
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే హంద్రీనీవా పనులు పూర్తయినా రైతుల పొలాలకు నీరందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలని కోరుతూ 9 రోజుల పాటు జలసంకల్పయాత్ర పేరిట విశ్వేశ్వరరెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శులు గుప్పించారు.
డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయటంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పయ్యావుల కేశవ్ మాటలకే పరిమితయ్యారని ఎద్దేవా చేశారు. రైతులకు న్యాయం జరిగే దాకా ఉద్యమం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు అందించాలన్న డిమాండ్‌తో ఆయన ఉరవకొండ నియోజకవర్గంలో 140 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.