peddireddy rama chandra reddy
-
చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు: మంత్రి పెద్దిరెడ్డి
-
బాబు, పవన్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అనంతపురం: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయని తెలిపారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చిందని విమర్శించారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేయడం వల్ల తాము కొన్ని స్థానాల్లో ఓడిపోయామని అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే తెలుస్తుందన్నారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అంటేనే నిజం అని.. ఖచ్చితంగా నిజం గెలుస్తుందన్నారు. టీడీపీ పతనావస్థకు చేరిందని, ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవుతోందని. .. పతనావస్థకు ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని విమర్శించారు. 18న రాప్తాడులో వైఎస్సార్సీపీ ' సిద్ధం' సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల: మంత్రి రోజా -
సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు: మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి జిల్లా: చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదని నాలుగు వారాలు కండిషన్ బెయిల్ ఇస్తే.. సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇల్లు అలకగానే పండగ చేసుకోవడం కాదని విమర్శించారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన చంద్రబాబు బెయిల్ అంశంపై ఈ మేరకు స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
‘ఆ రెండు చిరుతలు మ్యాన్ ఈటర్‌గా మారాయి.. జూ పార్క్‌లోనే ఉంచుతాం’
సాక్షి, తిరుపతి: ఆక్వా పరిశ్రమలో ఆక్వా పొల్యూషన్ తగ్గిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నిషేధించామని, భక్తులకు ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీ కాలుష్య మండలి ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, చిరుతల దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని, శాశ్వత ప్రాతిపదికన కంచె ఏర్పాటు దిశగా టీటీడీ, అటవీశాఖ ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో టీటీడీకి సహకరిస్తామన్నారు. ‘‘ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారికి ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాం. జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. మ్యాన్ ఈటర్‌గా మారిన రెండు చిరుతలు జూ పార్క్‌లోనే ఉంచుతాం’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చదవండి: ఎమ్మెల్యే వల్లభనేనికి తప్పిన ప్రమాదం -
పర్యాటకులను ఆకర్షించేలా జూ పార్క్‌ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని జూ పార్క్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి అధ్యక్షతన జూ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించేలా విశాఖ, తిరుపతి జూ పార్క్‌లను తీర్చిదిద్దేందుకు.. దేశంలోని పలు జూ పార్క్‌ల అథారిటీలతో జంతువుల మారి్పడి కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. జంతువులను సంరక్షించే సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్‌పై హేతుబద్ధత కోసం సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విశాఖ జూ పార్క్‌కు సంబంధించిన కొత్త లోగోను, జంతువులను పోలిన పలు వస్తువులను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. జంతువుల చిత్రాలతో రూపొందించిన టీషర్ట్లు, టోపీలు, గృహాలంకరణ వస్తువులను పరిశీలించారు. అటవీదళాల అధిపతి మధుసూదన్‌రెడ్డి, అడిషనల్ పీసీపీఎఫ్ శాంతిప్రియపాండే, అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, విశాఖ క్యూరేటర్ నందినీ సలారియా, తిరుపతి క్యూరేటర్ సెల్వం, విశాఖ సర్కిల్ హెడ్ శ్రీకంఠనాథరెడ్డి, తిరుపతి సర్కిల్ హెడ్ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
వైఎస్ జగన్ లాంటి కొడుకు లేడని చంద్రబాబుకు కుళ్లు: మంత్రి పెద్దిరెడ్డి
-
ఎంపీ మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
-
ఎల్లో మీడియా ఆటలు ఇక సాగవు : మంత్రి పెద్దిరెడ్డి
-
కుప్పంలో టీడీపీకి షాక్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పంలో తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ కార్యకర్తలు మరోసారి షాక్ ఇచ్చారు. వందమందికిపైగా నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో గుడిపల్లి మండలంలోని అగరం, కుప్పిగానిపల్లి, పోగురుపల్లి, గుండ్లసాగరం, కనమనపల్లి, ఓఎన్ కొత్తూరు పంచాయతీల్లోని టీడీనీ క్రియాశీలక కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్డులు సైతం తీసుకొచ్చి మరీ వైఎస్సార్సీపీలో చేరారు. వారిలో మాజీ సర్పంచ్ వెంకటేష్, నేతలు సి.బి.సుబ్రమని, యల్లప్ప, సంపంగి తదితరులున్నారు. బాబు ఓటమి తథ్యం: మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి.. టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీకి ఆకర్షితులయ్యారని చెప్పారు. ఈ మూడేళ్లలో కుప్పంలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోను టీడీపీకి ఘోర పరాభవం, వైఎస్సార్సీపీకి అఖండ విజయం కలిగాయని గుర్తుచేశారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని, రానున్న రోజుల్లో కుప్పంలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, 2024లో బాబు ఓటమి తథ్యమని పేర్కొన్నారు. -
పట్టణాల్లో నగర వనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశిం చారు. సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 23 నగర వనాలు, 7 టెంపుల్ ఎకో పార్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగర వనాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొత్తం రూ.18.02 కోట్ల వ్యయంతో 220.48 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పులులు పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. నల్లమల నుంచి శేషాచలం వరకు పులుల సంచారం ఉందని మంత్రి తెలిపారు. తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కూడా పులి సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. అటవీ ప్రాంతా ల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు. యూకలిప్టస్ సాగు చేస్తున్న రైతులకు టన్నుకు రూ.4,050 ధర లభిస్తోందని.. దీన్ని మరింత పెంచేందుకు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లను పెంచాలని సూచించారు. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి విదేశీ బొగ్గు విదేశాల నుంచి 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దేశంలో అన్ని విద్యు త్ ప్లాంట్లలానే.. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లలో కూడా రెండు, మూడు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో విదేశీ బొగ్గు కొనుగోళ్లు చేపట్టడం ద్వారా బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కృష్ణపట్నం మూడో యూనిట్‌ను సెప్టెంబర్ కల్లా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ పృథ్వీతేజ్, డిప్యూ టీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, డైరెక్టర్ కె.ముత్తుపాండ్యన్, డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. -
కొరతపై ‘కోర్ కమిటీ’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్న బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ కొరతను మే మొదటి వారానికల్లా అధిగమించేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అన్నిరకాల చర్యలు చేపడుతున్నాయి. దీన్లో భాగంగా రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బొగ్గు లభ్యత పెంచడం, విద్యుత్ కొరతను అధిగమించడం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ (బొగ్గు)ను నియమించింది. ఇప్పటివరకు ఏపీజెన్కో డైరెక్టర్లే ఈ బాధ్యతలు కూడా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకాధికారితోపాటు ఉన్నతాధికారులతో ఒక కోర్ మేనేజ్మెంట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ పర్యవేక్షణలో పరిశ్రమలకు కూడా మే మొదటివారానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్దరించాలనే లక్ష్యంతో ఈ బృందం పనిచేయనుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో రెండు నుంచి ఐదురోజులకు సరిపడా బొగ్గునిల్వలు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్‌లో 24 రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఉండాలి. అన్ని రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. విద్యుత్ ఎక్సే్ఛంజిల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా యూనిట్ ధర గతేడాది అక్టోబర్ తరువాత మళ్లీ రూ.12 నుంచి రూ.20 వరకు పలుకుతోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా పీక్ అవర్స్‌లో ఇదే ధర వద్ద విద్యుత్ కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారీగా పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో వేసవి కారణంగా విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. 2018–19లో 63,605 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది 68,905 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా 8.33 శాతం చొప్పున విద్యుత్ డిమాండ్ పెరగింది. అదే సమయంలో బొగ్గు లభ్యత భారీగా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోను మన రాష్ట్రంలో గృహ అవసరాలకు నిరంతరం, వ్యవసాయానికి ఏడుగంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చేసేందుకు విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 23న డిస్కంలు 208 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశాయి. గత ఏడాది అదే రోజున 192 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది. ప్రజలు అర్థం చేసుకుంటారు తప్పని సరై, విధిలేని పరిస్థితుల్లోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ కొరత సమస్యను ప్రజలు అర్థం చేసుకుంటారన్న నమ్మకం తమకు ఉందని, నెలాఖరుకల్లా విద్యుత్ కొరత తీరుతుందని మంత్రి చెప్పారు. ఎంత ఖర్చయినా సరే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ తగినంత విద్యుత్ లభ్యత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే మే–అక్టోబర్ నెలల మధ్య కాలానికి విద్యుత్ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. విద్యుత్ రంగంపై ప్రతివారం నిర్వహించే సమీక్షల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో ప్రాజెక్టులు, నిర్వహణపై సోమవారం సెక్రటేరియట్లో చర్చిస్తానని మంత్రి అధికారులకు చెప్పారు. టెలీకాన్ఫరెన్స్‌లో జేఎండీ ఐ.పృధ్వీతేజ్, గ్రిడ్ డైరెక్టర్ ఎ.వి.కె.భాస్కర్, మూడు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. -
పరిశుభ్ర గ్రామాల కోసం జూలై 8 నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీన సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పటిలోగా పంచాయతీల్లో అన్ని వనరులను సమీకరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చేనెల 8వ తేదీ నుంచి ప్రతి 250 నివాసాల నుంచి చెత్తను సేకరించే ఒకరిని గ్రీన్ అంబాసిడర్‌గా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక కార్యక్రమాల ద్వారా కోవిడ్ సమయంలో గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని, వారిని కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ పనులు ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్నాయని, ఆయా కాలనీల్లో ఉపాధిహామీ పథకంలో అవెన్యూ ప్లాంటేషన్ భారీగా చేపట్టాలని చెప్పారు. నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల మొక్కలు నాటాలని, అవసరమైతే ప్రైవేటు నర్సరీల నుంచి కూడా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ ఏడాది, గత ఏడాది నాటిన మొక్కల్లో 66 శాతం బతికాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సెర్ఫ్ సీఈవో రాజాబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, ఉపాధిహామీ పథకం డైరెక్టర్ చిన్నతాతయ్య, పంచాయతీరాజ్ ఈఎన్సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది
-
క్వారీ లీజుల జారీకి సింగిల్ డెస్క్ పోర్టల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్వారీ లీజుల జారీకి వివిధ విభాగాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ (ఏకగవాక్ష తరహా) విధానానికి భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తోంది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఎవరైనా క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఆంధ్రప్రదేశ్ భూగర్భ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేస్తే దానిని సంబంధిత సహాయ సంచాలకులు/ ఉప సంచాలకులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం ఆన్లైన్లోనే ఆ ప్రాంత తహసీల్దారుకు పంపుతారు. తహసీల్దారు దానిని పరిశీలించి గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని, వ్యక్తిగతంగా పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆన్లైన్లోనే గనుల శాఖకు ఎన్ఓసీ పంపుతారు. అటవీ భూమి అయితే.. ఒకవేళ అటవీ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారి ఆ దరఖాస్తును ఆ ప్రాంత డివిజనల్ అటవీ అధికారికి పంపుతారు. ఆయన నిబంధనలను పరిశీలించి, దరఖాస్తుదారు ప్రత్యామ్నాయ భూమికి, ప్రత్యామ్నాయ వనీకరణ కింద నిధులు జమ చేసేందుకు అంగీకరిస్తే అటవీ శాఖకు నివేదిక పంపుతారు. అటవీశాఖ దానిని పరిశీలించి అనుమతిస్తుంది. ఎక్కువ విస్తీర్ణమైతే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో లీజుల జారీకి నిబంధనలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సింగిల్ డెస్క్ పోర్టల్’విధానం అమల్లోకి తెచ్చామని గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు. దీనివల్ల దరఖాస్తుదారుల డబ్బు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పారు. -
పిచ్చి పీక్స్‌కు.. తుగ్లక్‌ను మరిపిస్తున్న నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: తనకు విశేషాధికారాలున్నాయని, తననెవ్వరూ ప్రశ్నించజాలరని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ మరో పిచ్చి తుగ్లక్‌గా ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే పలు విషయాల్లో తన పరిధి దాటి వ్యవహరించారని స్పష్టమైనప్పటికీ, ఆయన వైఖరిలో ఇసుమంతైనా మార్పు రాకపోవడం మేధావులను, అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతోనే ఆయన పని చేస్తున్నారనేది అడుగడుగునా స్పష్టమవుతోంది. న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయన్న కనీసపాటి జ్ఞానం లేకుండా, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ అధికారులను పక్కదోవ పట్టించడానికి పూనుకోవడం బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గృహ నిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఆదివారం హైకోర్టు కొట్టేసింది. ఇదే రోజు అధికారులు, రాజకీయ విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజలు సైతం విస్తుపోయేలా.. ఎన్నికల తర్వాత కూడా ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వం అనుకున్నట్టుగా కాకుండా తాను చెప్పినట్టే ఉండాలని నిర్దేశిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండే కలెక్టర్లు మొదలు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల వరకు అందరినీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా బదిలీ చేయకూడదని పేర్కొనడం చూస్తుంటే ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం కాక మరేమవుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి చొరబాటే ► ప్రజలెన్నుకున్న ప్రభుత్వంగా ప్రజల సంక్షేమ, అభివృద్ధిని కాంక్షిస్తూ నిర్ధేశించుకున్న వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసే ప్రక్రియలో పాలనాపరంగా అవసరాలకు తగ్గట్టు ఉద్యోగులను బదిలీ చేయడం సాధారణం. కానీ, నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను ఒక చోట నుంచి మరొక చోటుకు బదిలీ చేసేందుకు నిర్ణీత కాల పరిమితి వరకు ఆగాలని చెబుతున్నారు. ► ఎన్నికల విధులలో పాల్గొంటున్న కలెక్టర్లు, పోలీసు సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను వారి బదిలీకి నిర్ధేశించిన కాల పరిమితికి ముందు ప్రభుత్వం బదిలీ చేయకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రధాన అటవీ సంరక్షణాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ► ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసే అధికారులను అభినందిస్తూ, అందకనుగుణంగా ఆ వివరాలను సంబంధిత అధికారుల సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలన్న నిమ్మగడ్డ ఆదేశాలను చూసి అధికార యంత్రాంగం నివ్వెరపోయింది. ► ఇది ముమ్మాటికీ అధికారులను ప్రలోభ పెట్టడమే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టీడీపీ తరఫున నిమ్మగడ్డ వకాల్తా పుచ్చుకుని పని చేస్తున్నారని ఈ పరిణామంతో సామాన్యులకు కూడా పూర్తిగా అర్థమైందని ఓ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం, టీడీపీ ఉనికి కాపాడటం కోసం ఓ అధికారి ఇంతగా బరి తెగించడం ఇప్పుడే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ► ఎన్నికలు జరిగే సమయంలో అంటే, కోడ్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయి. ఎన్నికల తర్వాత ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ విషయం నిమ్మగడ్డకు తెలియదా? అని ఉద్యోగులు నవ్వుకుంటున్నారు. పిచ్చి తుగ్లక్‌ను మరిపిస్తున్నారంటూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. -
పెద్దిరెడ్డి గృహ నిర్బంధ ఉత్తర్వులు రద్దు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఆదివారం న్యాయమూర్తి విచారణ జరిపారు. రాజ్యాంగ హక్కులను కమిషనర్ హరించారు సీవీ మోహన్‌రెడ్డి తొలుత వాదనలు వినిపిస్తూ.. ‘ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్న ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు రాజ్యాంగ హక్కులను హరించేలా ఉన్నాయి. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే ఎన్నికల కమిషనర్ ఆ ఉత్తర్వులు జారీ చేశారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డిపై ఉంది. ఒకే నామినేషన్ వచ్చినప్పుడు రిటర్నింగ్ అధికారి వెంటనే ఆ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించాలి. ఎన్నికల ఫలితాన్ని ప్రకటించడానికి ముందే, ఆ ఎన్నికపై ఎన్నికల కమిషన్ విచారణ జరపడానికి, ఫలితాల వాయిదాకు వీల్లేదు. ఎన్నికల కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే ముందు సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు’ అని వివరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ప్రశ్నించడానికి వీల్లేదు ఎన్నికల కమిషన్ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల కమిషనర్ తనకున్న ప్రత్యేకాధికారాలను ఉపయోగించవచ్చు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసేవిగా, కమిషనర్ అధికారాలను ప్రశ్నించేవిగా ఉన్నాయి. అధికారులను బ్లాక్ లిస్ట్ చేస్తామని బెదిరించడం ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని చెప్పారు. ఆ అధికారం ఎస్ఈసీకి లేదు వ్యక్తిగత స్వేచ్ఛను చట్ట నిబంధనలకు లోబడే నియంత్రించాల్సి ఉంటుందని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. హౌస్ అరెస్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని తెలిపారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధం అని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు జోక్యం చేసుకుంటూ.. ‘చట్ట నిబంధనలు అనుమతిస్తున్నప్పుడు మాత్రమే ఓ వ్యక్తిని గృహ నిర్బంధం చేయవచ్చు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకున్న అధికారాన్ని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసేందుకు పొడిగించడానికి వీల్లేదు. ఈ నెల 21వ తేదీ వరకు పిటిషనర్ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నది న్యాయస్థానం అభిప్రాయం. ఇదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ అపరిమితమైనది కాదు. అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది’ అని చెప్పారు. ఈ దృష్ట్యా ఈ నెల 21వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ఉండాలన్న ఉత్తర్వులను రద్దు చేస్తున్నామన్నారు. అయితే మీడియాతో మాట్లాడకూడదన్న ఉత్తర్వులు 21 వరకు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ కార్యదర్శి, నిమ్మగడ్డ రమేశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. -
వైఎస్సార్ జలకళ; ఎవరు అర్హులంటే..
సాక్షి, అమరావతి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళ పథకం అమలుపై జిఓ నెంబర్ 676 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అర్హులైన రైతులకు అవకాశం ఉన్న ప్రతి ఎకరానికి సాగునీటిని అందించేందుకు ఉచితంగా ప్రభుత్వం బోరుబావులను మంజూరు చేస్తూ, దానికి సంబంధించిన విదివిధానాలను జారీ చేసినట్లు తెలిపారు. నవరత్నాల్లో భాగంగా అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోరుబావులను తవ్వించి ఇవ్వాలన్న హామీని కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం వైఎస్సాఆర్ జలకళ పథకం ద్వారా ఉచితంగా రైతులకు బోరుబావులను మంజూరు చేస్తోందని, వెంటనే దీనిని ఆచరణలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు.. ఈ పథకం ద్వారా అందుబాటులో వున్న జలవనరులను సద్వినియోగం చేసుకుంటూ రైతాంగం వ్యవసాయ అవసరాలను తీర్చుకునేందుకు, తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని అన్నారు. ప్రతి ఎకరానికి సాగునీటిని అందించేందుకు భూగర్భ జలవనరులను వినియోగించుకునే విధంగా రాష్ట్రంలోని మొత్తం పదమూడు (13) జిల్లాల్లోని అర్హత కలిగిన రైతులకు ఉచిత బోర్ బావులను మంజూరు చేస్తోందని తెలిపారు. పథకం ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావులు పొందుతున్న రైతులకు ఉచితంగా మోటార్లు, పంపుసెట్లు, దానికి అవసరమైన విద్యుత్ పరికరాలు, పైప్‌లను కూడా అందచేసేందుకు గానూ జీఓనెంబర్ 677 ద్వారా పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను మీడియాకు విడుదల చేశారు. చదవండి: న్యాయ వ్యవస్థను మూసేయాలన్న ఉద్ధేశంతోనే.. రైతులకు మరింత మేలు వైఎస్సార్ జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేశారు. రైతులకు మరింత మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బోర్లు తవ్వించడంతోపాటు మోటారు పంపుసెట్ కూడా ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. బోర్లు ఏర్పాటుకు అవసరమయ్యే పరికరాలన్నీ ఉచితంగానే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌డీపీఎఫ్ పైప్, ఎలక్ట్రికల్ కేబుల్, ప్యానెల్ బోర్డ్ తదితర పరికరాలు చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ‘వారు చేతకాని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు’ వ్యవసాయ బోర్ బావి లేదా ట్యూబ్ బావి లేని ఏ రైతు అయినా ఈ పథకం కింద అర్హులవుతారు. అలాగే గతంలో బోరుబావి, లేదా ట్యూబ్ బావి ఉండి, అవి విఫలమైన పరిస్థితుల్లో సదరు రైతుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. జీఓ548 తేదీ:27.2.2020) ప్రకారం భూగర్భ జలాలను అధికంగా వినియోగించినట్లు నోటిఫై చేసిన 1094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం కింద బోరుబావులను మంజూరుకు అవకాశం లేదు. దరఖాస్తు విధానం అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదారు పాసు పుస్తకం కాపీతో పాటు గ్రామ సచివాలయంలో నేరుగా గానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలి. రైతు ఫోటో, పాసుబుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో కూడిన దరఖాస్తుతో పాటు రైతుకు సంబంధించిన పొలంను గ్రామ సచివాలయ స్థాయిలో విఆర్వో స్వయంగా పరిశీలిస్తారు. ఆ తరువాత సదరు దరఖాస్తును ఎంపీడీఓ లేదా డ్వామా ఏపీడీకు సమర్పిస్తారు. అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన దరఖాస్తులు ఎంపీడీఓ డ్వామా ఏపీడీలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆ తరువాత నుంచి రైతులు తమ దరఖాస్తు ఏ దశలో వుందో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిశీలించుకునేందుకు సదుపాయం ఉంది. ఈ ప్రక్రియలో రైతులకు సంబంధించిన ఎటువంటి అభ్యర్ధనలు, అభ్యంతరాలను ఆన్లైన్లో www.ysrjalakala.ap.gov.in వెబ్సైట్ లేదా స్పందన టోల్ ఫ్రీ నం 1902 ద్వారా కూడా అధికారులకు తెలియచేయవచ్చు. సాంకేతిక అనుమతి ఎలా పొందాలి.. డ్వామా ఎపిడి, ఎంపిడిఓలు ధ్రువీకరించిన దరఖాస్తులను ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహించడానికి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డ్రిల్లింగ్ కాంట్రాక్టర్‌కు పంపుతారు. సదరు కాంట్రాక్టర్ రైతు పొలంలో బోరు పడేందుకు వీలుగా వున్న పరిస్థితులపై భూగర్భ జలాలు, వాటర్ ఆడిట్ విభాగంలో నమోదు చేసుకున్న భూవిజ్ఞాన శాస్త్రవేత్త, భూ భౌతిక శాస్త్రవేత్త లతో సర్వే చేయించాల్సి వుంటుంది. ఈ డ్రిల్లింగ్ ప్రదేశం వాల్టా చట్టం పరిధిలో వుంటేనే దీనికి అనుమతి లభిస్తుంది. సదరు దరఖాస్తునకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నివేదికలను డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ డ్వామా ఎపిడి, ఎంపిడిఓలకు సమర్పిస్తారు. ఈ నివేదికలపై అవసరమైతే సాంకేతిక సలహాలను ఆయా జిల్లాల భూగర్భజలాల డిప్యూటీ డైరెక్టర్ లేదా, వాటర్ ఆడిట్ విభాగాల నుంచి అధికారులు పొందుతారు. వేగంగా పరిపాలనా అనుమతులు.. డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ నుంచి వచ్చిన ఫీజుబిలిటీ నివేదికల ఆధారంగా బోర్ డ్రిల్లింగ్ అంచనాలను డ్వామా ఎపిడి, ఎంపిడిఓలు తయారు చేస్తారు. ఈ అంచనా నివేదికను డ్వామా పిడికి పంపిస్తారు. ఈ నివేదికలను పరిశీలించిన తరువాత డ్వామా పిడి నుంచి జిల్లా కలెక్టర్‌కు పరిపాలనా అనుమతి కోసం పంపిస్తారు. చివరిగా జిల్లా కలెక్టర్ సదరు దరఖాస్తును పరిశీలించిన తరువాత దానికి అనుమతి ఇస్తారు. వెంటనే సదరు దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పిడి డ్వామా ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఎంపిడిఓ, ఎపిడి, విఆర్వో, గ్రామసచివాలయ సిబ్బందితో పాటు లబ్ధిదారుడికి కూడా ఈ సమాచారం ఆన్లైన్లో వెంటనే అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా లబ్ధిదారుడికి ఎప్పటికప్పుడు దరఖాస్తు ప్రగతిపై ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందిస్తారు. డ్వామా ఎపిడి, ఎంపిడిఓల ద్వారా వెంటనే మంజూరైన దరఖాస్తును సంబంధిత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్‌కు పంపిస్తారు. చకచకా పొలాల్లో డ్రిల్లింగ్... అధికారుల నుంచి డ్రిల్లింగ్ అనుమతి లభించగానే సదరు డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ వర్క్‌ప్లాన్‌ను ఏపీడీ, ఎంపీడీఓలకు సమర్పిస్తారు. వారి అనుమతితో రైతుకు, స్థానిక అధికారులకు ఏ రోజు, ఏ ప్రదేశంలో డ్రిల్లింగ్ చేస్తున్నారో సమాచారం అందిస్తారు. నిర్ధిష్ట ప్రమాణాల మేరకు నీటి లభ్యత ఆధారంగా సదరు బోరుబావి విజయవంతంను నిర్ధారిస్తారు. డ్రిల్లింగ్ సందర్భంగా సదరు కాంట్రాక్టర్, రైతు సమక్షంలోనే అధికారులు జియో-ట్యాగ్ ఫోటోలను రికార్డు చేస్తారు. డ్రిల్లింగ్, కేసింగ్ అంశాలపై ప్రభుత్వం సూచించిన సాంకేతికత ఆధారంగా ఎంబుక్‌లో రికార్డు చేస్తారు. తమ మండల పరిధిలో జరిగిన డ్రిల్లింగ్‌ల్లో కనీసం పదిశాతం బోరుబావులను డ్వామా ఏపీడీ, ఎంపీడీఓలు సూపర్ చెక్ చేయాల్సి వుంది. ఆ తరువాత కాంట్రాక్టర్‌కు సక్సెస్ రేట్ ఆధారంగా బిల్లులు చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో డ్రిల్లింగ్ వేసిన ప్రదేశంలో నీటి లభ్యత లేక బోరు విఫలమైతే రెండోసారి సదరు రైతుకు అవకాశం ఇస్తారు. విఫలమైన బోరును రాళ్ళతో మూసివేస్తారు. వేసిన ప్రతిబోరు బావి పరిధిలో రీచార్జ్ పిట్, భూగర్భజలాల పరిరక్షణ చర్యలు చేపట్టాల్సి వుంటుంది. అలాగే ఈ పథకం కింద తవ్విన అన్ని బోర్ బావులకు సామాజిక ఆడిట్ నిర్వహించాల్సి వుంటుంది. నిర్ధిష్ట సమయంలోనే మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేలా పంచాయతీరాజ్ కమిఫనర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. -
కృష్ణాజిల్లా గన్నవరంలో భారీ పేలుడు
-
కాణిపాకంలో వినాయక బ్రహ్మోత్సవాలు
-
పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశారు
-
రూ.10 వస్తుందంటే సంతకాలు పెట్టేస్తారు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ తమకు పదిరూపాయలు ఆదాయం వస్తుందంటే ఎక్కడైనా సంతకాలు పెట్టేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా పనులు పూర్తి కాకపోయినా ఎన్నికల కోసం ప్రజలను మోసగించేందుకు చాలీచాలని నీళ్లు విడుదల చేశారన్నారు. నవరత్నాల కార్యక్రమాలను కాపీకొట్టి, ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసగించేందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ వారికి తగిన గుణపాఠం చెప్పాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం పుంగనూరు బస్టాండులో ప్రచారం అనంతరం పెద్దిరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఏమీ చేయకుండా ఐదేళ్లు కాలం గడిపేశారన్నారు. రాజధాని అమరావతిలో అన్నీ తాత్కాలిక భవనాలేనని, ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, కమీషన్ల పేరుతో ప్రభుత్వ నిధులు స్వాహా చేశారన్నారు. 33 వేల ఎకరాల రైతుల భూములను బలవంతంగా లాక్కుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఘనుడు చంద్రబాబునాయుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పెన్షన్లు, పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి కాగానే తన తండ్రి రాజన్న పాలనను తిరిగి కొనసాగిస్తారని అన్నారు. ప్రజలు మాయమాటలకు లొంగకుండా, పనిచేసే వారిని గుర్తించి ఓట్లు వేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, విశ్వనాథ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, స్థానిక పార్టీ సలహాదారు నాగముని, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జెడ్పీఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధీన్‌షరీఫ్, పార్టీ బూత్ కమిటీ మేనేజర్ అమ్ము తదితరులు పాల్గొన్నారు. -
పచ్చి మోసగాడు సీఎంగా ఉన్నాడు
సాక్షి, అమరావతి: పూటకోమాట మార్చే పచ్చి మోసగాడు సీఎంగా ఉండటం రాష్ట్రానికి దురదృష్టకరమని, ఇంత డొంకతిరుగుడు అవకాశవాద రాజకీయ నాయకుడిని తానెప్పుడూ చూడలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాగా భయస్తుడైన చంద్రబాబు బీరాలు పలకడంలో సిద్ధహస్తుడన్నారు. రాజకీయ లబ్ధికోసం నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం స్థాయిని మరిచి చాలా నీచంగా వ్యవహరించే చంద్రబాబు మాట్లాడేది చేయడని, చేసేది మాట్లాడడని విమర్శించారు. బీజేపీతో కాపురం చేసినప్పుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని ప్రశ్నించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టి హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తొలినుంచీ పోరాడుతున్న వైఎస్సార్సీపీకి మైలేజీ వస్తుందనే భయంతో ఇప్పుడు చంద్రబాబు మాటమార్చి ప్రజాధనాన్ని దుబారా చేసి ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్నాడని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని, రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనని అసెంబ్లీలోను, ప్రజాక్షేత్రంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గళమెత్తారని, ఏపీ విభజన తర్వాత కూడా 11 రాష్ట్రాలకు హోదాను కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారని, అయినా చంద్రబాబు చెవికెక్కలేదని ధ్వజమెత్తారు. ప్యాకేజీ కావాలని అడుగుతూ వచ్చిన బాబు ఇప్పుడు హోదాకోసం పోరాడుతునట్లు ప్రచారం చేసుకోవడం కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. అవకాశవాదానికి నిదర్శనం.. హైకోర్టు విభజనను త్వరగా చేయాలని రూ.66 లక్షల ప్రజాధనాన్ని ఫీజుగా చెల్లించి లాయర్‌ను పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేయించిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చడం ఆయన అవకా>శవాదానికి అద్దం పడుతోందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు అది తన వాయిస్ కాదని, డబ్బులు పట్టుకెళ్లినవాళ్లు టీడీపీవారు కాదని ఎక్కడా ఖండించలేదని గుర్తు చేశారు. మీ సంగతి చూస్తామంటే మీ సంగతి తేలుస్తామంటూ కేసీఆర్, చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారే తప్ప కేసులపై కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే వారిమధ్య లాలూచీ ఉందనే అర్థమవుతోందని అనుమానం వెలిబుచ్చారు. రేపు ఎవరితోనో.. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు మొన్నటివరకు బీజేపీతో పొత్తు కొనసాగించారని, ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం పెట్టారని, రేపు ఎవరితో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. మోదీని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు తిడుతున్నాడని, ఇటలీ దెయ్యం అన్న సోనియా ఇప్పుడు దేవత అయ్యిందని, పిల్లకుంకలా కన్పించిన రాహుల్‌కు జూనియర్‌గా మారిపోయాడన్నారు. నిన్నటివరకు మోదీతో మైత్రి కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు మోదీ, కేసీఆర్, జగన్ కలిసి పోటీ చేయాలంటూ వ్యాఖ్యానించడం దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట అన్నారు. అవకాశవాద పొత్తులు పెట్టుకునే చంద్రబాబు తనకు అంటిన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తు న్నాడన్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని, ఒంట రిగానే పోటీ చేస్తామంటూ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటిం చారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో 130 నుంచి 140 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ కృషితోనే ‘హోదా’ బతికుంది
-
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సందేహాలు ఉన్నాయి
-
'రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తున్నారు'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తున్నాడని (సీఎం చంద్రబాబును ఉద్దేశించి) వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన స్వార్థం కోసం చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "అబద్ధపు హామీలతో సీఎం అయ్యారు. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షానికి ఓటేసి ముఖ్యమంత్రి అయ్యారు. రైతు సమస్యలు తీర్చకుండా 20 శాతం రైతులకు కూడా విత్తనాలు పంపిణీ చేయని ఘనత" చంద్రబాబుకే దక్కుతాయని వారు ఆరోపించారు.