వైరల్‌ : క్షణాల్లో కుప్పకూలిన భారీ క్రేన్‌ | Hindustan Shipyard Crane Collapses VIdeo Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: క్షణాల్లో కుప్పకూలిన భారీ క్రేన్‌

Published Sat, Aug 1 2020 5:21 PM | Last Updated on Sat, Aug 1 2020 7:52 PM

Hindustan Shipyard Crane Collapses VIdeo Viral - Sakshi

సాక్షి, విశాఖపట్నం: హిందూస్తాన్‌ షిప్ ‌యార్డులో శనివారం భారీ క్రేన్‌ కూప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.  క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ కుప్పకూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రేన్‌ పరిమాణం భారీగా ఉండటం, క్షణాల్లో కుప్పకూలడంతో దాని కింద ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు వీలుపడలేదు. కళ్లు మూసి తెరిచేలోపల ఈ ప్రమాదం జరిగిపోయింది. ప్రమాద సమయంలో దాదాపు 18 మంది క్రేన్‌ కింద ఉన్నట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
(చదవండి : హిందుస్తాన్‌ షిప్ ‌యార్డు ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా)

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు.


(చదవండి : హిందుస్తాన్‌ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement