![ICMR Revealed In Second Round Of Sero Surveillance - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/3/6.jpg.webp?itok=1271goMe)
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వారికి ఎప్పుడు వచ్చిందో తెలియదు.. ఎప్పుడు వెళ్లిందో తెలియదు.. ఎటువంటి లక్షణాలూ లేకుండానే వారు కోలుకున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) విజయనగరం, కృష్ణా, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రెండో దఫా సీరో సర్వైలెన్స్ నిర్వహించింది. విజయనగరం జిల్లాలో 38 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు తేలింది.
అయితే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ వారి నుంచి నమూనాలు సేకరించి చూస్తే కరోనాతో పోరాడే యాంటీబాడీస్ వారిలో విపరీతంగా వృద్ధి చెంది ఉన్నాయి. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాంభార్గవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపారు. మొదటి దశ సీరో సర్వైలెన్స్‌లో 20 శాతం మందికి యాంటీబాడీస్ వృద్ధి చెందినట్టు తేలిన విషయం తెలిసిందే.
ఆయా జిల్లాల్లో తీసుకున్న నమూనాలు, కరోనా వచ్చిపోయిన వారి సంఖ్య
జిల్లా నమూనాలు పాజిటివ్ శాతం
విజయనగరం 418 159 38.0
కృష్ణా 399 117 29.3
నెల్లూరు 428 76 17.7
Comments
Please login to add a commentAdd a comment