Happy Birthday CM YS Jagan: హ్యాపీ బర్త్‌డే జగనన్న.. వెయ్యేళ్లు వర్థిల్లు | Happy Birthday AP CM YS Jagan Mohan Reddy Fan Emotional Wishes | Sakshi
Sakshi News home page

Happy Birthday CM YS Jagan: హ్యాపీ బర్త్‌డే జగనన్న.. వెయ్యేళ్లు వర్థిల్లు

Published Tue, Dec 21 2021 1:42 PM | Last Updated on Sat, Jan 8 2022 4:08 PM

Happy Birthday AP CM YS Jagan Mohan Reddy Fan Emotional Wishes - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు కూడా సోషల్‌ మీడియా వేదికగా తమ ప్రియతమ నాయకుడికి విషెస్‌ చెబుతున్నారు. ‘‘హ్యాపీ బర్త్‌డే జగనన్న’’ అంటూ జననేతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు. సాక్షి.కామ్‌ సైతం జనహృదయ నేతకు బర్త్‌డే విషెస్‌ చెబుతోంది.

పేదింటి పెద్ద కొడుకుగా
అవ్వాతాతల ముద్దుల మనవడిగా
ఆడపడుచులకు అన్నగా
విద్యార్థులకు మేనమామగా

రైతుల పాలిట ఆపద్భాందవుడిగా
బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా
ప్రజా సంక్షేమ సారథిగా
రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తూ

మా గుండెల్లో గూడు కట్టుకున్న జనహృదయ నేత
రాజన్న తనయుడా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

నీ చిరునవ్వే మా ఆశాజ్యోతి
నీ నాయకత్వమే.. మా బతుకుల్ని వెలిగించే దీపం
నీ సంక్షేమాభిలాష.. మా పాలిట సంజీవని
నీ అభివృద్ధి కార్యక్రమాలు.. రాష్ట్రాన్ని ముందుకు నడిపే ఇంధనాలు

నువ్వు ఇలాగే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్థిల్లాలి
అశేష జనవాహిని ఆశీస్సులతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి
హ్యాపీ బర్త్‌డే జగనన్న

-సాక్షి, వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement