కొత్తూరు: కొత్తూరు పోలీస్ సర్కిల్ ఇక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. 53 ఏళ్ల అనుబంధానికి తెర పడింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొత్తూరు పోలీస్ సర్కిల్‌ను ఎత్తివేశారు. ఇంత వరకు ఇక్కడ పనిచేసిన సీఐ సూర్యచంద్రమౌళిని వీఆర్‌లో ఉంచారు. కొత్తూరు సర్కిల్ ఎత్తివేయడంతో కొత్తూరు మండలాన్ని పాతపట్నం పోలీస్ సర్కిల్‌లో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు.
కొత్తూరు పోలీస్ సర్కిల్ కార్యాలయానికి ఎంతో చరిత్ర ఉంది. జిల్లాలో 1969 ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం ప్రబలంగా ఉండేది. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి ప్రభుత్వం కొత్తూరు పోలీస్ సర్కిల్‌ను 1969లో ప్రారంభించింది. నాటి నుంచి ఈ సర్కిల్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగానే ఉంది. ఒడిశా సరిహద్దు కావడంతో మా వోలకు ఈ ప్రాంతంలో పట్టు ఉండేది. దీంతో కొత్తూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీసు సి బ్బంది శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు మావోల కదలికలపై కూడా దృష్టి ఉంచేవారు.
కొ త్తూరు పోలీస్ సర్కిల్ పరిధిలో సీతంపేట, భామి ని మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలోకి విలీనం కావడంతో కొత్తూరు సర్కిల్‌లో కేవలం కొత్తూరు మండలం ఉండిపోయింది. దీంతో సర్కిల్ కార్యాలయాన్ని ఎత్తివేశారు. దీంతో 53 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. అయితే కొత్తూరు మండల ప్రజలు పాతపట్నం సర్కిల్‌కి వెళ్లాలంటే రెండు నుంచి మూడు బస్సులు మారాలి. అధికారులు స్పందించి కొత్తూరు, హిరమండలం మండలాలను ఒక సర్కిల్‌గా ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
(చదవండి: రూ.3.5 లక్షలు చోరీ)
Comments
Please login to add a commentAdd a comment