
సాక్షి, తిరుపతి: మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1980-83లో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఆమె పనిచేశారు. 1985-89లో వేపంజేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు.
1991-92లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 1992-93లో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో నియోజకవర్గాలు పునర్విభజన కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2007-09లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు.
చదవండి: AP: హైకోర్టులో ‘ఈనాడు’కి ఎదురుదెబ్బ..
సీఎం సంతాపం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment