తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 78,064 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment