ఎమ్మిగనూరు సభ.. సీఎం జగన్‌ ప్రసంగంలో హైలైట్స్‌ | Memantha Siddham: CM Jagan Speech Highlights At Yemmiganur Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

Yemmiganur Memantha Siddham Sabha: ఎమ్మిగనూరు సభ.. సీఎం జగన్‌ ప్రసంగంలో హైలైట్స్‌

Published Fri, Mar 29 2024 7:09 PM | Last Updated on Sat, Mar 30 2024 10:42 AM

Memantha Siddham: CM Jagan Speech Highlights At Yemmiganur Meeting - Sakshi

సాక్షి, కర్నూలు: పేదలు, మహిళల కష్టాల్లో నుంచే ప్రభుత్వ పథకాలు పుట్టుకొచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు సభలో ఆయన మాట్లాడుతూ, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని.. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ సిలబస్‌ తీసుకొచ్చామని చెప్పారు. అమ్మ ఒడి, విద్యాదీవెన ద్వారా పిల్లలను ప్రొత్సహిస్తున్నామన్నారు. పిల్లల చదవు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.

66 లక్షల మందికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లు పేదల ఖాతాలకు బదిలీ చేశామన్నారు. ఇప్పుడు బడుల్లో జరుగుతున్న మార్పులు 16 ఏళ్ల తర్వాత మీ బిడ్డల భవిష్యత్తు కోసం చేసినవేనని చెప్పారు. కుటుంబాలు పేదరికం నుంచి బయటపడాలంటే క్వాలిటీ విద్యతోనే అది సాధ్యమన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.  పథకాలు చూసిన ప్రజలు..మంచి చేసిన తమ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అంటూ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

  • మేం టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు.
  • మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం.
  • వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు.
  • వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు. బీఈడీ కూడా చేశాడు
  • బాబు హయాంలో ఉద్యోగం దొరక్క టిప్పర్‌ డ్రైవర్‌ అయ్యాడు.
  • పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్‌ ఇచ్చాం

  • మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది.
  • పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది.
  • ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్‌కు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.
  • సిద్ధమంటూ లేచే ప్రతి చేయి, ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని, మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది.
  • జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. పెత్తందార్లను ఓడించేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?.

  • పేదల సొంతింటి కలను నెరవేర్చాం.
  • పేదల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం
  • దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మనదే
  • ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం
  • నేరుగా మీ ఇంటి దగ్గరకే పెన్షన్ అందిస్తున్నాం
  • నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకే ఇచ్చాం

  • చంద్రబాబు హయాంలో మహిళల ఖాతాల్లోకి డబ్బు వచ్చిందా?
  • ప్రతిపక్షాలు మోసాలు, మాయలను నమ్ముకున్నాయి
  • 2.5 కోట్ల మంది మహిళల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
  • రైతు అనుకూల, వ్యతిరేకుల మధ్య ఎన్నికలు ఇవి
  • రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులను మోసం చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement