిచిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అమ్మ ఒడి, నాడు–నేడు, ట్యాబ్‌ల పంపిణీతో పాటుగా పలు కార్యక్రమాలను నిలిపివేయటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగనన్న గురుముద్ద పేరుతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనాన్ని సైతం ఇష్టారాజ్యంగా మార్చేసి, పరిశుభ్రత లేకుండా చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో పని చేసే ఆయాలకు జీతాలు ఇవ్వకపోవటంతో విద్యాసంస్థల్లో విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. -
Visakhapatnam: అరే.. ఇది మన బడేనా!
చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే.... గర్వపడుతున్నా.. నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను. – పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్‌లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. –పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట -
బడికి రప్పించేలా రవాణా చార్జీలు
సాక్షి, అమరావతి: బడి వయసు పిల్లలెవరూ చదువులకు దూరం కాకుండా స్కూళ్లలో చేరేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ పాఠశాల విద్యాశాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి కింద ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లుగా రూ.19,617 కోట్లను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం మూడేళ్లలో రూ.3,117 కోట్లను వెచ్చించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద రూ.48.92 కోట్లతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా రూ.2,324 కోట్లతో కుట్టుకూలీతో 3 జతల యూనిఫారం దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుబుక్కులు, డిక్షనరీతో కూడిన స్టూడెంట్ కిట్లు అందిస్తున్నారు. వీటన్నిటితోపాటు స్కూళ్లు అందుబాటులో లేనివారికి, దూర ప్రాంతాల్లో నివసించే పిల్లలు నడవాల్సిన అవసరం లేకుండా రవాణా చార్జీలను సైతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ట్రాన్స్పోర్ట్ చార్జీల కింద నెలకు రూ.600 చొప్పున 10 నెలల పాటు అందిస్తోంది. 2022–23కిగాను 40 వేల మందికిపైగా రవాణా చార్జీల కింద రూ.24.25 కోట్లు చెల్లించనున్నారు. ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 32,569 మందికి రూ.19.54 కోట్లు, సెకండరీ స్కూలు విద్యార్థులు 7852 మందికి రూ.4.71 కోట్లు రవాణా చార్జీలుగా అందించనున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో బడిబయట ఉన్న పిల్లలకోసం రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వలస వెళ్లిన వారి పిల్లలు, ఇతర ప్రాంతాలనుంచి ఉపాధి కోసం వచ్చిన వారి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు సీజనల్ హాస్టళ్లను విద్యాశాఖ నెలకొల్పింది. అనాథలు, ఆర్థిక పరిస్థితి సరిగాలేని పిల్లల కోసం సమగ్ర శిక్ష (ఎస్ఎస్ఏ) ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేశారు. -
నాడు– నేడు.. బడి అందం చూడు
కడప ఎడ్యుకేషన్: ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేక సమస్యలతో సతమతమయ్యేవారు. విద్యార్థులకు తగినన్ని తరగతి గదులు లేక చెట్లకింద, వరండాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు సరైన వసతులు లేక.. పాఠశాలకు ప్రహరీలు లేక దారుణంగా ఉండేది. ఇలాంటి దుస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమస్యలన్నింటికి స్వస్తి పలుకుతూ నాడు– నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. దీంతో నేడు చిన్నారులు విరబూసిన నవ్వులతో అక్షరాలు నేర్పే పాఠశాల చెంతకు పరుగులు పెడుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్తుకు పునాది పడే ప్రభుత్వ బడులకే తమ పిల్లలను పంపుతున్నారు. రెండవ విడత.. చకచక ప్రభుత్వం జిల్లాలో రెండో విడత నాడు– నేడు పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పనులు మొదలై పలుచోట్ల చురుగ్గా సాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా పనుల పూర్తికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు, అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో రెండో విడతలో 1028 పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 322.83 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను సత్వరం పూర్తి చేయించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, విశాలమైన తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. రూ. 144.72 కోట్లతో నాడు– నేడు, అదనపు తరగతి గదులు జిల్లావ్యాప్తంగా 18 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 69 ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తంగా 99 పాఠశాలల్లో కేవలం అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. 68 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 ఉన్నత పాఠశాలల్లో నాడు నేడుతోపాటు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారు. ఈ పనులకు రూ. 144.78 కోట్లు కేటాయించారు. కేవలం నాడు – నేడు పనులకు కేవలం నాడు – నేడుకు సంబంధించి జిల్లాలో 461 ప్రాథమిక పాఠశాలలకు, 38 ప్రాథమికోన్నత పాఠశాలకు, 63 హైస్కూల్స్ దీంతోపాటు మరో 203 అంగన్వాడీ కేంద్రాలకు కలుపుకుని రూ. 178.05 కోట్లను కేటాయించారు. పనులను పారదర్శకంగా నిర్వహించాలి నాడు– నేడు రెండవ విడత కింద చేపట్టనున్న పనులను చాలా పారదర్శకంగా, నిక్కచ్చిగా చేపట్టాలి. ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత లోపించకూడదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు అదనపు తరగతులను నిర్మిస్తున్నాం. ఈ పనులను ఆగస్టు చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. – అంబవరం. ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి 8 పది రకాల సౌకర్యాల కల్పన నాడు– నేడు మొదటి విడత పనులకు అదనంగా మరో పని చేర్చి రెండో విడతలో పది రకాల పనులను చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులకు మరమ్మతులు, తాగునీటి వసతి మెరుగుపరిచి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సురక్షిత తాగునీటి శుద్ధి పరికరాలను అమర్చనున్నారు. అన్ని తరగతి గదులకు ట్యూబ్‌లైట్లు, సిలింగ్‌ఫ్యాన్‌లు, బాలబాలికలకు విడివిడిగా నిరంతరం నీటి సౌకర్యంతో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు, బ్లాక్‌బోర్డు స్థానంలో గ్రీన్‌బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, తరగతి గదులకు పెయింటింగ్, పాఠశాల ఆవరణంలో గ్రానైట్ పనులు, ఉపాధిహామీ పథకంలో ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. -
బడి.. బాగుంది
సాక్షి,అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో అనే దయనీయ పరిస్థితుల నుంచి బయటపడి సకల వసతులతో కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా చక్కటి వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ ఫలితాలు ఇవన్నీ. ఇప్పటికే తొలివిడత స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తయి సర్వాంగ సుందరంగా రూపుదిద్దు కోగా ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. తొలుత ప్రభుత్వ స్కూళ్ల వరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళిక తయారైనా తదుపరి ముఖ్యమంత్రి జగన్ సూచనలతో ఇతర విద్యాసంస్థలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. సమున్నత లక్ష్యంతో శ్రీకారం.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు పడుతున్న అగచాట్లను గుర్తించారు. కనీస సదుపాయాలు కరువై విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడాన్ని చూసి చలించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని తెచ్చారు. 45 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో పనులను చేపట్టాలని నిర్దేశించారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్తు సదుపాయం–లైట్లు, ఫ్యాన్లు, డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేశారు. తొలుత 9 రకాల సదుపాయాల కల్పనకే ప్రణాళికలు రూపొందించినా తదుపరి కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ ల్యాబ్స్ కూడా జోడించారు. రూ.16,450 కోట్లతో 61,661 విద్యాసంస్థల్లో నాడు–నేడు నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో వివిధ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్ వీటిని విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేశారు. అనంతరం మలివిడత నాడు–నేడు పనులను చేపట్టాలని ఆదేశించారు. ఇతర విద్యా సంబంధితసంస్థల్లోనూ నాడు–నేడును అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాల(డైట్స్)లతో పాటు ప్రతిష్టాత్మక శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులో చేర్చారు. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. పేదలకు పెనుభారం తప్పింది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరిగాయి. భారీగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించాల్సిన అవస్థలు తల్లిదండ్రులకు తొలగిపోయాయి. ముఖ్యంగా పేద వర్గాలకు పెనుభారం తప్పింది. కార్పొరేట్ స్కూళ్లకు మించిన సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చదువులు కొనసాగుతున్నాయి. పక్కా భవనాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించడంతో విద్యార్ధులు ఉత్సాహంగా బడికి వస్తున్నారు. –పారది జ్యోతి, పెదమేడపల్లి ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యురాలు, విజయనగరం జిల్లా నాడు అంతా అధ్వానం.. మా ఊరిలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆనుకొని ఖాళీ స్థలం అపరిశుభ్రంగా ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్చేవారు. ఇప్పుడు అవస్థలు లేవు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రవేశాలు పెరుగుతున్నాయి. –అల్లు రాము, చైర్మన్, తల్లిదండ్రుల కమిటీ, కొర్లాం ప్రాథమిక పాఠశాల, విజయనగరం జిల్లా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లట్లేదు నాడు–నేడు మొదటి విడతలో మా పాఠశాలను ఆధునీకరించాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు, గ్రామస్తులు సహకరించారు. పాఠశాల చుట్టూ చెట్లు నాటారు. పాఠశాలతో పాటు టీచర్ల ప్రతిష్ట పెరిగింది. చిర‡స్థాయిగా ఉండేలా అభివృద్ధి చేశాం. మొత్తం 63 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎగువపల్లిలో ఏ ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడం లేదు. –పీవీ శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం, ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల, కదిరి -
విద్యాసంక్షేమం సఫలం.. దొరబిడ్డల్లా పేద పిల్లలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. విద్యా కానుక, ఇంగ్లిష్ మీడియం చదువులు, నాడు–నేడు, గోరుముద్ద, అమ్మఒడి తదితర పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021–22లో సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించి ఈ ఏడాది అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు. ప్రభుత్వ విద్యారంగంపై సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధిని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను కాన్వెంట్లలో మాన్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దీంతో మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా అధికారులు పథకాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున అమ్మఒడి పథకాన్ని విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అమలుచేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన నివేదికలను ఉన్న తాధికారులకు పంపించారు. దొరబిడ్డల్లా పేద పిల్లలు ప్రభుత్వం విద్యాకానుక కింద యూనిఫాం, నోట్ పుస్తకాలు, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు, స్కూల్ బ్యాగులు అందిస్తోంది. 2021–22లో మొత్తంగా నోట్ పుస్తకాలు 1,840,218, బెల్టులు, 2,53,530, స్కూల్ బ్యాగులు 3,39,273, బూట్లు 3,36,424, యూనిఫాం 3,42,494, డిక్షనరీలను 3,42,494 విద్యార్థులను అందజేశారు. కార్పొరేట్ హంగులతో.. మనబడి నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేట్‌కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. పక్కాగా ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. అందమైన బొమ్మలతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను తీర్చిదిద్దారు. విద్యా సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా విద్యార్థుల నమో దు శాతం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో అక్షర యజ్ఞం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అక్షర యజ్ఞం కొనసాగుతోంది. రెండు విడతలు అమ్మఒడి పథకం అమలుచేయగా మూడో విడత ల్యాప్‌టాప్‌లు, నగదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. త్వరలో రెండో విడత నాడు–నేడు పనులు చేపట్టనున్నారు. సర్కారీ బడుల్లో ఉన్నత కుటుంబాల విద్యార్థులు కూడా చేరే రోజు వస్తుంది. – జీజేఏ స్టీవెన్, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా ముందుకు.. విద్యారంగ పథకాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప థకాల అమలుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. అర్హులందరికీ పథకాలు అందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాడు–నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసిన అంశం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.శ్యామ్‌సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నాడు–నేడు పనులు తొలివిడతలో 1,176 పాఠశాలలను ఎంపిక చేసి రూ.242.70 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకూ 1,076 పాఠశాలల్లో రూ.226.48 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రెండో విడతలో 892 పాఠశాలలను ఎంపిక చేసి రూ.292.18 కోట్ల నిధులు కేటాయించారు. -
9 నుంచి ‘మన బస్తీ.. మన బడి’ పనులు
సాక్షి,హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 9 నుంచి ‘మన బస్తీ – మన బడి’ పనులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం ఆయన మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లాలో ‘మన బస్తీ – మన బడి ’పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం తో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మన ఊరు –మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం 11 మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి రూ.7,289.54 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేశారన్నారు. వీటికి ఎస్టిమేషన్లను కూడా సిద్ధం చేసినందున ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్, పాఠశాల భవనాలకు రంగులు వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనేలా వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ‘మన బస్తీ – మన బడి’ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత డిప్యూటీ డీఈవోల పై ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించడంపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల వారిగా సిబ్బంది, ఉపాద్యాయుల ఖాళీలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. అధికారులు అందజేసే నివేదికను మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీ స్కూల్లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సమావేశం దృష్టికి తీసుకు రాగా, త్వరలో స్కూల్ ను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందజేస్తామన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అర్జున్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!) -
బాగుందే.. బాగుందే.. మా బడి బాగుందే
-
విద్యా కానుక కిట్స్ అందజేసిన సీఎం వైఎస్ జగన్
-
జగన్ మామయ్యకు చాలా చాలా థాంక్స్
-
మనబడి నాడు-నేడు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సీఎం వై ఎస్ జగన్
-
కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు సిద్ధం
-
ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకున్న బడులు
-
మన బడి నాడు - నేడు కార్యక్రమంలో తోలిదశ పనులు పూర్తి
-
నేడు తూర్పు గోదావరికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడే సామర్థ్యాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విద్యార్థుల్లో నెలకొల్పుతున్నారు. వారిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతూ అత్యుత్తమ మానవ వనరుల తయారీయే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వారి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. తొలివిడత పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ వేదికగా నిలుస్తోంది. దీంతోపాటు నాడు–నేడు రెండో విడత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఇలా.. ► సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. ► 11 గంటలకు పి.గన్నవరం మండలం పోతవరం చేరుకుంటారు. ► అక్కడినుంచి పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు. తొలి విడత పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించిన అనంతరం.. రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం శ్రీకారం చుడతారు. ► రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ప్రారంభిస్తారు. 8 పాఠశాల వద్ద ఉన్న భవిత కేంద్రం, గ్రంథాలయం, లేబొరేటరీలు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను జగన్ సందర్శిస్తారు. ► విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. టాయిలెట్లను పరిశీలిస్తారు. అనంతరం నాడు–నేడు పైలాన్‌ను ఆవిష్కరించి, పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► మ. 1.30 గంటలకు పోతవరం నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇది తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని శింగంశెట్టి ప్రభావతి జెడ్పీ ఉన్నత పాఠశాల. ‘నాడు–నేడు’ ద్వారా ఆధునికీకరించిన పాఠశాలలను సీఎం వైఎస్ జగన్ నేడు ఈ స్కూలు వేదికగా ప్రారంభిస్తున్నారు. 1970లో ఏర్పాటైన ఈ పాఠశాలలో మొత్తం 25 గదులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు ఉండేవి కావు. తాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే. పాఠశాల గదుల్లో విద్యుత్ సౌకర్యం మాటేలేదు. పెచ్చులూడిపోయిన ఫ్లోరింగ్‌తో విద్యార్థులు నానా అవస్థలు పడేవారు. నాడు–నేడు కార్యక్రమం వల్ల 749 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రూ.64 లక్షల వ్యయంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రతి తరగతి గదికి నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు, టైల్స్‌తో ఆకర్షణీయంగా ఫ్లోరింగ్‌ను తీర్చిదిద్దారు. మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశారు.ఆధునిక హంగులతో మరుగుదొడ్లు నిర్మించారు. లైబ్రరీ, ఆధునిక ల్యాబ్ ఏర్పాటు చేశారు. -
Nadu Nedu: మా బడి భలే భలే
అఖిల్ సిటీలో కాన్వెంట్లో చదువుతున్నాడు. కోవిడ్ టైమ్ కావటంతో అమ్మమ్మ–తాతయ్య ఊరికెళ్లాడు. ఓ రోజు అక్కడి ప్రభుత్వ స్కూలుకు తీసుకెళ్లాడు వాళ్ల తాతయ్య. ఆ స్కూల్లో ఉన్న సౌకర్యాలు చూసి అఖిల్ మైమరచిపోయాడు. అక్కడి ల్యాబ్‌లో, పచ్చిక బయలులో రెండు మూడు గంటలు గడిపేశాడు. తిరిగి వస్తూ ఆ స్కూల్ గురించి వాళ్ల తాతయ్యతో ఒకటే కబుర్లు. మరి కాన్వెంట్లో చదువుతున్న పిల్లాడికి ల్యాబ్ గురించి తెలీదా? నిజానికి ల్యాబ్ అంటే తెలుసు. కానీ వాళ్ల స్కూల్లో మాత్రం లేదు. ఆ స్కూలు మాత్రమే కాదు. అలా దాదాపు 90 శాతం ప్రయివేటు స్కూళ్ల పరిస్థితి అదే. ఇళ్ల మధ్య.. రణగొణ ధ్వనుల మధ్య చిన్న చిన్న బిల్డింగులే వారి స్కూళ్లు. చదువుకుంటే చాలనే అమ్మానాన్నలు... ఫీజులొస్తే చాలనుకునే యాజమాన్యాలు. మరిక ల్యాబ్‌లు ఎక్కడ? పచ్చిక బయళ్లు ఇంకెక్కడ? నిజానికి ప్రభుత్వ స్కూళ్లలో చాలా వాటికి ల్యాబ్‌లు, పచ్చిక బయళ్లు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేక పరికరాలన్నీ మూలన పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చేపట్టిన ‘నాడు–నేడు’ పుణ్యమాని వాటన్నింటికీ మహర్దశ పట్టుకుంది. చాలా వరకు కొత్త పరికరాలు కూడా వచ్చాయి. వీలైన ప్రతి స్కూల్లోనూ పచ్చని చెట్లతో కూడిన ఆవరణ, పచ్చిక బయళ్లను అభివృద్ధి చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో, హైస్కూల్లో, యూపీ స్కూలులో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. రన్నింగ్ వాటర్‌తో కూడిన అధునాతన వాష్ రూమ్‌లను నిర్మించారు. తాగునీటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో విద్యార్థులెవరూ మధ్యలో ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇలా తొలివిడతలో ముస్తాబయిన స్కూళ్లన్నీ పిల్లల్ని భలేగా ఆకట్టుకుంటున్నాయి. బొమ్మలు చూస్తూ.. ఆహ్లాదకర వాతావరణ మధ్య ఆడుతూ పాడుతూ చదువుకుంటే ఆ మజాయే వేరనేది టీచర్లూ అంగీకరించే మాట. మరో రెండ్రోజుల్లో పిల్లలందరికీ కొత్త స్కూలు అనుభవంలోకి రాబోతోంది మరి! గతంలో మా పాఠశాలలో 1వ తరగతినుంచి 7వ తరగతివరకు 168 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెండింతలు పెరిగి 300కు చేరింది. ఇకపై మురారిపల్లె గ్రామం నుంచి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వారు ఎవరూ ఉండరు. పట్టణాల్లోని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో విద్యార్థులకు కావలసిన వసతులన్నీ కల్పించాం. చిన్న పిల్లలు ఆడుకోవటానికి పార్కుల్లో ఉండే రంగులరాట్నం, జారుడు బండ, ఊయల లాంటివి ఏర్పాటు చేశాము. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మురారిపల్లె యూపీ స్కూల్ స్వాతంత్య్రోద్యమానికి అక్షరాయుధాలు అందించిన గ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని సిద్ధాపురం. ఇంతవరకూ మా పాఠశాలలో కనీస వసతులు లేవు. మరుగుదొడ్డి ఉన్నప్పటికీ పాఠశాలకు వెళ్లిన వెంటనే గుప్పున వచ్చే దుర్వాసనతో ముక్కు బద్దలయ్యేది. గతంలో పిల్లలు చేతులు కడుక్కునేందుకు సౌకర్యమే ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో నాడు–నేడు పథకం మా పాఠశాలకు మంజూరైందనగానే పట్టరాని ఆనందం కలిగింది. ఇప్పుడు ప్రహరీ నిర్మాణం, అధునాతన, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల కల్పనతో సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఎం వైఎస్ జగన్‌చేపట్టిన ఈ అభివృద్ధి పేద విద్యార్థుల ఆరోగ్య, విద్యా వికాసానికి ఎంతో దోహదపడుతుంది. ప.గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం పాఠశాలలో గతంలో తాగునీటి పరిస్థితి ఇలా..; ప్రస్తుతం పాఠశాలలో ఏర్పాటుచేసిన మంచినీటి కుళాయిలు, హ్యాండ్ వాష్ బేసిన్ ‘వర్షం పడితే మా స్కూల్లో మొత్తం గదులన్నీ నీరు కారి విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థమయ్యేది కాదు. మరుగుదొడ్లు లేక పిల్లల్ని ఇళ్లకు పంపేవాళ్లం. నాడు –నేడు కార్యక్రమంతో పాఠశాలలో గదులన్నీ ఆధునికీకరించారు. ఆట స్థలానికి ఎకరం భూమిని సేకరించాం. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్‌తో విద్యార్థులకు తాగునీటి కొరత తీరింది. వాష్‌రూమ్ కోసం పిల్లలు ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అనేది అనంతపురం జిల్లా ఓడీ చెరువు మండలం మిట్టపల్లి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ ఎం.పి.పి.స్కూల్ ఆవరణ కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్లలోని ప్రాథమికోన్నత పాఠశాలలోనూ వర్షం వస్తే అంతా బురదమయమైపోయేది. నాడు–నేడుతో మెరకతోలి ఆవరణంతా ఎత్తు చేశారని, విద్యార్థులను ఆకర్షించేలా తరగతి గదిలో బొమ్మలు వేశారని.. మల్టీప్లెక్స్ థియేటర్లో మాదిరి అధునాతన సౌకర్యాలతో మరుగుదొడ్లను నిర్మించారని విద్యార్థిని తల్లి పల్లగాని వెంకటేశ్వరమ్మ సంబరపడుతోంది. ‘‘ఐదో తరగతి చదువుతున్న మా అమ్మాయి చందన ఇక వాష్‌రూమ్ కోసం ఇంటికి రానవసరం లేదు. ఆటస్థలం అభివృద్ధి చేశారు. కొంత స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు. మొత్తంగా స్కూలంటే ఇలా ఉండాలనేలా తీర్చిదిద్దారు’’ అంటూ ప్రశంసిస్తోంది. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ గతంలో మా పాఠశాలలో మరుగుదొడ్లు లేక చాలా అవస్థలు పడేవాళ్లం. మూత్ర విసర్జనకు స్కూలు పక్కనే ఉన్న చిన్న స్థలంలో పని కానిస్తుండేవాళ్లం. టీచర్లు, సహచర విద్యార్ధినిలు అటుగా రాకపోకలు సాగిస్తున్నప్పడు మూత్ర విసర్జన చేయడానికి ఇబ్బందిగా ఉండేది. చేతులు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉండేవి కావు. మల విసర్జనకు పరుగెత్తుకుంటూ ఇళ్లకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వం పాఠశాలలో మరుగుదొడ్లను కొత్తగా నిర్మించింది. నీటి వసతి కోసం ట్యాంక్‌ను కట్టించింది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు సమకూరడం గర్వంగా ఉంది. విద్యార్థులు మూత్ర విసర్జనకు వినియోగించే ఖాళీ స్థలం; సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన వాష్ రూమ్ – సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్ -
ఈనెల 25 నాటికి వాల్ పెయింట్లను పూర్తి చేయాలి: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో ఈనెల 25 నాటికి వాల్ పెయింట్లను పూర్తి చేయాలి మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలన్నారు. ఆయన మనబడి:నాడు-నేడుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన బడి నాడు- నేడు’ ఒక మహాయజ్ఞం అని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విభాగం, తల్లిదండ్రులు కమిటీ సమష్టి కృషి వల్లే కార్యక్రమం విజయం వైపు బాటలు వేస్తుందన్నారు. మొదటి దశలో భాగంగా 15,715 పాఠశాలల్లో జరుగుతున్న ‘మనబడి:నాడు-నేడు’ పనులు సంపూర్ణ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో వాల్ పెయింట్ పనులు ఇంకా పూర్తి కాలేదని, వాటిని ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు తెరిచే సమయం తక్కువగా ఉండడంతో త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. వాల్ పెయింట్లలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని అన్నారు. మన రాష్ట్రంలో చేపడుతున్న ‘మన బడి : నాడు-నేడు’ పనులు చూసి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు పరిశీలించి మెచ్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వాక్సిన్ ప్రక్రియ ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తున్న పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిని ఒక ప్రత్యేక డ్రైవ్ గా చేపట్టి 100 శాతం పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్యాల్లో పని చేస్తున్న 168911 మంది ఉపాధ్యాయుల్లో ఈనెల 10వ తేదీ నాటికి తొలి విడత వ్యాక్సిన్ 81994 (48.5 %) వేయించుకున్నారని తెలిపారు. వీరిలో 45 ఏళ్ల లోపు ఉపాధ్యాయులు 75183 మంది ఉండగా 35101 మంది తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వాళ్లు 93728 మంది ఉండగా 46893 తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు. రెండో విడత వ్యాక్సిన్ 57056 (33.8%) మంది వేసుకోగా 45 లోపు వాళ్లు 15367 మంది, 45 ఏళ్లు పైబడినవాళ్లు 41689 మంది ఉన్నారని అన్నారు. వీరంతా ఈనెల 31 నాటికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి), జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, ఐటిడీఏ పీవోలు, డీఎంహెచ్ఓలు పాల్గొన్నారు. -
ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం‘మన బడి–నాడు నేడు’ కింద పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ.. సంస్కరణలు సత్ఫలితాలిచ్చేలా కార్యాచరణ దిశగా అడుగులేస్తోంది. పాఠశాల విద్యలో దశల వారీగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పద్ధతుల్లో బోధన చేసేలా ఉపాధ్యాయులనూ సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సామర్థ్యాలను మెరుగుపర్చేలా సీబీఎస్ఈ పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ బోధన కొనసాగించడంతో పాటు మూల్యాంకన రీతులను అనుసరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీమ్యాచ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్’ (సీమ్యాట్) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న దాదాపు 90 వేల మంది టీచర్లను ఈ శిక్షణలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తారు. తద్వారా విద్యార్థులకు ఉత్తమ పరిజ్ఞానం అందించి వారి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ బోధనా విధానం (టీచింగ్ మెథడాలజీ), మూల్యాంకన పద్ధతులపై తర్ఫీదు ఇస్తారు. కరోనా నేపథ్యంలో దీక్షా డిజిటల్ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి జూలై 3వ తేదీ వరకు కొనసాగే శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. శిక్షణ ముఖ్యోద్దేశాలివీ.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 1–6వ తరగతి వరకు పుస్తకాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నూతన పాఠ్య పుస్తకాల నేపథ్య పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత, ప్రయోగాత్మక అభ్యసనాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను లక్ష్యాలను సాధించేలా సీబీఎస్ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దనున్నారు. అభ్యసన ఫలితాలు సాధించడంపై కంటెంట్ అనాలసిస్‌తోపాటు సృజనాత్మక రీతుల్లో బోధనాభ్యసన విధానాలను అనుసరించేలా తర్ఫీదునిస్తారు. మూల్యాంకన విధానాలు, సాధనాలు, మూల్యాంకన ప్రాసెస్‌లపై శిక్షణ ఇస్తారు. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన సామర్థ్యాలతో విద్యార్థులకు బోధన చేసేలా శిక్షణ ఇస్తారు. తెలుగు మాధ్యమంలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమ బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇలా.. ► ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ బోధనపై శిక్షణ ఉంటుంది. ► దీక్షా ప్లాట్ఫారం ద్వారా నిర్వహించే ఈ కోర్సు నిడివి 12 గంటలు. ఆన్లైన్లో రోజుకు గంట చొప్పున మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 12 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు. ► ఎన్సీఈఆర్టీ–న్యూఢిల్లీ, రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ), మైసూర్‌కు చెందిన ప్రొఫెసర్లు, కేంద్రియ విద్యాలయాల బోధనా సిబ్బంది రిసోర్సు పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదీ షెడ్యూల్ ఇంగ్లిష్: జూన్ 21 నుంచి 24వ తేదీ వరకు, మేథమెటిక్స్: జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు, ఈవీఎస్: జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు. నూతన పాఠ్య పుస్తకాలు రెడీ.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పంపిణీకి సిద్ధమైన నూతన పాఠ్య పుస్తకాలు సంఖ్య తరగతి పాఠ్య పుస్తకాల సంఖ్య 1వ తరగతి 29,10,424 2వ తరగతి 30,96,822 3వ తరగతి 39,46,165 4వ తరగతి 39,40,938 5వ తరగతి 38,68,931 6వ తరగతి 35,38,818 7వ తరగతి 36,43,742 8వ తరగతి 41,19,992 9వ తరగతి 39,58,521 10వ తరగతి 37,93,110 -
2 Years YSJagan Ane Nenu: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
వెబ్‌డెస్క్: వివిధ పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో విద్యార్థినీ విద్యార్థులకు చేయూత అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి అంటూ పదే పదే చెబుతుంటారు సీఎం వైఎస్ జగన్. అందుకు తగ్గట్టే విద్యారంగానికి పెద్ద పీఠ వేశారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రెండేళ్లలో అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అదే స్థాయిలో విద్యారంగంలో సంక్షేమానికి చోటు కల్పించారు. జగనన్న అమ్మఒడి దేశ చరిత్రలోనే తొలిసారిగా తల్లుల గురించి, వారి పిల్లల చదువుల గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో జగనన్న అమ్మఒడి పథకం ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులందరికీ ఈ సాయం వర్తింప చేస్తున్నారు. ఈ పథకం క్రింద రెండేళ్లలో 44,48,865 మంది విద్యార్థులకు రూ.13,022.90 కోట్ల సాయాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారి ఆప్షన్ మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం జగన్ ఆరంభించారు. దీని ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ , ఈబీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ని అమలు చేస్తున్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెంచడం కోసం నాలుగు దఫాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే నేరుగా ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం క్రింద రెండేళ్లలో 18,80,934 మందికి రూ.4,879.30 కోట్ల లబ్ది జరిగింది. జగనన్న వసతి దీవెన ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల నిమిత్తం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో 20వేల వరకు ఆర్థిక సాయం అందించారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20వేల చొప్పున కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం క్రింద రెండేళ్లలో 15,56,956 మందికి రూ.2,269.93 కోట్లు జమ చేశాం. జగనన్న విద్యా కానుక ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం ద్వారా బడులు తెరవకముందే కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్,షూస్ తో పాటు ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. చదువుపై సీఎం జగన్‌కి ఉన్న ప్రత్యేక అభిమానానికి ఈ పథకం ఓ ఉదాహరణ. ఈ పథకం క్రింద రెండేళ్లలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులకు రూ.781 కోట్లతో లబ్ది జరిగింది. మనబడి నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చివేసి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సీఎం జగన్ రూపొందించిన వినూత్న కార్యక్రమం మనబడి నాడు-నేడు. ఈ కార్యక్రమం క్రింద మూడు దశల్లో రూ.16,700 కోట్ల వ్యయంతో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లతో పాటు 28,169 అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు సమూలంగా మారనున్నాయి. మరో 27,438 అంగన్ వాడీలకు కొత్త భవనాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, ప్రహారీ గోడలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు, కిచెన్, ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించేలా ఇంగ్లీష్ ల్యాబ్ వంటి మంచి వసతులు ఈ పథకం ద్వారా కల్పించనున్నారు. తొలివిడతలో రూ. 3,669 కోట్ల వ్యయంతో 15,717 పాఠశాలలు పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,16,241 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 78,579 పనులు పూర్తయ్యాయి జగనన్న గోరుముద్ద రాష్ట్రవ్యాప్తంగా 45,854 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 36,88,618 మంది విద్యార్థులకు రూ.1,600 కోట్ల వ్యయంతో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. నైపుణ్యం పెంచే దిశగా చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రూ. 1200 కోట్లతో 30 నైపుణ్య కళాశాలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర సౌకర్యాలు ఉండే అద్దె భవంతుల్లో కాకుండా ప్రతీ కాలేజీకి 5 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు రూ. 40 కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పటికే 21 కాలేజీలకు సంబంధించి స్థల సేకరణ కూడా పూర్తయ్యింది. వీటికి దిశానిర్ధేశం చేసేందుకు తిరుపతిలోని కోబాక వద్ద 50 ఎకరాల విస్తీర్ణంలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం సీఎం జగన్ ముందు చూపుకి నిదర్శనం. నైపుణ్య కళాశాలలో వందకు పైగా కోర్సులు అందివ్వనున్నారు. ఇందులో టెక్నికల్ 49, నాన్ టెక్నికల్ 41, సెక్టోరియల స్కిల్ 20 రకాల కోర్సులు ఉన్నాయి. విద్యారంగంలో విప్లవాత్మక కార్యక్రమాలు - పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు పాఠశాలల్లో ప్రాథమికస్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన - విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 2021-22 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ అమలు - 2021-22 విద్యా సంవత్సరం నుండి అన్ని డిగ్రీ కోర్సులలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన - అంగన్ వాడీలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేసి పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాసుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన - జూన్ 2019 నుండి ఇప్పటివరకు రెండేళ్లలో విద్యా రంగంపై మొత్తం రూ.25,714 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్ వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తోంది. -
Manabadi Nadu Nedu: నాణ్యతలో రాజీవద్దు
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పనిలో నాణ్యత (క్వాలిటీ)తో కూడిన ఆడిటింగ్ జరగాలని, అన్ని స్కూళ్లలో పనుల్లో నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు. మే, జూన్ రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా సూచించారు. మే చివరి నాటికి ‘మన బడి నాడు–నేడు’ మొదటి దశ పనులు పూర్తవ్వాలని ఆదేశించారు. జూలైలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకుసూచించారు. ‘మనబడి నాడు–నేడు’ మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిపై సీఎం జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరిస్తూ వాటిని ప్రజెంటేషన్‌ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. బిల్డింగ్స్‌పై కూడా పెయింటింగ్స్ వేయండి ‘‘స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్ వేయండి. మన బడి నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్లో నాడు ఆ స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అన్న ఫొటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుంది. స్కూళ్లలో పెయింటింగ్ పనులు, స్మార్ట్ టీవీలు, వాల్ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు. అందుకే పేరెంట్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలి. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదు. అలాగే మే, జూన్ నెలల్లో పూర్తిగా పనుల నాణ్యతను చూడాలి. ప్రతి స్కూల్ సందర్శించాలి. అన్నీ నోట్ చేయాలి. క్వాలిటీ ఆడిట్ పూర్తి కావాలి. టాయిలెట్ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే వారు ఏ ఇబ్బందీ లేకుండా ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పగలుగుతారు. పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా సిద్ధం కావాలి. ఈసారి కిట్లలో ఇంగ్లీష్ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి. జూలైలో స్కూళ్లు తెరవగానే మనబడి నాడు–నేడు రెండో దశ పనులు మొదలు కావాలి. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు విద్యార్దుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది చెప్పాలి. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్నీ ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు వస్తాయి? పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా? కేవలం పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.నిజానికి పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కేవలం విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్ గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు. అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి.’’ అని సీఎం పేర్కొన్నారు. ఇంకా ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి రెండో విడత ‘మనబడి నాడు-నేడు’
సాక్షి, తాడేపల్లి: ‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘మనబడి నాడు– నేడు, జగనన్న విద్యా కానుక’పై సమీక్ష నిర్వహించారు. రెండో విడతలో భాగంగా ప్రైమరీ పాఠశాలలు 9,476, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 822, రెసిడెన్షియల్ స్కూళ్లు సహా హైస్కూళ్లు 2,771, జూనియర్ కాలేజీలు 473, హాస్టళ్లు 1,668, డైట్ కాలేజీలు 17, ఎంఆర్‌సీఎస్ 672, భవిత కేంద్రాలు 446 చోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. (చదవండి: వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్) ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్, మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, సర్వ శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’) టాయిలెట్ కేర్‌టేకర్: ♦ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు ♦దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం ♦టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కేర్ టేకర్‌కు సగటున రూ.6 వేలు చెల్లింపు. ♦టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా ♦పిల్లల సంఖ్యను అనుసరించి నలుగురు వరకు టాయిలెట్ల కేర్ టేకర్లు. వేయికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురు కేర్ టేకర్లు. ♦టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్న సీఎం అంగన్వాడీలు: ♦అంగన్వాడీ కేంద్రాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష ♦మార్చి 2021లో మొదటి దశ పనులు మొదలుపెట్టాలని నిర్ణయం ♦రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం ♦మొదటి విడతలో 6,407 కొత్త అంగన్వాడీల నిర్మాణం, 4,171 అంగన్వాడీల్లో అభివృద్ధి పనులు ♦మొత్తం 27,438 కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం. 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపడుతున్న ప్రభుత్వం ♦మొత్తంగా సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వైఎస్సార్ ప్రీప్రైమరీలు: ♦వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లగా అంగన్వాడీలు ♦ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలను సీఎంకు చూపించిన మంత్రి, అధికారులు ♦పుస్తకాల నాణ్యత బాగుండాలని అధికారులకు సీఎం ఆదేశాలు ♦పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామన్న అధికారులు జగనన్న విద్యాకానుక: ♦వచ్చే ఏడాది ఇవ్వాల్సిన విద్యాకానుకపైనా సీఎం సమీక్ష ♦స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦స్కూలు యూనిఫారమ్స్ సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలన్న సీఎం ♦వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం -
‘నాడు–నేడు’తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి
గుంటూరు ఎడ్యుకేషన్: ‘మన బడి నాడు–నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను వారు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 15 వేల ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు మొదటి దశ కింద ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడకుండా నిధులు కేటాయిస్తోందన్నారు. మొదటి దశ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయని.. రెండు, మూడు దశల్లో మరో 30 వేల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఈ స్థాయిలో అభివృద్ధి చేయడం గతంలో ఏ ప్రభుత్వ పాలనలోనూ చూడలేదన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో సైతం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. కమిషన్ సభ్యులతో పాటు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో గంగా భవాని తదితరులున్నారు. -
ఫిబ్రవరికి నాడు–నేడు తొలి దశ పనులు పూర్తి
మన పిల్లలను హాస్టల్లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అలా అన్ని హాస్టళ్లలో ఉండాలి. ముఖ్యంగా బాత్రూమ్లు చక్కగా ఉండాలి. వాటిని బాగా నిర్వహించాలి. ఇంకా చెప్పాలంటే మరమ్మతులు రాకుండా ఉండే మెటీరియల్ వాడాలి. అన్ని బాత్రూమ్లలో హ్యాంగర్స్ కూడా ఉండాలి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనుల ఫలితాలు దీర్ఘకాలం ఉండాలి. పెయింటింగ్ బావుండాలి. నిర్వహణలో ఎక్కడా అలక్ష్యం చూపొద్దు. పక్కాగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఏ స్కూల్లో, ఏ సమస్య వచ్చినా ఎంత వేగంగా స్పందించి, దాన్ని బాగు చేశామన్న దానిపై మన ప్రతిభ, పనితీరు ఆధారపడి ఉంటుంది. గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్రూమ్లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం నేను స్వయంగా చూశాను. అందువల్ల హాస్టళ్లలో బాత్రూమ్ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయండి. ఇప్పటికే హాస్టళ్లలో మెనూకు సంబంధించి యాప్ ఉంది. బాత్రూమ్లపై కూడా యాప్ డెవలప్ చేయాలి. సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు తొలి దశ పనులు కచ్చితంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి కావాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ ఆధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెండో దశ పనుల్లో హాస్టళ్లలో పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. మనబడి నాడు–నేడు తొలి దశ పనుల పురోగతి, జగనన్న గోరుముద్దపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మనబడి నాడు– నేడు పనుల పరిశీలన కోసం విద్యా శాఖలో ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం పది రకాల పనులకు సంబంధించి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. రెండో దశలో చేపడుతున్న పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకు బెడ్లతో సహా, అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలన్నారు. మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలన్నారు. హాస్టళ్లలో కూడా జగనన్న గోరుముద్ద తరహాలో పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో అంగన్వాడీలలో కూడా నాడు–నేడు కింద పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. విద్యా కానుక కిట్‌లో నాణ్యత ► జగనన్న విద్యా కానుక కిట్‌లో ప్రతి ఒక్కటి నాణ్యత కలిగి ఉండాలి. స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ బావుండాలి. ► వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 12న స్కూళ్లు ప్రారంభం అవుతాయనుకుంటే పిల్లలకు జూన్ 1న ఈ కిట్‌ను పంపిణీ చేయాలి. ఆ మేరకు స్కూళ్లలో కిట్లు మే 15 నాటికి సిద్ధంగా ఉండాలి. ► హాస్టల్ పిల్లలకు ప్రతి రోజు ఒక వెరైటీ ఫుడ్ ఉండేలా ప్లాన్ చేయండి. ఆ మేరకు మార్పు చేసిన మెనూ అందుతోందా.. లేదా అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ► రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని 159 మండలాల్లో వాటిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు భవనాల్లో 9,323 అంగన్వాడీలు ఉన్నాయి. పనుల పురోగతి ఇలా.. ► నాడు–నేడు తొలి దశ పనులు కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయి. కానీ అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయి. పేరెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు, సచివాలయాల ఇంజనీర్లు, టాటా ప్రాజెక్టŠస్ వంటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కంపెనీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు, సోషల్ ఆడిటింగ్ జరుగుతోంది. ► తొలి దశలో 15,715 స్కూళ్లలో మొత్తం రూ.1690.14 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 5,735 ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో రూ.5 లక్షలతో, 1,668 హైస్కూళ్లలో రూ.15 లక్షలతో కిచెన్ షెడ్లు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు రూ.537 కోట్లు ఖర్చవుతోంది. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పండుగ వాతావరణం
సాక్షి, అమరావతి : స్కూళ్లలో ఒక పండుగ వాతావరణం కనిపించాలని, స్కూలు భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం.. స్కూల్ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్ వేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రంగులకు సంబంధించి సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు పలు రంగుల నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపారు. సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. ► స్కూల్ బిల్డింగ్‌లకు వేసే కలర్స్ ఆహ్లాదకరంగా ఉండాలి. అక్కడ ఒక పండగ వాతావరణం కనిపించాలి. పిల్లలకు అన్ని విషయాలపై తగిన అవగాహన కలిగేలా గోడలపై చక్కగా బొమ్మలు కూడా గీయించాలి. ► వర్షాకాల సీజన్ ముగిసిన తర్వాత ఆ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలి. లేకపోతే ప్రజాధనం వృథా అవుతుంది. సచివాలయాల ఇంజనీర్లకూ బాధ్యతలు ► గ్రామ సచివాలయాల ఇంజనీర్లు మనబడి నాడు–నేడు పనులను కూడా చూడాలి. వారు ప్రతిరోజూ తప్పనిసరిగా స్కూళ్లను సందర్శించాలి. వారానికి ఒకసారి వారు ఆ పనులపై నివేదిక ఇవ్వాలి. ► స్కూళ్లలో పనులకు సంబంధించి ఎంబీ (మెజర్మెంట్ బుక్)లో రికార్డింగ్ పవర్స్ కూడా సచివాలయ ఇంజనీర్లకే ఇవ్వాలి. ఆ మేరకు ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రూపొందించాలి. ► రెండవ, మూడవ దశ పనులు కూడా సకాలంలో చేపట్టాలి. ఇందుకు అవసరమైన రుణాల సేకరణ ప్రక్రియ చేపట్టాలి. ఇప్పుడు స్కూళ్లలో పనులను పేరెంట్ కమిటీలు చేస్తున్నాయి కాబట్టి వాటిలో ఎలాంటి జాప్యం ఉండబోదు. ఆ పనుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించండి ► మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ఇప్పుడు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు రూ.2 కోట్ల విలువైన పనులు చేస్తున్నారని చెప్పారు. అయితే పలు చోట్ల దాతలకు అప్పగించిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ..వెంటనే ఆ పనుల బాధ్యత జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, శాఖ కమిషనర్ చినవీరభద్రుడుతో పాటు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై హై పవర్ కమిటీ నివేదిక) -
మారుతున్న పాఠశాలల రూపురేఖలు