సాక్షి, అనంతపురం: మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు అనంతపురంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేర్చేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారు.
కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, 600 హామీలు ఇచ్చి.. మేనిఫెస్టోను కూడా వెబ్‌సైట్ నుంచి తొలగించారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఆత్మకూరు ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ 82888 ఓట్ల మెజార్టీ రావడం శుభపరిణామం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
చదవండి: (మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని)
Comments
Please login to add a commentAdd a comment