Tourist centers
-
యుద్ధభూమిని చూద్దాం రండి!
సాక్షి, అమరావతి: లాంగేవాలా.. 1971 భారత్–పాకిస్తాన్ యుద్ధం కారణంగా మన దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రాంతం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జేపీ దత్తా రూపొందించిన క్లాసిక్ ఫిల్మ్ ‘బోర్డర్’ ద్వారా కళ్లముందు సాక్షాత్కరించిన యుద్ధభూమి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎడారిని సందర్శించే పర్యాటకులకు కేంద్ర బిందువు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆవిష్కరించిన వార్ మెమోరియల్ కూడా. 120 మంది భారతీయ సైనికులతో కూడిన చిన్న దళం రెండువేల నుంచి మూడువేల మంది సైనికులతో కూడిన పాకిస్తానీ బలగాలను చిన్నచిన్న యుద్ధ ట్యాంకులు, ఫిరంగులతో ఎదురొడ్డి నిలిచి గెలిచింది.ఇక్కడ ఈ యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను వీక్షించడం, భారతీయ సైనికుల త్యాగాలను గౌరవించడం, ఆర్మీ నిర్వహించే దుకాణం నుంచి స్మృతి చిహ్నాలను కొనుగోలు చేయడం ద్వారా సందర్శకులు అద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు. ఈ స్ఫూర్తితోనే భారత సైనిక వారసత్వ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. దేశ యుద్ధకాలపు చరిత్ర అన్వేషణకు బాటలు వేస్తోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అత్యంత ప్రసిద్ధిచెందిన యుద్ధభూముల్లోకి మునుపెన్నడూ లేని విధంగా పౌరులను తీసుకెళ్లనుంది. ‘యుద్ధభూమి పర్యాటకాన్ని’ ప్రోత్సహించేలా భారత్ రణభూమి దర్శన్ యాప్‌ను సైతం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా యుద్ధభూములను, సరిహద్దు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తోంది.సరిహద్దు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం..‘యుద్ధభూమి’ పర్యాటక ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక వనరులను సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మారుమూల ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించడం ద్వారా అక్కడ మౌలిక సదుపాయాలను, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, వలసలను అరికట్టడంలో సహాయపడుతుందని ఆర్మీ భావిస్తోంది. దీంతో.. దేశ సైనిక చరిత్రను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతాలపై చారిత్రక అవగాహన, దేశభక్తి, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు బహుముఖ లక్ష్యంతో అడుగులు వేస్తోంది.‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ కింద రక్షణ వారసత్వాన్ని ప్రచారం చేయనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబిథూ, లద్ధాఖ్లోని రెజాంగ్ లా (1962 చైనా–భారత్ యుద్ధంతో ముడిపడి ఉన్న ప్రాంతాలు) వంటి ప్రదేశాలకు పౌరులను తీసుకెళ్లడం ద్వారా భారతదేశ యుద్ధకాల చరిత్రను చాటిచెప్పనుంది. వీటితో పాటు యుద్ధ స్మారక చిహ్నాలైన ద్రాస్ వార్ మెమోరియల్ (కార్గిల్ వార్, 1999), వాలాంగ్ వార్ మెమోరియల్ (వాలాంగ్ యుద్ధం–1962) తవాంగ్ వార్ మెమోరియల్, లోంగేవాలా వార్ మెమోరియల్, ఆపరేషన్ మేఘదూత్ వార్ మెమోరియల్‌లను యుద్ధభూమి టూరిజం సర్క్యూట్‌కు అనుసంధానిస్తోంది.12వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ సందర్శన..ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్. ఇక్కడ 1984 నుంచి చాలా ఏళ్లపాటు భారత్–పాక్ దళాల మధ్య ఘర్షణ వాతావరణం నడిచేది. 2023లో పర్యాటకులకు అనుమతిస్తూ.. ఈ మంచు పర్వతాల్లో సైనికులు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను సామాన్యులకు పరిచయం చేసింది. సందర్శకులు 12వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి ఈ ప్రాంతాన్ని అన్వేషిస్తున్నారు.ఇక 2020లో ఇండియా–చైనా ఘర్షణ జరిగిన ప్రదేశం గాల్వాన్.. 1971 ఇండియా–పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించిన ప్రాంతం లాంగేవాలా.. భారతదేశ సైనిక చరిత్రలో కీలక స్థానాలైన రెజాంగ్ లా, బమ్ లా పాస్, పాంగోంగ్ త్సో, డోక్లామ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను రణభూమి దర్శన్ యాప్ ద్వారా అందిస్తోంది. ఇందులో 77 యుద్ధభూములకు చెందిన సమగ్ర చారిత్రక కథనాలను అందిస్తోంది. వీటిని సందర్శించాలనుకునే వారి కోసం ఈ వెబ్సైట్ సమగ్ర ప్రయాణ వివరాలను అందిస్తుంది. నిషేధిత ప్రాంతాలను సందర్శించడానికి అవసరమైన అనుమతులు, దరఖాస్తుల వివరాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌తో పాటు వివిధ పట్టణాలలో ఆధునిక మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రులు తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా యోసూ పట్టణంలోని బిగ్ ఓ మ్యూజికల్ ఫౌంటెన్ షోను శనివారం మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఫౌంటెన్ కంటే ఆధునికమైన ఫౌంటెయిన్‌ను కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాలను పరిశీలించి ఆధునిక హంగులతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో పనిచేసే మ్యూజికల్ ఫౌంటెయిన్లు, జెయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటిని కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. -
పర్యాటక కేంద్రాలుగా హార్సిలీహిల్స్, తిరుపతి
సాక్షి, చిత్తూరు : జిల్లాలో హార్సిలీహిల్స్, తిరుపతిని ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని జిల్లా పర్యాటకశాఖ అధికారి డీవీ చంద్రమౌళిరెడ్డి చెప్పారు. మంగళవారం హార్సిలీహిల్స్ వచ్చిన ఆయన రెవెన్యూశాఖ టూరిజానికి కేటాయించిన 10.50 ఎకరాల భూమి పత్రాన్ని వీఆర్ఓ ఖాదర్‌బాషా నుంచి స్వీకరించారు. ఆయన విలేకరులతో మా ట్లాడుతూ హార్సిలీకొండపై ఇప్పటికే ఉన్న మూడెకరాలు కలుపుకుంటే ఇప్పుడు 13.50 ఎకరాలుందన్నారు. ఇందులో రిసార్ట్స్ ని ర్మించి అభివృద్ధి చేయాలన్నది సీఎం ఆలోచనగా చెప్పారు. (నేడు శ్రీవారికి సీఎం పట్టువ్రస్తాల సమర్పణ) స్టార్ హోటళ్ల తరహా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందనున్నట్టు చెప్పారు. తిరుపతిలో పర్యాటక అభివృద్ధి కోసం 15 నుంచి 20 ఎకరాలు కావాలని రెవెన్యూ అధికారులను కోరామన్నారు. కైలాసగిరి తరహాలో పార్కును అభివృద్ధి చేయడంతో పలు కార్యక్రమాల నిర్వహణ కోసం భూ కేటాయింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. పర్యాటకశాఖతో అనుబంధంగా ప్రయివేటు హోటళ్లు, పర్యాటక స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్పందన లభిస్తోందని చెప్పారు. శాఖ వెబ్సైట్లో ప్రైవేటు వివరాలను ఉంచుతామన్నారు. -
మనకూ ఓ చైనా వాల్!
భూపాలపల్లి జిల్లా మల్లూరు గుట్టపై భారీ కుడ్యం ఐదు కిలోమీటర్ల పొడవునా 10 అడుగుల ఎత్తుతో నిర్మాణం నలు చదరంగా చెక్కిన భారీ రాళ్ల వినియోగం ఇప్పటివరకు వెలుగుచూడని తీరు అది సైక్లోపియన్ తరహా గోడ కావొచ్చంటున్న పురావస్తు నిపుణులు సాక్షి, హైదరాబాద్: చైనా వాల్ తరహాలో మన దేశంలోనూ ఓ భారీ గోడ ఉందన్న సంగతి నాలుగు రోజుల కింద వెలుగు చూసింది. మధ్య ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్–డియోరీ నుంచి చోకీఘడ్ వరకు అడవులు, గుట్టలమీదుగా దాదాపు 80 కిలోమీటర్ల మేర ఆ గోడ విస్తరిం చి ఉంది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ ఓ భారీ గోడ ఉన్న సంగతి తాజాగా వెల్లడైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో గోదావరి తీరంలోని మల్లూరు గుట్టపై దట్టమైన అడవిలో దాదాపు 5 కిలోమీటర్ల మే ర ఈ భారీ కుడ్యం విస్తరించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు స్థానిక గిరిజనులకు మాత్రమే దీని సంగతి తెలియడం గమనార్హం. ఇక్కడ స్థానికంగా పేరుగాంచిన హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 8 కి.మీ. దూరంలో ఈ గోడ మొదలై.. దాదాపు 5 కి.మీ. పొడవునా విస్తరించి ఉంది. పురాతన చారిత్రక ప్రాంతాలను పరిశీలించేందుకు ఇటీ వల నాలుగు రోజుల పాటు పర్యటించిన ‘తెలంగాణ సోషల్ మీడియా ఫోరం’ స భ్యులు దీనిని గుర్తించారు. ఈ మేరకు వివ రాలను బుధవారం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎండీ క్రిస్టీనా చోంగ్తులకు అందజేశారు. ఈ గోడను ఎవరు నిర్మించారో, ఎందుకు కట్టారో, ఏ కాలంలో నిర్మితమైందో ఎక్కడా ప్రస్తావన కనిపింలేదని, దీని సంగతి తేల్చాలని రాష్ట్ర పురావస్తు విభాగాన్ని కోరారు. అవి సైక్లోపియన్ వాల్స్! కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక మిగిలిన సేన బస్తర్‌కు వలస వెళ్లే క్రమంలో కొంతకాలం ఇక్కడ ఉండి ఉంటుందని, ఆ సమయంలో రక్షణ కోసం దీన్ని నిర్మించుకుని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ దీనిని పురావస్తు నిపుణులు ఖండిస్తున్నారు. దానిని రాష్ట్రకూటుల సమయంలో నిర్మించి ఉంటారని, ఆ సమయంలో ప్రభుత్వ పర్యవేక్షణ లేక స్థానికంగా తమను తాము అధిపతులుగా ప్రకటించుకున్నవారు నిర్మించి ఉంటారని చెబుతున్నారు. అక్రమంగా పన్నుల వసూళ్లు, దోపిడీల వంటివి చేసి రక్షణ కోసం ఈ గోడలు కట్టి ఉంటారని అంటున్నారు. కాకతీయులు బస్తర్‌కు వెళ్లే క్రమంలో వారి వద్ద ధనం లేదని, ఇలాంటి గోడలు నిర్మించే ప్రణాళిక కూడా వారికి లేదని చరిత్ర ఆధారంగా తెలుస్తోందని పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు చెప్పారు. ఇలాంటివి అక్కడక్కడా ఉన్నాయని, ఎలాంటి మిశ్రమ అనుసంధానం లేకుండా రాళ్లు పేర్చి నిర్మించే ఈ గోడలను సైక్లోపియాన్ వాల్స్‌గా పిలుస్తారని తెలిపారు. కాగా తాము పరిశీలించిన పాండవుల గుట్ట, మైలారం గుహలు, దామరవాయి బృహత్ శిలాయుగపు సమాధులు, గన్పూర్ దేవాలయాలు అద్భుత ప్రాంతాలని.. వాటివద్ద వసతులు కల్పిస్తే మంచి పర్యాటక కేంద్రాలుగా మారుతాయని సోషల్ మీడియా ఫోరం సభ్యులు పర్యాటకాభివృద్ధి సంస్థ దృష్టికి తెచ్చారు. భారీ రాళ్లు.. ఎనిమిది దారులు మల్లూరు గుట్టపై ఉన్న ఈ గోడ దాదాపు 10 అడుగుల ఎత్తుతో నిర్మించి ఉంది. కొన్ని చోట్ల మాత్రం శిథిలమై నాలుగైదు అడుగుల ఎత్తుతో ఉంది. నలు చదరంగా చెక్కిన భారీ రాళ్లతో ఈ గోడను నిర్మించారు. రాయికి రాయికి మధ్య ఎలాంటి అనుసంధాన మిశ్రమం వాడలేదు. కేవలం రాయి మీద రాయిని పేర్చి నిర్మించారు. కొన్ని చోట్ల ఆ రాళ్లు మూలలు పదునుగా ఉండేంత కచ్చితంగా చెక్కి ఉండడం గమనార్హం. అయితే ఈ రాళ్లపై ఎలాంటి శాసనాలు, గుర్తులు, చిహ్నాలు, బొమ్మలు లేకపోవడంతో వివరాలు అంతుచిక్కడం లేదు. ఇక ఈ గోడకు ఎనిమిది చోట్ల దారులున్నాయి. అక్కడ తలుపుల్లాంటివేమీ లేకుండా కేవలం రాకపోకలు సాగించేందుకు కొంత ఖాళీ వదిలారు. ఏడాదిలో ముఖచిత్రం మారుతుంది ‘‘ఈ గోడ సహా సోషల్ మీడియా ఫోరం సభ్యులు పేర్కొన్న అంశాలను గుర్తిం చాం. కేంద్రం స్వదేశీ దర్శన్ పథకం కింద ట్రైబల్ సర్క్యూట్‌కు ఇచ్చిన రూ.99 కోట్లతో ప్రణాళిక రూపొందించాం. ఏడాదిలో ఆయా ప్రాంతాల ముఖచిత్రం మారుతుం ది. ఈ గోడ నేపథ్యం తెలుసుకుని దాన్ని కూడా ఇందులో జోడిస్తాం.’’ – పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎండీ క్రిస్టీనా చోంగ్తు -
చూసొద్దాం చలో..చలో..
హైదరాబాద్‌కు 100 కి మీ పరిధిలోనే పర్యాటక కేంద్రాలు సందర్శకులకు టి-టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు అందుబాటులో అత్యాధునిక వాహనాలు శామీర్‌పేట్ హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల మధ్య ఉన్న అందమైన ప్రాంతం.. శామీర్‌పేట్. సికింద్రాబాద్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న శామీర్ పేట సహజ సిద్ధమైన అందాలకు నెలవు. ఇక్కడ ఉన్న సరస్సు, జింకల పార్కు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. ఇక్కడ బస చేసేందుకు టూరిజం శాఖ హరిత రెస్టారెంట్ ఏర్పాటు చేసింది. బోటింగ్ సౌకర్యం, స్పా, జిమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ.19 చిలుకూరు.. చిలుకూరులోని బాలాజీ టెంపుల్ మహిమ గల ఆలయంగా గుర్తింపు పొందింది. నగరం నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు హిమాయత్ సాగర్, గండిపేట్ ప్రాంతాలను కూడా చూడవచ్చు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుని ప్రతిరూపంగా ఇక్కడ బాలాజీ పూజలందుకుంటున్నారు. జేబీఎస్, మెహదీపట్నం ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25 పెంబర్తి.. నాణ్యమైన కంచు పాత్రలకు పెట్టింది పేరు పెంబర్తి. నగరానికి 100 కి.మీ దూరంలో ఉన్న ఈ మారుమూల గ్రామం కాకతీయుల కాలం నుంచి ఇత్తడి, కంచు వస్తువుల తయారీకి ప్రత్యేక గుర్తింపు పొందింది. దీపారాధన, దేవతామూర్తుల విగ్రహాలు, లోహపు వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ. 50 మెదక్ చర్చి కాకతీయుల కాలంలో నిర్మించిన బలమైన కోటల్లో మెదక్ పోర్టు ఒకటి. ఈ కోటకు ఉన్న మూడు ద్వారాలు, వాటి ముందు ఉండే ఏనుగుల బొమ్మలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయి. దీనికి సమీపంలోనే పురాతనమైన మెదక్ చర్జి ఉంది. ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన తెల్లగ్రానైట్ రాళ్లతో ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. ఈ చర్చిపై 175 మీటర్ల ఎత్తులో ఉన్న గంట ఇక్కడ ప్రత్యేకం. సుమారు 5 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డినరి బస్సు రూ.54. ఏసీ బస్సుకు రూ. 73 ప్రజ్ఞాపూర్ నగరానికి 65 కీమీ దూరంలో మెదక్ జిల్లాలో కరీంనగర్ హైవేలో ఉంది. భువనగిరి, జనగామ, సిద్ధిపేట్, వెళ్లే వారు ప్రజ్ఞాపూర్ వద్ద విశ్రాంతి తీసుకొని వెళ్తారు. ఈ ప్రాంతంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హోటళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి సమీపంలోని కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం ప్రఖ్యాతి పొందింది. సింగూరు నగరానికి 90 కిమీ దూరంలో మెదక్ జిల్లా సింగూరులో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు డ్యాం చూడదగినది. జంటనగరాలకు ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోంది. ఇందులో మొసళ్లు కూడా ఉన్నాయి. వేసవి సెలవుల్లో సేద తీరేందుకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లొద్దామనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక, దర్శనీయ స్థలాలపై ప్రత్యేకంగా రూపొందించిన కష్టమైజ్డ్ ప్యాకేజీలను ఇప్పుడు టూర్ ఆపరేటింగ్ సంస్థలు, తెలంగాణ టూరిజం శాఖ అందిస్తున్నాయి. వాటిలో కొన్ని... ట్యాంక్‌బండ్ నగర నడిబొడ్డున ఉండే అందమైన ప్రాంతం. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ తర్వాత హుస్సేన్ సాగర్ పై ఉన్న ట్యాంక్‌బండ్ గుర్తుకు వస్తుంది. ఈ సరస్సు మధ్యలో ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన బుద్ధుని విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. ఇందులో విహరించేందుకు బోటింగ్, పడవలు, క్రూజర్ సౌకర్యం ఉంది. సాయంత్రం వేళల్లో మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఈ ప్రాంతంలో విహరిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. బస్సు సౌకర్యం... నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్ ప్రాంతానికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25 లోపే. యాదగిరిగుట్ట... తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. నరసింహస్వామి కొలువైన ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని పంచ నరసింహ క్షేత్రంగా పిలుస్తారు. పర్యాటకులకు హరిత హోటల్స్, ఇతర వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డిన రి బస్సుకు రూ.44. శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. చార్జి 101. భువనగిరి కోట... క్రీస్తు శకం 1200 సంవత్సరంలో నిర్మించిన చాళుక్య కాలం నాటి కోట ఇక్కడ ప్రత్యేకం. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట 40 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో రెండు సరస్సులు ఉన్నాయి. కోటలోని భూ గృహాలు నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పట్టేలా ఉంటాయి. ఈ ప్రాంతం నల్గొండ నుంచి 53 కి.మీ దూరంలో ఉంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఏసీ బస్సుకు రూ. 80, ఆర్డ్డినరి రూ. 35 అనంతగిరి హిల్స్ నగరానికి 75 కిమీ దూరంలో వికారాబాద్‌కు సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ ప్రత్యేకంగా వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. టూరిజం శాఖ ఇక్కడ హరిత రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ.73 కీసరగుట్ట నగర శివార్లలోని కీసర గుట్ట ప్రముఖ శైవక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలో 101 శివలింగాలు ఉన్నాయి. నగరానికి చేరువలో ఉండటంతో నిత్యం యాత్రికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ. 20 గంగాపూర్ మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లకు 8 కి.మీ దూరంలో ఉన్న గంగాపూర్ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని రుణ బాధలు ఉన్నవారు ఎక్కువగా దర్శించుకుంటారు. జేబీఎస్ నుంచి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంది. రూ. 85 నాచారం.. మెదక్ జిల్లాలో చూడదగ్గ ప్రాంతంలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలోని అసఫ్‌జాహీ జమామసీద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ యాత్రికులకు చక్కటి వసతులు ఉన్నాయి. పర్యాటకులు దీనితోపాటు నాచారం గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ.65 వర్గల్ సరస్వతి ఆలయం.. సికింద్రాబాద్ నుంచి 47 కి.మీ దూరంలో ఉంది. మెదక్ జిల్లా కంచి శంకర మఠం ప్రాంతంలోని ఈ ఆలయ సముదాయంలో విద్యా సరస్వతి, లక్ష్మీగణపతి, శనిచ్ఛంద్ర, వైష్ణవాలయాలు ఉన్నాయి. వర్గల్ సరస్వతి అమ్మవారి వద్ద చాలా మంది తమ పిల్లలకు అక్షరభాస్యం చేయిస్తుంటారు. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ. 32 అందుబాటులో అత్యాధునిక వాహనాలు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు యాత్రికులు వెళ్లేందుకు సౌకర్యవంతమైన ఆధునాతన లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఒకటైన ‘కారవాన్’ ఏసీ వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఏడు సీట్లు ఉంటాయి. పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సోఫా, బెడ్ కూడా ఉన్నాయి. వాహనంలోనే అటాచ్డ్ టాయిలెట్, రెండు ఎల్సీడీ టీవీలు, ఫ్రిజ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనానికి కనీస చార్జిగా కి.మీకు రూ. 25, రోజుకు 300 కి.మీ. వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు 300 అదనపు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఇన్నోవా కూడా అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు తెలంగాణ టూరిజం కార్యాలయంలో గాని, 9848125720,9848306435,9666578880, 9848540374, 9848126947 నంబర్లలో గాని సంప్రదించాలని జనరల్ మేనేజర్ మనోహర్ తెలిపారు. -
పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం
సూళ్లూరుపేట: రాబోయే రోజుల్లో పులికాట్, నేలపట్టు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సూళ్లూరుపేటలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, సినీ నటులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ పండగను ఇంకా బాగా నిర్వహిస్తామని చెప్పారు. పులికాట్ పూడిక తీతకు రూ.75 లక్షలు, నేలపట్టు చెరువు అభివృద్ధికి రూ.75 లక్షలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ అమెరికా కంటే మన దేశానికి పర్యాటకులు చాలా తక్కువగా వస్తున్నారని, అందుకే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి పక్షులు ఇక్కడకు వస్తున్నాయంటే మన ప్రాంతానికే ఇది గర్వకారణమన్నారు. మనవాళ్లు వాటిని ఆదరించి దేవతల్లా పూజిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను మరింత వేడుకలా నిర్వహించాలని కోరారు. అందుకు అవసరమైన వసతి సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ పులికాట్ ముఖద్వారాలు పూడిక తీసి మత్స్యకారులకు జీవనోపాధి పెంపొందించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం మత్స్యకారులకు ఎటువంటి లబ్ధి చేకూరుస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు లబ్ధి చేకూర్చాలని కోరారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ టూరిజంను అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుందన్నారు. అందువల్ల ఇలాంటి అరుదైన ఫెస్టివల్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ పేర్నాడు తదితర ప్రాంతాలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలన్నారు. నియోజకవర్గంలో నేలపట్టు, బీవీపాళెం, పులికాట్‌లను అభివృద్ధి చేసి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన సెజ్‌లలో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించి మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మాట్లాడుతూ ఫెస్టివల్‌ను వచ్చే సంవత్సరం బాగా జరపాలంటే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పులికాట్‌ను కాపాడుకునేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్, షార్ డెరైక్టర్ ప్రసాద్‌ను కూడా ఘనంగా సత్కరించారు. మూడు రోజుల ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రుల చేతులగా జ్ఞాపికలు అందజేశారు. -
మంత్రిగారూ.. మాటియ్యరూ...
కనీస వసతులు కరువు కాలగర్భంలో పంచకూటాలయం మోక్షం లేని మల్లూరు రోడ్డు మంత్రి చొరవ చూపాలని కోరుతున్న ప్రజలు పర్యాటక కేంద్రాలు అనగానే జిల్లాలో మొదటగా గుర్తుకొచ్చేవి ములుగు పరిధిలోని లక్నవరం సరస్సు, రామప్ప, మల్లూరు ఆలయాలు. ఏళ్ల తరబడి ఇవి నిరాద రణకు గురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే మంత్రిగా ఎదిగిన చందూలాల్ నేడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యం లో పర్యాటక ప్రాంతాల దుస్థితిపై కథనం.. ములుగు : నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో సందర్శకులు, విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 12వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప ఆలయం, చెరువు ప్రసిద్ధి గాంచాయి. ప్రతీ ఏడాది లక్షలాది మంది పర్యాటకులు రామప్ప కు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ పర్యాటకులు, భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీ సం మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పా టు చేయకపోవడం బాధాకరం. ఆల యం నుంచి చెరువు ప్రాంతానికి సింగి ల్ రోడ్డు మాత్రమే ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరింది. ఆలయానికి వెళ్లే దారిని నాలుగు లేన్లుగా మార్చి, చెరువు కట్టపై, ఆలయం లో పర్యాటకుల కోసం కనీస వసతులు కల్పిస్తే బాగుంటుంది. వెంకటాపురం మండలం రామాం జపూర్ శివారులోని పంచకూటాలయం పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తోంది. 2012 కాకతీయ శతాబ్ది ఉత్సవాల ముందు సందడి చేసిన ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పునర్నిర్మాణం కోసం శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించారు. లక్నవరం బుస్సాపూర్ సమీపంలో ఉన్న లక్నవరం చెరువు ప్రత్యేకతను చాటుకుంటోం ది. ఓ వైపు దట్టమైన అడవి, మరో వైపు లోయ వీటి మధ్య ప్రయాణం కాస్త ఇబ్బంది పెడుతుంది. రామప్ప తరహాలో ఇక్కడ కూడా మహిళలు, చిన్నారులకు కనీస వసతు లు కరువయ్యాయి. చెరువులో ఉన్న ఏడు ఐలాండ్లను ఒక్కో విధంగా తీర్చిదిద్దితే పర్యాటకులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉయ్యాల వంతెన, కాటేజీలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కాకరకాయల దీవికి మరో వంతెన నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నా.. మోక్షం లభించలేదు. రోడ్డు సౌకర్యం లేని మల్లూరు మంగపేట మండలం మల్లూరు మహా క్షేత్రం ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా పేరు గాంచింది. ఆలయానికి భక్తులు, పర్యాటకులు ప్రతి శని, ఆది, గురువారాల్లో పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హేమాచల నర్సింహస్వామి మహిమ గల వాడని ప్రజల నమ్మకం. గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లాలంటే సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. క్షేత్రానికి వెళ్లడానికి కనీసం రోడ్డు లేకపోవడం నాయకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. భక్తులు విడిది చేసేందుకు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి నిత్యం వందలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏటా సుమారు రూ.40లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ రోడ్డు, మంచి నీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ప్రచారం లేని హరిత వనాలు రామప్ప, లక్నవరం, ములుగు మండలం ఇంచర్ల పరిధిలో ఎకో టురిజం అధికారులు పచ్చటి వనాల మధ్య హరిత హోటళ్లను నిర్మించారు. కానీ వీటిపై ప్రచారం చేయడంలో విఫలమయ్యారు. కేవలం డబ్బున్న వారికే హరిత హోటళ్లు పరిమితమవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. కాగా, నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మంత్రి చందూలాల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. నేడు మంత్రి చందూలాల్ రాక హన్మకొండ/ములుగు : రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా వస్తున్న చందూలాల్‌కు 11.15 గ ంటలకు మడికొండలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలకనున్నాయి. 11.30కు అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పిస్తా రు. 11.40 కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి, మధ్యాహ్నం 12 గంటలకు ములుగుకు బయలుదేరుతారు. 12.45కు మహ్మద్‌గౌస్‌పల్లికి చేరుకుం టారు. బైక్ ర్యాలీతో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రేమ్‌నగర్ గట్టమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 1.20కు డీఎల్ఆర్ గార్డెన్స్‌లో జరిగే సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. -
ఏపీ, తెలంగాణలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి: యశోనాయక్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు. 2014-15లో అభివృద్ధి చేసే ఈ కేంద్రాల వివరాలను బుధవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా అందచేశారు. మెగా సర్య్యూట్ కింద కొండపల్లి-ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు, సర్క్యూట్ కింద గుంటూరు జిల్లాలోని గుత్తికొండ బిలం గుహలు-పిడుగురాళ్ల-కొండవీడు ఖిల్లా-కోటప్పకొండ దేవాలయం, శ్రీకాకుళంలోని బుద్ధిస్ట్ సర్క్యూట్‌తో పాటు, పర్యాటక గమ్యస్థానాల కింద నాగార్జునసాగర్ అభివృద్ధి, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలం బీచ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక మంత్రిత్వశాఖ గుర్తించిన ప్రాజెక్టుల్లో సర్క్యూట్-1లో విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం, సర్క్యూట్-2లో హైదరాబాద్-నల్లగొండ-వరంగల్-కరీంనగర్-ఆదిలాబాద్, సర్క్యూట్-3లో తూర్పుగోదావరి-ఖమ్మం-పశ్చిమ గోదావరి-కృష్ణ-గుంటూరు, సర్క్యూట్-4లో చిత్తూరు-నెల్లూరు-అనంతపురం-కడప జిల్లాలు ఉన్నట్టు తెలిపారు. -
పర్యాటకం వెలవెల
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలను రాశులుగా పోసి అమ్మిన నేల ఇది. ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చేతిలో కాలజ్ఞానం పురుడు పోసుకుంది. తాళ్లపాక అన్నమాచార్యుల నోటి వెంట పదకవితలు జాలువారాయి. బ్రిటీష్ దురహంకారానికి వ్యతిరేకంగా గర్జించిన రేనాటి సింహం ఇక్కడి వాడే.. ఇలా చెప్పుకుంటూ పోతే కర్నూలు జిల్లాకు చెందిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి కలిగించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ప్రసిద్ధ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ. 100 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఏమూలకు సరిపోవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పర్యాటక అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఇవే.. * జిల్లాలో శ్రీశైలం దేవాలయం, మహానంది, ఆహోబిలం, కొండారెడ్డి బురుజు.. తదితర కట్టడాలు చాలా పురాతనమైనవి. వీటి సందర్శనకు ప్రతి రోజు వందల మంది వస్తుంటారు. * డోన్ మండలం ఎస్.గుండాల చెన్నకేశవ స్వామి ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. అక్కడ ‘లేపాక్షి’ తరహా కట్టడాలు ఉన్నాయి. * జిల్లాలో మూడు ప్రాచీన సూర్య దేవాలయాలు ఉన్నాయి. నందికొట్కూరులోని రాజావీధి, అవుకు మండలంలోని శివవరం, గడివేముల మండలంలోని గని గ్రామంలో ఉన్నాయి. వీటి అభివృద్ధి నామమాత్రంగానే ఉంది. * కొలనుభారతిలో సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్ర అభివృద్ధికి అధికారులు ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. * ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లిలో బెలుం గుహలకు మించిన వాల్మీకి గుహలు ఉన్నాయి. అద్భుతమైన జలపాతాలతోపాటు ఎన్నో ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి. దీన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. * మద్దిలేటి స్వామి దేవస్థానం, మహనంది క్షేత్రం, పెద్దతుంబలం రామాలయం, కొలను భారతి అభివృద్ధికి 13వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా అవి మరుగున పడిపోయాయి. * జిల్లాను ఏకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు నల్లమల, సుద్దమల అడవులు విస్తారంగా ఉన్నాయి. విజయవాడకు వెళ్లిన శిల్పారామం... జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 2009 నుంచి 2014 వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పర్యాటక శాఖ అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా.. అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో 40 ఎకరాల్లో మినీ శిల్పారామం నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఉన్నా మరుగున పడిపోయాయి. అయితే కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో విజయవాడలో శిల్పారామం ఏర్పాటవుతోంది. కొండారెడ్డి బురుజుపై ఎగరని జాతీయ పతాకం..! కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజుకు విద్యుత్ అలంకరణ చేయడానికి, శాశ్వత జాతీయ పతాకం ఏర్పాటుకు సంబంధించి కొన్నేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి. 168 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఏర్పాటు అయితే శాశ్వత జాతీయ పతాకాల్లో ఐదోది అవుతుంది. అయితే ఇందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా.. ఫలితం లేకుం డా పోయింది. కొండారెడ్డి బురుజును విజయనగరం రాజులు నిర్మించారు. ఇది అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రగతి ప్రతిపాదనలకే పరిమితం.. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ప్రకటించారు. జిల్లా అధికారులు రూ.35.72 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అలాగే సాధారణ ఎన్నికలకు ముందు కర్నూలు శివారులోని విజయవనం, కొండారెడ్డి బురుజు, గోల్గుంబజ్, జగన్నాథ గట్టు అభివృద్ధికి రూ.4.17 కోట్లు మంజూరయినట్లు ప్రకటించారు. ఆలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నిధుల విడుదల ఆగిపోయింది. రాష్ర్టంలో పర్యాటక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ దగ్గరే ఉంచుకున్నారు. సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఆయన కృషి చేయాల్సి ఉంది. ప్రతిపాదనలకే పరిమితం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి 2008లో రూ.70 లక్షలు విడుదల అయ్యాయి. ఆ తరువాత ఇప్పటి వరకు నిధులు రాలేదు. 2009 నుంచి 2012 వరకు పలుసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. పర్యాటక రంగం అభివృద్ధి కోసం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇటీవల ప్రతిపాదనలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతవరకు ప్రతిపాదనలు పంపాలని ఎవరూ కోరలేదు. - వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక శాఖ అధికారి -
పర్యాటక కేంద్రాలకు నిధులు మంజూరు
బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్: బాన్సువాడ కల్కి చెరువు, బోర్లం బసవేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు నిధులు మంజూరైనట్లు పర్యాటక శాఖ ప్రత్యేక డిప్యూటీ కమిషనర్ ఎస్వీఎస్ లక్ష్మీ అన్నారు. బుధవారం ఆమె బాన్సువాడ కల్కి చెరువు, బోర్లం ఆదిబసవేశ్వర ఆలయం, దుర్కి-సోమేశ్వర్ ఆలయాల పర్యాటక కేంద్రాలకు నిధులు మంజూరైన నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక తహశీల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పర్యాటక కేంద్రాలకు అనుకూలంగా ఉన్న స్థలాలను గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. జిల్లా పర్యాటక శాఖ నిధులు మల్లారంనకు రూ. 145.66 లక్షలు, అశోక్‌సాగర్‌కు రూ. 87.65 లక్షలు, బాన్సువాడ మండలం సోమేశ్వర ఆలయానికి రూ. 123.85 లక్షలు, బోర్లం బసవేశ్వర ఆలయానికి రూ.12.44 లక్షలు, కల్కి చెరువులో బోటింగ్‌కు రూ. 19.73 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో కుర్చీలు, బెంచీలు, టాయిలెట్లు, పార్కింగ్ స్థలం, మ్యూజియం, పక్షుల గుడారాలు, దుకాణాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆమె వెంట పర్యాటక డివిజనల్ మేనేజర్ గంగాధర్ తదితరులు ఉన్నారు. ఆశోక్సాగర్ సందర్శన (అశోక్‌సాగర్) ఎడపల్లి : ఎడపల్లి మండలంలోని ఆశోక్సాగర్ను రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు సందర్శించారు. కేంద్రం ప్రభుత్వం రూ. 5కోట్ల నిధులతో పర్యాటక స్థలాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలోని ఏడు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం వాటిని పరిశీలించామని వారు తెలిపారు. అశోక్‌సాగర్‌లో విద్యుత్‌దీపాలు, రెస్టారెంట్ నిర్వహణ సక్రమంగా కొనసాగించాలన్నారు. సందర్శనలో పర్యాటక శాఖ ప్రత్యేక డిప్యూటీ కమిషనర్ ఎస్వీఎస్ లక్ష్మీ, అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి రాంచందర్, హరిత డీవీఎం గంగారెడ్డి ఉన్నారు. -
కల్తీ పెట్రోల్‌తో అవస్థలు
సీలేరు, న్యూస్‌లైన్: మన్యం అందాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులు కల్తీ పెట్రోల్‌తో అవస్థలుపడుతున్నారు. మన్యంలోని పలు పర్యాటక కేంద్రాల్లో పెట్రోల్ బంకులు అందుబాటులో లేకపోవడంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాహనాలకు పెట్రోల్, డీజిల్ లభించడం లేదు. దీంతో పలువురు వ్యాపారులు విడిగా అమ్మే కల్తీ పెట్రోల్, డీజిల్ బారిన పడుతున్నారు. సీజన్లో రోజూ వందల సంఖ్యలో కార్లు, వ్యాన్లు, టూరిస్ట్ బస్సుల్లో రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు కావడంతో ఇక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయని వారు భావిస్తుంటారు. చింతపల్లి, ఒడిశా, మల్కన్‌గిరి, భద్రాచలం వంటి ప్రాంతాల్లోనే పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిని దాటుకుని ఇక్కడికి వచ్చాకా బంకులు లేవని తెలుసుకుని ఏమీ చేయలేక కల్తీ పెట్రోల్, డీజిల్‌ను ఆశ్రయిస్తున్నారు. పెట్రోల్ వ్యాపారులు పర్యాటకుల నుంచి అధిక ధర వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మన్యంలో వాహనాల సంఖ్య జోరందుకున్న నేపథ్యంలో పెట్రోలు దుకాణాల సంఖ్య బాగా పెరిగాయి. వాహనాల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు గమనించిన జీసీసీ అధికారులు పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు గత ఏడాది హామీ ఇచ్చారు. అప్పటి చింతపల్లి జీసీసీ మేనేజర్ కన్నయ్య పెట్రోల్ బంక్ ఏర్పా టు కోసం స్థల సేకరణ కూడా చేశారు. దీనికి జెన్కో అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ జీసీసీ అధికారులు బంక్ ఏర్పాటు చేసే విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకుల వాహనాలను దృష్టిలో ఉంచుకుని సీలేరులో పెట్రోల్ బంకు ఏర్పాటుకు జీసీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని వా హనదారులు, స్థానికులు కోరుతున్నారు. బంక్ ఏర్పాటు వల్ల మంచి ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. ఒడిశా నుంచి దిగుమతి... ఈ ప్రాంతాల్లో అమ్ముతున్న పెట్రోల్‌ను ఒడిశా మల్కన్‌గిరి జిల్లా నుంచి తీసుకువస్తున్నారు. మన రాష్ట్రంలో కన్న తక్కువ ధరకు లభించడంతో అక్కడ నుంచి వేల లీటర్ల పెట్రోల్ తీసుకుచ్చి కల్తీ చేసి ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. డీజిల్, ప్రెటోల్లో కల్తీ జరగడంతో కొద్ది దూరం వేళ్లే సరికి వాహనాలు మొరాయిస్తున్నాయని వాహనచోదకులు ఆవేదన చెందుతున్నారు. బంకు ఏర్పాటు చేసే వరుకూ ఇక్కడ పెట్రోల్, డీజిల్‌ల్లో కల్తీ జరక్కుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నాన్నారు.