
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా సినీనటుడు ఎల్.జోగి నాయుడుని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్‌లోని చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు చలనచిత్ర నటుడిగా 150కి పైగా చిత్రాలలో నటించారు.
చిత్ర, టెలివిజన్ రంగాలలోని పలు విభాగాలలో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. జోగి నాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment