
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 45 ఏళ్లు నిండిన వారికి తొలి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ టీకా స్పెషల్ డ్రైవ్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇక జర్నలిస్టులకు కూడా తొలి డోస్ వ్యాక్సిన్ ఇవ్వనుంది. రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 78,78,604 మందికి వ్యాక్సిన్ వేశారు. 1.55 లక్షల డోసులు కోవాగ్జిన్, 11.58 లక్షల డోసులు కోవిషీల్డ్‌ను జిల్లాలకు పంపించారు. 23.38 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. జూన్ 15 వరకు రాష్ట్ర వద్ద ఉన్నది, కేంద్రం ఇచ్చేది అంతా కలిపితే 28.56 లక్షల డోసులు కానుంది.
చదవండి: Cyclone Yaas: అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్