సాక్షి, అమరావతి : రాష్ట్రంలో లేఅవుట్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ అనుమతులు, కమెన్స్‌మెంట్ సర్టిఫికెట్ల కాల వ్యవధి ఏడాది పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో ఏడాది పాటు వాటి వ్యాలిడిటిని పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2021 మార్చి 31 వరకు కాల వ్యవధిని పొడిగించింది. కరోనా నేపధ్యంలో ఈ ఏడాది మార్చి 25 తర్వాత ముగిసిన వాటికి ఇది వర్తించనుంది. ఇందుకోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రత్యేక అప్లికేషన్ కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చదవండి : కాబోయే అమ్మలకు సర్కార్ అండ
Comments
Please login to add a commentAdd a comment