నెల్లురు: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. వైఎస్సార్ సీపీ 20 నెలల పాలనకాలంలో 90 శాతానికిపైగా హమీలను నెరవెర్చిందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోపిడి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం నాడు-నేడు పథకంలో భాగంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్ది.. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు.
ఏపీలో ఇప్పటిదాక అర్హులైన సుమారు 63 లక్షల మందికి రూ. 2,350 చొప్పున పింఛన్ అందిస్తున్నామని అన్నారు. ఏపీలో సుమారు 2,434 రోగాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చామని పేర్కొన్నారు. వైద్యం ఖర్చులు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ ఏడాదికి రూ. 13,500 అందిస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment