ఎవరికీ తెలియని. పెద్దగా పరిచయమూ లేని వ్యక్తి. కానీ, ఈనాడు మాత్రం ఆర్థిక మేధావిగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుని బొక్కా బోర్లా పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనతో జీవీ రావుతో ఓ ప్రకటన చేయించిన రామోజీరావు, దాన్ని ప్రముఖంగా ప్రచురించి హైలెట్ చేయాలనుకున్నారు. కానీ, ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తక ముందే జగన్ సర్కార్ అప్రమత్తం అయ్యింది. కీలక గణాంకాలతో యెల్లో మీడియా అవాస్తవాలను ప్రజల ముందు ఉంచడంతో పాటు యెల్లో మీడియా కుట్రను, ఆ కుహనా మేధావి అసలు రంగును బయటపెట్టింది.
గంటా వెంకటేశ్వర రావు అలియాస్ జీవీ రావు.. ఏపీ ఆర్థిక పరిస్థితులపై తప్పుడు విశ్లేషణలకు దిగాడని ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే జీవీ రావును గతంలో ఐసీఏఐ(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) ఆయన్ని నోటీసులు ఇచ్చి మరీ తొలగించిన విషయాన్ని గుర్తు చేశారాయన. పైగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఐసీఏఐ నోటిఫికేషన్‌లో.. ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్(వృత్తిపరమైన దుషప్రవర్తన) కారణంగా ఘంటా వెంకటేశ్వరరావును రిజిస్టర్ మెంబర్‌గా రెండేళ్లపాటు తొలగించడంతో పాటు 50వేల జరిమానా కూడా విధించింది.
👉 జీవీ రావు వాస్తవానికి ఆర్థిక నిపుణుడు కాదు. వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి. కేవలం సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అనామకుడు. అందుకే అతన్ని ఆర్థిక నిపుణుడి ట్యాగ్ లైన్ తగిలించి.. ఏపీ ఆర్థిక పరిస్థితి, పాలసీలపై ఈనాడులో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఆ వేషాలు ఏపాటివో ఏపీ ప్రజలకు తెలియాలి కదా.
👉 ఈ డ్రామాలో జీవీ రావు కేవలం పాత్రధారి మాత్రమే. రామోజీరావు డైరెక్షన్ అయితే.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఆ అసత్యాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఎంతలా అంటే.. దిగజారిపోయి మరీ ఏపీ శ్రీలంక, పాకిస్థాన్‌లా మారిపోయిందని, అప్పుల పాలయ్యిందనే అభ్యంతరకర ప్రచారాలకు తెర తీశారు.
👉 సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని, ఏదో అయిపోతోందని ఈనాడు చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదని.. కొందరికి మేధావి అంటూ తోక తగిలించి వారితో మాట్లాడిస్తోంది.
👉 వాళ్లేమో తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన జీవీ రావు.. తెలుగుదేశం పార్టీ లైన్ మీదే నడిచారు. ఆ పార్టీ సీఎం జగన్ సంక్షేమ ప్రభుత్వంపై ఎలాగైతే విమర్శలు చేస్తోందో.. అవే వ్యాఖ్యలు చేశాడు. తద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారు.
ఇదీ చదవండి: ఏపీ అప్పులపై క్లారిటీ ఇదిగో
Comments
Please login to add a commentAdd a comment