
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 నుంచి 22వ తేదీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఎంపిక చేసిన 52 మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 45 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం, రక్తపోటు, ఇతర జీవన శైలి జబ్బులకు సంబంధించిన స్క్రీనింగ్‌ను ఉచితంగా నిర్వహించనున్నారు.
అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ప్రజలకు డిజిటల్ ఐడీ సృష్టించడం వంటి ఇతర సేవలను అందించనున్నారు. వైద్య శిబిరాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ నివాస్ తెలిపారు.