comments on chandra babu naidu
-
సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది : మంత్రి చెల్లుబోయిన వేణు
-
చంద్రబాబు కట్టప్ప లాంటి వాడు : సునీల్ ధియోదర్
-
పాచిపోయిన లడ్డూలు పవన్‌కు రుచిగా ఉన్నాయా?
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సినిమా టికెట్లు తప్ప.. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు కనపడట్లేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు బడుగు, బలహీన వర్గాలంటే చిన్నచూపని అన్నారు. మంత్రి అప్పలరాజు ఆదివారం గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి డాక్టర్లంటే గౌరవంలేదని, అందుకే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు రుచిగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. విభజన హమీలపై కేంద్రం మాటతప్పితే పవన్ ఇప్పుడేందుకు నోరు మూసుకున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తొందని అన్నారు. తాము 22 నెలల పాలనకాలాన్ని రెఫరెండంగా భావించి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. తాము తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని అన్నారు. ఒకవేళ ‘ మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు.. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి చేసిన సవాల్‌ను చంద్రబాబుకు స్వీకరించే దమ్ముందా! అని తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. -
గురుమూర్తి ఫై నారాలోకేష్ వ్యాఖ్యలు దారుణం
-
‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’
నెల్లురు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. వైఎస్సార్ సీపీ 20 నెలల పాలనకాలంలో 90 శాతానికిపైగా హమీలను నెరవెర్చిందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోపిడి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం నాడు-నేడు పథకంలో భాగంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్ది.. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటిదాక అర్హులైన సుమారు 63 లక్షల మందికి రూ. 2,350 చొప్పున పింఛన్ అందిస్తున్నామని అన్నారు. ఏపీలో సుమారు 2,434 రోగాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చామని పేర్కొన్నారు. వైద్యం ఖర్చులు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ ఏడాదికి రూ. 13,500 అందిస్తుందని స్పష్టం చేశారు. చదవండి: రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
‘చంద్రబాబు రైతు వ్యతిరేకి’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే హంద్రీనీవా పనులు పూర్తయినా రైతుల పొలాలకు నీరందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలని కోరుతూ 9 రోజుల పాటు జలసంకల్పయాత్ర పేరిట విశ్వేశ్వరరెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శులు గుప్పించారు. డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయటంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పయ్యావుల కేశవ్ మాటలకే పరిమితయ్యారని ఎద్దేవా చేశారు. రైతులకు న్యాయం జరిగే దాకా ఉద్యమం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు అందించాలన్న డిమాండ్‌తో ఆయన ఉరవకొండ నియోజకవర్గంలో 140 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రన్న కానుకల పేరుతో రూ. 350 కోట్లు వృథా అయ్యాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కేవలం ఎన్నికల స్టంటు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం పోయాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వచ్చని తెలిపారు. అనంతపురంలో ఆయన శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. వచ్చే బడ్జెట్లో ఎలాంటి పన్నులు వేయరని ఆశిస్తున్నానని, ఇప్పటికే అన్ని రకాల పన్నులు వేశారని జేసీ అన్నారు. ఏపీలో ఆకలి చావులు లేవని, ప్రభుత్వ పథకాలు కొన్నింటిని తగ్గించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకూ పనికిరాకుండా పోయారని, ప్రజాధనంతో నిర్వహిస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు వృథా అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఆందోళన చేయాలని పవన్ కల్యాణ్ సూచిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి ఆందోళన చేయాలో కూడా పవన్ కల్యాణే చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామాకు కూడా తాను సిద్ధమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు కాదు.. 53 వేల ఎకరాలు కావాలని ఆయన ఎద్దేవా చేశారు. విలువైన పంటభూముల్లో భూసమీకరణపై పునరాలోచించాలని ఏపీ సర్కారుకు సూచించారు. తాను బీజేపీలోకి వెళ్లే ప్రసక్తి లేదని, చంద్రబాబు తనను బాగానే చూసుకుంటున్నారని అన్నారు. తాను టీటీడీ చైర్మన్ పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.