
భూమి అప్పగింత పత్రం తీసుకుంటున్న చంద్రమౌళిరెడ్డి
సాక్షి, చిత్తూరు : జిల్లాలో హార్సిలీహిల్స్, తిరుపతిని ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని జిల్లా పర్యాటకశాఖ అధికారి డీవీ చంద్రమౌళిరెడ్డి చెప్పారు. మంగళవారం హార్సిలీహిల్స్ వచ్చిన ఆయన రెవెన్యూశాఖ టూరిజానికి కేటాయించిన 10.50 ఎకరాల భూమి పత్రాన్ని వీఆర్‌ఓ ఖాదర్‌బాషా నుంచి స్వీకరించారు. ఆయన విలేకరులతో మా ట్లాడుతూ హార్సిలీకొండపై ఇప్పటికే ఉన్న మూడెకరాలు కలుపుకుంటే ఇప్పుడు 13.50 ఎకరాలుందన్నారు. ఇందులో రిసార్ట్స్ ని ర్మించి అభివృద్ధి చేయాలన్నది సీఎం ఆలోచనగా చెప్పారు. (నేడు శ్రీవారికి సీఎం పట్టువ్రస్తాల సమర్పణ)
స్టార్ హోటళ్ల తరహా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందనున్నట్టు చెప్పారు. తిరుపతిలో పర్యాటక అభివృద్ధి కోసం 15 నుంచి 20 ఎకరాలు కావాలని రెవెన్యూ అధికారులను కోరామన్నారు. కైలాసగిరి తరహాలో పార్కును అభివృద్ధి చేయడంతో పలు కార్యక్రమాల నిర్వహణ కోసం భూ కేటాయింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. పర్యాటకశాఖతో అనుబంధంగా ప్రయివేటు హోటళ్లు, పర్యాటక స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్పందన లభిస్తోందని చెప్పారు. శాఖ వెబ్‌సైట్‌లో ప్రైవేటు వివరాలను ఉంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment