సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు. 2014-15లో అభివృద్ధి చేసే ఈ కేంద్రాల వివరాలను బుధవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా అందచేశారు. మెగా సర్య్యూట్ కింద కొండపల్లి-ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు, సర్క్యూట్ కింద గుంటూరు జిల్లాలోని గుత్తికొండ బిలం గుహలు-పిడుగురాళ్ల-కొండవీడు ఖిల్లా-కోటప్పకొండ దేవాలయం, శ్రీకాకుళంలోని బుద్ధిస్ట్ సర్క్యూట్‌తో పాటు, పర్యాటక గమ్యస్థానాల కింద నాగార్జునసాగర్ అభివృద్ధి, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలం బీచ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.
పర్యాటక మంత్రిత్వశాఖ గుర్తించిన ప్రాజెక్టుల్లో సర్క్యూట్-1లో విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం, సర్క్యూట్-2లో హైదరాబాద్-నల్లగొండ-వరంగల్-కరీంనగర్-ఆదిలాబాద్, సర్క్యూట్-3లో తూర్పుగోదావరి-ఖమ్మం-పశ్చిమ గోదావరి-కృష్ణ-గుంటూరు, సర్క్యూట్-4లో చిత్తూరు-నెల్లూరు-అనంతపురం-కడప జిల్లాలు ఉన్నట్టు తెలిపారు.
ఏపీ, తెలంగాణలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి: యశోనాయక్
Published Thu, Aug 14 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement