సాక్షి, పశ్చిమగోదావరి: రైతుల నుంచి ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేయటం అనేది చరిత్రలో నిలిచిపోతుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ మేరకు తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'తణుకులో అతి త్వరలోనే మార్కట్ యార్డు నిర్మిస్తాం. చెరకు పంటకు ప్రత్యామ్నాయ పంటను రైతులకు సూచిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎరువుల కొరత రాకుండా చూస్తాం.
ఎక్కడైనా డీలర్లు బ్లాక్ చేసినా.. అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఆర్‌బీకేల వలన బయట డీలర్లు కూడా తక్కువ ధరలకే అమ్మాల్సి వస్తుంది. ఇది రైతులకు శుభపరిణామం. ఆయిల్ ఫామ్ రైతులకు మెరుగైన ధర లభించడంతో వారు కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏఎంసీ గోడౌన్స్ అన్నింటికీ అవసరమైన మరమ్మతులు చేయిస్తాం' అని మంత్రి కన్నబాబు తెలిపారు. (ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్ భార్గవ్ స్పష్టత)
Comments
Please login to add a commentAdd a comment