
పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన ఏపీ పోలీస్ బ్యాండ్ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ఒక్క పోలీసులు మాత్రమే రోడ్డు మీద నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు. ఈ క్రమంలో 206 మంది పోలీసులు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందజేసిన బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. కోవిడ్ సమయంలో 24/7 హెల్ప్‌లైన్‌తో పోలీసు కుటుంబాలకు వైద్యసేవలు అందించిన ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ సతీమణి సుమిత్రా రవిశంకర్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.