సాక్షి, అమరావతి: ఇసుక గురించి మాట్లాడే నైతికత చంద్రబాబుకి, టీడీపీ నేతలకి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత అయిదేళ్ల పాలనలో ఇసుకను బంగారంగా మార్చింది మీరు కాదా..?. టీడీపీ పాలనలో రాష్డ్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టానుసారంగా దోచుకున్నారు. కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసానికి ఆనుకుని డ్రెడ్జర్లతో ఇసుక తవ్వేస్తే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల ఫైన్ విధించింది అది అప్పుడే మర్చిపోయారా. ఉచిత ఇసుక పాలసీ పేరుతో ఇసుకని దోచుకున్న మీరు ఎలా మాడ్లాడతారు. చదవండి: (ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లులు ఆమోదం)
మీ హయాంలో ప్రారంభమైన ఇసుక దోపిడీని అరికట్టడానికే మేము అనేక ప్రయత్నాలు చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వరుసగా వరదలు, తుఫాన్‌ల వల్ల ఇసుక వెలికితీయడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రతిపక్షంగా సూచనలివ్వాలి కానీ అసెంబ్లీ బయట ర్యాలీ పేరుతో డ్రామాలు కాదు. చచ్చిపోయిన టీడీపీని బ్రతికించుకోవడానికి ఇసుక పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. అన్నిలోపాలని అధిగమించి కొత్త ఇసుక పాలసీ ద్వారా అందరికీ ఇసుక దొరికేలా చర్యలు తీసుకుంటాం. మాది పారదర్శకమైన ప్రభుత్వం. అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment