బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్: బాన్సువాడ కల్కి చెరువు, బోర్లం బసవేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు నిధులు మంజూరైనట్లు పర్యాటక శాఖ ప్రత్యేక డిప్యూటీ కమిషనర్ ఎస్‌వీఎస్ లక్ష్మీ అన్నారు. బుధవారం ఆమె బాన్సువాడ కల్కి చెరువు, బోర్లం ఆదిబసవేశ్వర ఆలయం, దుర్కి-సోమేశ్వర్ ఆలయాల పర్యాటక కేంద్రాలకు నిధులు మంజూరైన నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె స్థానిక తహశీల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పర్యాటక కేంద్రాలకు అనుకూలంగా ఉన్న స్థలాలను గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. జిల్లా పర్యాటక శాఖ నిధులు మల్లారంనకు రూ. 145.66 లక్షలు, అశోక్‌సాగర్‌కు రూ. 87.65 లక్షలు, బాన్సువాడ మండలం సోమేశ్వర ఆలయానికి రూ. 123.85 లక్షలు, బోర్లం బసవేశ్వర ఆలయానికి రూ.12.44 లక్షలు, కల్కి చెరువులో బోటింగ్‌కు రూ. 19.73 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో కుర్చీలు, బెంచీలు, టాయిలెట్లు, పార్కింగ్ స్థలం, మ్యూజియం, పక్షుల గుడారాలు, దుకాణాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆమె వెంట పర్యాటక డివిజనల్ మేనేజర్ గంగాధర్ తదితరులు ఉన్నారు.
ఆశోక్‌సాగర్ సందర్శన
(అశోక్‌సాగర్) ఎడపల్లి : ఎడపల్లి మండలంలోని ఆశోక్‌సాగర్‌ను రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు సందర్శించారు. కేంద్రం ప్రభుత్వం రూ. 5కోట్ల నిధులతో పర్యాటక స్థలాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలోని ఏడు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం వాటిని పరిశీలించామని వారు తెలిపారు. అశోక్‌సాగర్‌లో విద్యుత్‌దీపాలు, రెస్టారెంట్ నిర్వహణ సక్రమంగా కొనసాగించాలన్నారు. సందర్శనలో పర్యాటక శాఖ ప్రత్యేక డిప్యూటీ కమిషనర్ ఎస్‌వీఎస్ లక్ష్మీ, అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి రాంచందర్, హరిత డీవీఎం గంగారెడ్డి ఉన్నారు.
పర్యాటక కేంద్రాలకు నిధులు మంజూరు
Published Thu, Dec 19 2013 6:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement