ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన మండలి పరిధిలో ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీలు ఉండనున్నాయి. ఈ విధంగా 1,023 మంది ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ జరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 83 క్యాడర్‌లలో 2,100 వరకు ఖాళీలు ఉన్నట్టు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఉద్యోగులు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి బదిలీ దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ప్రజారోగ్య విభాగం పరిధిలోనూ ఖాళీల గుర్తింపు, ఐదేళ్లు ఒకే చోట పనిచేసి తప్పనిసరి బదిలీల్లో ఉన్న ఉద్యోగుల వివరాల ఖరారు తుది దశకు చేరుకుంది. విభాగాల వారీగా జిల్లాలు, జోన్‌ల పరిధిలో ఖాళీల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో నమోదుపై ఉన్నతాధికారులు డీఎంహెచ్‌వోలు, రీజనల్ డైరెక్టర్‌ల నుంచి ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment