
సాక్షి, తిరుపతి: ఆక్వా పరిశ్రమలో ఆక్వా పొల్యూషన్ తగ్గిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నిషేధించామని, భక్తులకు ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీ కాలుష్య మండలి ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, చిరుతల దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని, శాశ్వత ప్రాతిపదికన కంచె ఏర్పాటు దిశగా టీటీడీ, అటవీశాఖ ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో టీటీడీకి సహకరిస్తామన్నారు. ‘‘ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారికి ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాం. జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. మ్యాన్ ఈటర్‌గా మారిన రెండు చిరుతలు జూ పార్క్‌లోనే ఉంచుతాం’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
చదవండి: ఎమ్మెల్యే వల్లభనేనికి తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment