
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ అనంతరం మొదటిసారిగా మలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.గరుడ వాహనసేవలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment