
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పాడేరు/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలుల తీవ్రత మరో రెండు రోజులు పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమవారం సాధారణం కంటే 3.7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
ఈ సీజన్‌లోనే అత్యల్పంగా చింతపల్లిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, నందిగామలో 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతిశీతల ప్రాంతాలైన లంబసింగి, పాడేరు ఘాట్, డల్లాపల్లి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment