
సాక్షి, విశాఖపట్నం: మున్ముందు కోవిడ్ ఫోర్త్ వేవ్ వచ్చినా అది ప్రాణాంతకం కాబోదని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ (ఇన్సా) అధ్యక్షురాలు చంద్రిమా షాహా తెలిపారు. ఇప్పటికే దేశంలో 90 శాతం మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కోవిడ్ తీవ్రత అంతగా ఉండబోదని చెప్పారు. వ్యాక్సినేషన్ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) వస్తుందని, దీంతో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు దోహదపడుతోందని వివరించారు. విశాఖలో జరుగుతున్న ఇన్సా సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
చైనాలో కొన్నాళ్ల నుంచి కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో కోవిడ్ ఉధృతి ఉన్నా అక్కడ మరణాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తలెత్తుతున్న దుష్పరిణామాలపై పూర్తి స్థాయిలో ఫలితాలు రావలసి ఉందన్నారు.
చదవండి: (ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం)
Comments
Please login to add a commentAdd a comment