సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపు (శనివారం) 13 జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో డ్రై రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రి, అర్బన్/రూరల్ పీహెచ్‌సీలో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గత నెల 28న కృష్ణా జిల్లాలోని ఐదు ఆస్పత్రుల్లో డ్రై రన్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్)
డ్రై రన్ అంటే?
నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు.(చదవండి: కరోనా వైరస్ : చైనా గుడ్‌న్యూస్)
Comments
Please login to add a commentAdd a comment