Nell ore
-
AP: నెల్లూరులో టీడీపీకి షాక్.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు
సాక్షి,నెల్లూరు: మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ముత్తుకూరు మండల కేంద్రంలో 200 మంది యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. యువకులందరికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రెండు నెలల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కనుమరుగై పోతాడని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు శుభం కార్డ్ అయితే సోమిరెడ్డికి ఎండ్ కార్డు పడుతుందని కాకాణి అన్నారు. ఇదీచదవండి.. ఓం ప్రథమం.. ఎదురైంది దుశ్శకునం -
ఎల్లో మీడియాపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
-
నెల్లూరు: సర్వేపల్లి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కాకాని
-
గన్ షాట్ : ప్రాణం ఖరీదు
-
నెల్లూరు: కోవూరులో చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్
-
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
చంద్రబాబుకు మైండ్ చెడిపోయింది: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
-
మూడు రాజధానులకు మద్దతుగా నెల్లూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
-
మహిళా కాలేజీకి మంచిరోజులు..
-
నాన్న తిరిగొచ్చాడు..! నెల్లూరు చిన్నారుల ఆనందం..
సాక్షి, అమరావతి బ్యూరో: మద్యం మత్తులో విజయవాడ రైల్వేస్టేషన్లో పిల్లలను వదిలివెళ్లిన తండ్రి తిరిగి వారి చెంతకు చేరాడు. తండ్రిని చూసిన ఆ చిన్నారులు నాన్నా! అంటూ ఆనందంతో ఉప్పొంగారు. పిల్లలను చూడగానే తండ్రి, నాన్నను చూసిన ఆనందంలో పిల్లలు ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్లకు చెందిన తాపీ మేస్త్రి చప్పిడి ప్రసాద్ విజయవాడ రామవరప్పాడులో కొన్నాళ్లుగా తన ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. ప్రసాద్ భార్య ఇదివరకే అతడిని వదలి వెళ్లిపోయింది. నాలుగు రోజుల క్రితం సొంతూరు వెళ్దామంటూ ప్రసాద్ పిల్లలతో కలిసి బెజవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. పిల్లలను అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా రైల్వేస్టేషన్లోనే ఏడుస్తూ ఎదురు చూసిన పిల్లలను చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించారు. తండ్రి కోసం ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శనివారం ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. ఇంతలో తండ్రి ప్రసాద్ తాను పనిచేసే నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధిని వెంటబెట్టుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన బిడ్డల గురించి వాకబు చేశాడు. జీఆర్పీ సిబ్బంది సూచనలతో చైల్డ్‌లైన్ ప్రతినిధుల వద్దకు వెళ్లాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు ప్రసాద్‌ను తీసుకెళ్లారు. అక్కడ తండ్రిని చూడగానే పిల్లలు ఒక్కసారిగా నాన్నా.. అంటూ భోరుమన్నారు. ప్రసాద్ పరుగున వారి వద్దకు వెళ్లి గట్టిగా హత్తుకుని రోదించారు. తండ్రి కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారూ కన్నీరొలికారు. తండ్రికి తాత్కాలికంగా అప్పగింత.. సీడబ్ల్యూసీ ప్రతినిధులు విజయవాడలో ప్రసాద్ ఉంటున్న పరిసరాల్లో విచారణకు సామాజిక కార్యకర్తను పంపారు. అక్కడ ప్రసాద్ వ్యవహారశైలి, తదితర అంశాలను తెలుసుకుని మంగళవారం సోషల్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సమర్పిస్తారు. అప్పటి వరకు నిర్మాణ సంస్థ ప్రతినిధి నుంచి హామీ తీసుకుని పిల్లలను తండ్రికి తాత్కాలికంగా అప్పగించినట్టు సీడబ్ల్యూసీ చైర్మన్ సువార్త ‘సాక్షి’కి చెప్పారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రసాద్ తల్లి వృద్ధాప్యంతో ఉన్నందున పిల్లలను తురిమెర్లకు పంపేకంటే కౌన్సెలింగ్ ఇచ్చి తండ్రి వద్దనే ఉంచాలని యోచిస్తున్నారు. నాలుగు రోజుల ఎదురు చూపుల అనంతరం తండ్రి చెంతకు చేరడంతో పసివాళ్ల కథ సుఖాంతమైంది. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
విహార యాత్రలో విషాదం..
కమలాపురం/ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): స్నేహితులతో కలిసి సరదాగా సేదతీరేందుకు వచ్చి యువకుడు సముద్రంలో గల్లంతయిన సంఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా కమలాపురం టౌన్‌కు చెందిన సయ్యద్ బిలాల్ (20) స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం మైపాడు బీచ్‌కు వచ్చారు. అందరూ కలసి సంతోషంగా సముద్రంలో నీటిలో దిగి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అలల ఉధృతి ఎక్కువై సయ్యద్ బిలాల్ నీటిలో కొట్టుకుపోయాడు. తీరం వెంబడి ఎంత వెతికినా ఇతని జాడ తెలియలేదు. అంతవరకు కళ్ల ఎదుటే ఉన్న స్నేహితుడు గల్లంతవడంతో వెంట వచ్చిన మిత్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పండుగ మరుసటిరోజే.. కమలాపురం పట్టణంలోని దర్గా వీధికి చెందిన బాషామోదీన్, గౌసియా దంపతులకు ఏకైక కుమారుడు బిలాల్. ఇద్దరు కుమార్తెల అనంతరం పుట్టడంతో గారాబంగా పెంచుకున్నారు. తండ్రి హోటల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. తండ్రికి తోడుగా ఉండాలని ఇటీవల బిలాల్ కూడా స్కూటర్ మెకానిక్ షెడ్డుకు వెళ్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు దూరమయ్యాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.ముందు రోజు బక్రీద్ పండుగను బిలాల్ ఆనందంగా జరుపుకున్నాడు.ఆ ఆనందం అంతలోనే అవిరైంది. రెండేళ్ల క్రితం బక్రీద్ పండుగ అనంతరం ఇదే వీధికి చెందిన ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువక ముందే బిలాల్ గల్లంతు కావడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. -
టీడీపీ హయాంలో ఫైబర్ చెక్ డ్యామ్‌ల్లో భారీ దోపిడీ
జిల్లా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులను అవినీతి పాపం వెంటాడుతోంది. టీడీపీ హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో నీరు–చెట్టు పేరుతో చేపట్టిన ఫైబర్ చెక్ డ్యామ్‌లు తెలుగు తమ్ముళ్ల దోపిడీ అడ్డాగా నిలిచాయి. అవినీతిని అడ్డుకోవాల్సిన అధికారులు ఆ ఊబిలో కూరుకుపోయారు. తిలాపాపం.. తలా పిడికెడు చందంగా అధికార యంత్రాంగం అవినీతిలో భాగస్వామ్యం అయింది. రూ.కోట్ల వెచ్చించి చేపట్టిన చెక్ డ్యామ్‌లతో ప్రజోపయోగం లేకపోగా, నాసిరకంగా మిగిలిపోయాయి. ఆ నాటి అవినీతి పాపాల చిట్టా బయటకొస్తోంది సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ ఐదేళ్లు అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారు. జిల్లాలో చెక్ డ్యామ్‌ల్లో అవినీతి వరద పారించారు. ఆ అవినీతిలో భాగస్వామ్యం అయిన జిల్లాలో 21 మంది ఇంజినీరింగ్ అధికారుల మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.కోట్ల దోపిడీకి బాధ్యులై యంత్రాంగంపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా అధునాతన టెక్నాలజీ ఫైబర్ చెక్ డ్యామ్‌లు అంటూ అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతలు హడావుడి చేశారు. అయితే పూర్తిగా నాసిరకం మెటీరియల్ వినియోగించిన తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు కొల్లగొట్టారు. ఓ పక్క నిర్మాణం పూర్తికాకుండానే వాటి డొల్లతనం బహిర్గతమైంది. మరో పక్క దెబ్బతిన్న డ్యామ్‌లు పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. నిర్మించిన కొద్ది నెలలకే నీటి ఉధృతిని తట్టుకోలేక కొన్ని కొట్టుకుపోతే.. మరికొన్ని చోట్ల లీకేజీలతో నీటిని నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. వెరసి ఫైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మించి ఉపయోగం లేని విధంగా మారింది. జిల్లాలో ఇరిగేషన్ శాఖలో రూ.818 కోట్ల విలువైన దాదాపు 9 వేల పనులు చేపట్టారు. అత్యధికంగా ఉదయగిరి నియోజకవర్గంలో రూ.68 కోట్లు విలువైన 208 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. నీరు–చెట్టు పథకం ద్వారా చెక్ డ్యామ్‌లన్నీ కూడా అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, టీడీపీ నేతలే కాంట్రాక్టర్లుగా పనులు మొత్తం నిర్వహించారు. అప్పట్లో నేతలు స్థాయి, హోదాను బట్టి అందిన మేరకు దండుకున్నారు. ఫైబర్ చెక్‌డ్యామ్.. అదో మాయ జిల్లాలో ఫైబర్ చెక్‌డ్యామ్‌ల పేరిట యథేచ్ఛగా దోపిడీ కొనసాగింది. నీరు–చెట్టు దోపిడీ ఒక ఎత్తు అయితే ఫైబర్ చెక్ డ్యామ్‌ల అవినీతి మరో ఎత్తు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఫైబర్ చెక్ డ్యాంలు నిర్మించారు. వాస్తవానికి రూ.2 లక్షల నుంచి రూ.45 లక్షలు విలువ చేసే ఫైబర్ చెక్ డ్యామ్‌లకు రూ.70 లక్షలపైనే వెచ్చించారు. అవసరమైన చోట్లతో పాటు అవసరం లేని చోట్ల కూడా కేవలం బిల్లుల కోసం వీటిని నిర్మించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో నీరు–చెట్టు కింద 8 మండలాల్లో రూ. 39 కోట్లతో 126 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. 2017–18లో రూ.29 కోట్లతో 78 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. ఉదయగిరి, కలిగిరి, వరికుంటపాడు మండలాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌ల్లో కేవలం నెలల్లోనే వాల్వ్‌ల లీకేజీలు, పైప్‌లు లీకులతో నిరుపయోగంగా మారాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఫైబర్ చెక్ డ్యామ్‌లు ఎక్కడా లేవు. కేవలం ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రమే ఉన్నాయి. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన అప్పటి ఎమ్మెల్యే తన సన్నిహితులకు చెందిన కంపెనీల నుంచి మెటీరియల్ దిగుమతి చేసుకోని ఫైబర్ చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ నిధులు భారీగా స్వాహాకు ఆస్కారం ఏర్పడినట్లు గుర్తించారు. విజిలెన్స్ విచారణలో బహిర్గతం జిల్లాలో నీరు–చెట్టు పథకంలో అవినీతి వరద పారిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేటతెల్లమైంది. ఫైబర్ చెక్‌డ్యామ్‌ల నాణ్యత, వాటి పనితీరు, కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న వైనం, వాస్తవ విలువ, ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన వైఖరి తదితర అంశాలపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పూడిక తీత పనులు చేయకుండానే చెక్‌డ్యాంల నిర్మాణం, అవసరం లేని చోట్ల ఏర్పాటు, చేపట్టినవి కూడా నాసిరకంగా ఉన్నాయని నిర్ధారించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనులు చేపట్టినట్లు రుజువైంది. ఆ మేరకు జిల్లాలో 21 మంది అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో 13 మంది ఏఈలు, నలుగురు డీఈలు, ఇద్దరు ఈఈలు, ఎస్ఈ, సీఈలను బాధ్యులను చేస్తూ తాఖీదులు జారీ చేస్తున్నట్లు సమాచారం. -
పుత్తడి బొమ్మలకు పుస్తెల బంధం..
బడికెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన అమ్మాయిలు పుస్తెలతాడుతో అత్తారింటి బాట పడుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకుండానే భార్యగా, తల్లిగా బాధ్యతలను మోస్తున్నారు. సంసార మధురిమలు తెలియకుండానే జీవితాన్ని మోస్తున్నారు. పేదరికం ఒక వైపు, ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. సాక్షి, నెల్లూరు: సాంకేతికత రోజు రోజుకూ పెరుగుతున్నా, ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా జిల్లాలో మాత్రం బాల్య వివాహాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్‌కు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడ పిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీట లెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా.. బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంలో బందీ చేస్తున్నారు. ఎక్కువగా గిరిజన, మత్స్యకార కుటుంబాల్లో ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్ల లోపే వివాహాలు జరిపిస్తున్నారు. పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో మరి కొందరు ఇలా చేస్తున్నారు. అడ్డుకట్టకు మార్గాలు గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో సూపర్వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్యవివాహాలు అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా 1098 ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఇప్పటికే సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తల మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో 18 ఏళ్లు నిండుకుండానే పెళ్లిళ్లు చేయకూడదనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ తప్పని సరి బాల్యవివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. జిల్లాలోని అన్ని, రెవెన్యూ డివిజనల్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సీడీపీఓలు వివాహ రిజిస్ట్రేషన్ చట్టం -2002 అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీఓ జారీ చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో మహిళ సంరక్షణ కార్యదర్శి ద్వారా తప్పక వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్ని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వరుడు, వధువు, ఇద్దరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్ , రెండు పాస్‌ఫొటో సైజు ఫొటోలు, వివాహ పత్రికలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఇకపై జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు కఠినంగా చర్యలు చేపడుతాం. – రోజ్‌మాండ్, ఐసీడీఎస్ పీడీ -
పేదల కళ్లలో సొంతింటి వెలుగులు : అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ప్రైవేట్ లేఅవుట్ల కంటే మిన్నగా అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు తమ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే వారి కళ్లల్లో సంతోషం, ఆనందం కనిపిస్తోందని, ఏక కాలంలో ఇలా శంకుస్థాపనలు చేయడం పండగ వాతావరణాన్ని తలపిస్తోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరు నగర నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండ్లపూడి వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం చరిత్ర అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయంలో భాగంగా తొలి విడతగా 17 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. నగర నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన దాదాపు 14,500 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అందులో మొదటి విడతగా 7,600 ఇళ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లు నిర్మిస్తూ మంచి ఆశయంతో ముందుకు వెళుతున్నారన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు ఆరు అంకణాలు మాత్రమేనని ఇచ్చారని, విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన టిడ్కో ఇళ్లు కేవలం నాలుగు అంకణాలు మాత్రమేనని గుర్తు చేశారు. పేదలకు సొంతిల్లు నిర్మించాలనే ఆలోచనతో అందుబాటులో ఉన్న స్థలాలను అభివృద్ధి చేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. పట్టణ పరిధిలో తక్కువ భూమి అందుబాటులో ఉండడంతో వీలైనంత వరకు సేకరించి గత ప్రభుత్వం కంటే ఎంతో గొప్పగా పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన దాఖాలు లేవన్నారు. గతంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఇచ్చే క్రమంలో పేదలపై రూ.3 లక్షల భారం మోపారన్నారు. ఆ రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేసి ఉచితంగా ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తునామన్నారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్), అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. పేద వారికి అండగా ఉండేది జగనన్న ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్, ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్, వైఎస్సార్సీపీ నాయకులు కొణిదల సుధీర్, ఎండీ ఖలీల్ అహ్మద్, వేలూరు మహేష్, ఇంతియాజ్, గోగుల నాగరాజు, కుంచాల శ్రీనివాసులు, వందవాశి రంగా పాల్గొన్నారు. -
మాస్క్ మస్ట్‌గా ధరించాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
తిరుపతి ఎన్నికల ప్రచారం వైఎస్ జగన్ ప్రతిష్టను నిలబెడుతాయి
-
‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’
నెల్లురు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. వైఎస్సార్ సీపీ 20 నెలల పాలనకాలంలో 90 శాతానికిపైగా హమీలను నెరవెర్చిందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోపిడి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం నాడు-నేడు పథకంలో భాగంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్ది.. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటిదాక అర్హులైన సుమారు 63 లక్షల మందికి రూ. 2,350 చొప్పున పింఛన్ అందిస్తున్నామని అన్నారు. ఏపీలో సుమారు 2,434 రోగాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చామని పేర్కొన్నారు. వైద్యం ఖర్చులు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ ఏడాదికి రూ. 13,500 అందిస్తుందని స్పష్టం చేశారు. చదవండి: రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
నెల్లూరు: భారీ వర్షాలు
-
హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం
-
అలాంటి వ్యక్తికి మాట్లాడే అర్హత కూడా లేదు
-
నెల్లూరు: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
-
నెల్లూరు జిల్లా విడవలూరు రైతుల ఔదార్యం
-
ఎలాంటి సమస్య ఉన్న కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలి: మంత్రి అనిల్
-
నెల్లూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
-
ప్రజల కోసం రంగంలోకి..
-
తొలి కరోనా కేసుకు...
-
రైతుల భూములకు పూర్తి భద్రత
నెల్లూరు (అర్బన్): రాష్ట్రంలో భూ రికార్డులను ల్యాండ్ ప్యూరిఫికేషన్ (భూ రికార్డుల ప్రక్షాళన) చేసి వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్‌చంద్రబోస్ చెప్పారు. శనివారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతికతతో వెబ్ ల్యాండ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీనివల్ల రైతుల భూముల రికార్డులు పక్కాగా ఉంటాయని తెలిపారు. జూలై నుంచి మూడు నెలల పాటు భూములకు సంబంధించి ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో భూ రైతు యాజమాన్య హక్కు చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెస్తున్నారన్నారు. తద్వారా రైతుల భూమికి పూర్తి భద్రత కలుగుతుందని చెప్పారు. ఇంటి స్థలాలు కోరుతూ 28 లక్షల దరఖాస్తులు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం సుమారు 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల ఇళ్లు మంజూరు చేయనుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ చుక్కల భూములు, సీజేఎఫ్ఎస్ డీ ఫాం పట్టా భూముల్లో నివాసముంటున్న వారి పేరిట సంబంధిత భూములను క్రమబద్ధీకరించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. సమావేశంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
జన్మభూమి కమిటీల అవినీతిమయం
సాక్షి,పెళ్లకూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.దోచుకోవడమే పరమావధిగా అధికార పార్టీ పాలన సాగింది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేశారు. ఆ పార్టీ నాయకులు ఇసుక అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించారు. దీంతో స్వర్ణముఖి, కాళంగి నదులు రూపు కోల్పోయాయి. ఇళ్లు, పెన్షన్లు, రుణాలు మంజూరు చేసుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులంతా ఐదేళ్లపాటు జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా అర్హులకు ఒక్క పథకాన్ని కూడా అందించిన దాఖల్లాలేవు. దోపిడీయే ధ్యేయంగా.. నీరు – చెట్టు పథకం కింద నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. పనులను టీడీపీ నాయకులు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా తూతూమంత్రంగా పనులు పూర్తి చేసి రూ.కోట్లు నిధులు బొక్కేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అదేవిధంగా రైతు రథాల కింద మంజూరైన ట్రాక్టర్లను అర్హులైన అన్నదాతలకు అందజేయకుండా అధికార పార్టీ నేతలే కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్ గృహాలు, పెన్షన్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీలు లబ్ధిదారుల వద్ద అధిక మొత్తంలో గుంజుకున్నట్లు విమర్శలున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు పంచాయతీ సర్పంచ్‌లకు నిధులు మంజూరు చేయకుండా రాజ్యాంగా విరుద్ధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. వారు చేసిన అరచకాలతో ప్రజలు బాగా విసిగిపోయారు. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసింది. గడిచిన ఐదేళ్లలో ఒక్కపైసా మాఫీ చేయకపోగా వడ్డీ భారంతో అన్నదాతలు అనేక కష్టాలు పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ భారీగా అవినీతి చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకుల భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఇన్చార్జిగా వ్యవహరించిన వారు అధికారులపై ఒత్తిళ్లపై తెచ్చి తమ నాయకులను పనులు చేయించుకున్నారు. మున్సిపాలిటీల్లో ఇలా.. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ప్రజల గురించి అధికార పార్టీ నాయకులు స్పందించలేదు. పలుచోట్ల జరిగిన పనుల్లో అవినీతిని ఏరులై పారించారు. తెలుగుదేశం నాయకులు కాంట్రాక్టర్లుగా మారి రూ.లక్షలు స్వాహా చేశారు. ప్రధానంగా నాయుడుపేట మున్సిపాలిటీలో జరిగిన రోడ్డు, డ్రెయినేజీ పనుల్లో అవినీతి ఎక్కువగా చోటుచేసుకుంది. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇక్కడి ప్రజలు తాగునీటితో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సూళ్లూరుపేటలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న తీసుకున్న చర్యలు శూన్యం. ప్రజల కోసం ప్రతిపక్షం పోరాటాలు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికార పార్టీ పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకులు వాటిపై పోరాటాలు చేస్తూ పరిష్కారానికి తమవంతు కృషి చేశారు. ఐదేళ్లలో వర్షాలు సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మారుమూల గ్రామల ప్రజల దుస్థితిపై ఇక్కడి టీడీపీ నేతలు స్పందించలేదు. వైఎస్సార్సీపీ నాయకులు పలుమార్లు జెడ్పీ సమావేశంలో ప్రజల పక్షాన గళం విప్పారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిత్యం గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లకూరు, నాయుడుపేట మండలాల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, లారీలతో చెన్నైకి తరలించడంపై పెళ్లకూరు ఎంపీపీ సత్యనారాయణరెడ్డి కొందరు రైతులతో కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటికి కష్టాలు తప్పవని, ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయో ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొని అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే పలుమార్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులను సైతం టీడీపీ నేతలు బెదించి వాహనాలను విడిపించిన ఘటన చోటుచేసుకున్నాయి. అధికార పక్ష అవినీతిపై ప్రతిపక్ష నేతలు అనేక సందర్భాల్లో గళం విప్పారు. సమావేశాల్లో మాట్లాడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. తాగు, సాగునీటి విషయంలో అధికారులతో అనేకసార్లు మాట్లాడి వినతులు సమర్పించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రజలపక్షాన గళం విప్పారు. ప్రజల సమస్యలపై చర్చించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వైనంపై బహిరంగ వేదికలపై నిలదీసిన ఘటనలున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ ఒక్కోసారి ఒక్కో స్టాండ్ తీసుకున్నా ప్రతిపక్షం మాత్రం మొదటి నుంచి హోదా కోసమే పోరాడింది. ఆ పార్టీ నాయకులు హోదా వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పోరుబాట పట్టారు. ప్రజలతో కలిసి ధర్నాలు, ర్యాలీలు చేశారు. -
విశ్వసనీయతకే పట్టం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో పది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికతో పాటు, ఆచరణకు సాధ్యమైన హామీలు ఇచ్చి, ప్రతిపక్షంలో తమ పనితీరు చూసే ఓట్లు వేయాలని ప్రజల వద్దకు వెళ్లారు. అధికార టీడీపీ మాత్రం ఐదేళ్లు అవినీతికి పాల్పడి ఆ డబ్బు మూటలతో గెలవాలని ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగింది. అవినీతి తప్ప అభివృద్ధి చేయలేక, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేక డబ్బుల రాజకీయాలను నమ్ముకుని ఓట్లు కొనే పనిలో ఉంది. అయితే గత పాలన నేపథ్యంలో జిల్లా ప్రజలు టీడీపీని ఎంత వరకు ఆదరిస్తారో అనే ఆందోళన టీడీపీ అభ్యర్థుల్లో బలంగా ఉంది. అయినా అధినేత మాట తప్పని సరిగా కావడంతో డబ్బు మూటలతో అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. అభ్యర్థుల ప్రకటన మొదలుకొని ప్రచార పర్వం వరకు పూర్తి స్పష్టతతో ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుని ముందుకెళ్లింది.ఇక టీడీపీ తడబాట్లు, తప్పటడుగులు అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలై నేటికి కొనసాగుతున్నాయి. దీంతో ఓటర్లు కూడా గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ కురుక్షేత్రంను నిశితంగా గమనించి బ్యాలెట్‌తో గురువారం తీర్పు ఇవ్వనున్నారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వివాదరహితుడు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి బరిలో నిలిచారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, అందరికీ సుపరిచితుడు బల్లి దుర్గాప్రసాద్ బరిలో దిగారు. అధికార పార్టీలో వెన్నుపోటు రాజకీయాలే జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో అధికార పార్టీలో వెన్నుపోటు వ్యవహారాలు, డబ్బు రాజకీయాలు బలంగా సాగుతున్నాయి. నెల్లూరు నగరంలో అయితే పూర్తిగా డబ్బునే నమ్ముకొని మంత్రి నారాయణ అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. నగరంలోని అన్ని డివిజన్లపై డబ్బు మూటలను భారీగా కుమ్మరించారు. అయితే గడిచిన ఐదేళ్లలో నారాయణ నెల్లూరు నగరంలో ఎన్ని రోజులు ఉన్నారు. ఏం చేశారు. అధికార పార్టీ నేతల తీరు ఎలా ఉందనే చర్చ సాగుతున్న క్రమంలో అంతర్గత వెన్నుపోట్లతో పూర్తి నష్టం కలుగుతుందనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఇక నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలో ఉన్న అజీజ్ నగర మేయర్‌గా ఐదేళ్లు పాటు పనిచేసినా పూర్తి డమ్మీగానే మిగిలిపోయారు. మేయర్‌గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోని నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. దీనికి తోడు ఆయన స్టార్ కంపెనీ కేసులు ఇబ్బందులతో నేటికీ సతమతం అవుతున్నారు. ఇక సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభివృద్ధి ముసుగులో వందల రూ.కోట్లు దండుకున్నారు. చేయని పనులు, మంజూరు కానీ పనులకు కూడా ముందుగానే భారీగా వసూళ్లు చేయడం అయనకే చెల్లింది. కావలిలో బరిలో నిలిచిన కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పూర్తిగా పరాన్నజీవిగా మారారు. బీద సోదరుల కనుసన్నల్లో పని చేస్తున్నారు. చివరి నిమిషంలో పార్టీలోకి జంప్ అయి టికెట్ దక్కించుకున్న కాటంరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కోవూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రోడ్డు మొదలుకొని భూములు వరకు దేనిని వదలకుండా భారీగా స్వాహా చేశారు. ఇక్కడ ప్రతి ప్రభుత్వ పథకం పార్టీ క్యాడర్ కంటే ఆయనకు వరంలా మారి భారీగా దండుకున్నారు. ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి బొల్లినేని రామారావు ఉదయగిరి కంటే ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నారు. ఉదయగిరిలో చేసిన పనుల్లో భారీగా అవినీతి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో పనులకు సంబధించిన కేసులు కూడా నమోదు కావడంతో గందరగోళం కొనసాగుతుంది. ఇక ఆత్మకూరు అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే బడా పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్యకు అధికార పార్టీ నేతల నుంచే వెన్నుపోట్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మూడు నెలల ముందు వచ్చి డబ్బు మూటలతో గెలవాలని ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గూడూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థిగా ఉన్న పాశం సునీల్‌కుమార్ లెక్కకు మించి అవినీతికి పాల్పడిన విషయం జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సూళ్లూరుపేటలో పరసారత్నంకు నామినేషన్ నుంచి మొదలైన గందరగోళం నేటికి కొనసాగుతుంది. స్థానికుల నేతల వెన్నుపోట్లతో పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేని పరిస్థితి. వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కురుగుండ్ల రామకృష్ణ అయితే కాంట్రాక్టర్లను బెదిరించడం మొదలుకొని అన్ని పనులు భారీగా చేయటంతో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. -
ఫ్యాన్ గాలికి తిరగబడిన సైకిల్
సాక్షి, కావలి: జిల్లాలో ప్రశాంతతకు, దాన గుణానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రాచుర్యం పొందిన కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఫ్యాను హోరుకు టీడీపీ చతికిలబడిపోయింది. తొలి నుంచి కూడా వైఎస్సార్సీపీ అన్ని అంశాలపైన స్పష్టత ఉండటంతో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే ప్రచారం ప్రారంభించి పట్టు సాధించింది.ఈ విధంగా ఆ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రచారంలో ప్రజలకు బాగా దగ్గరయ్యారు.అలాగే పార్టీలో నాయకులు, కార్యకర్తలు తమ సొంత ఎన్నికలనే భావనతో కసిగా ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి తోడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, పాదయాత్రలో వివిధ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని ఇచ్చిన హామీలు ప్రజల్లో విస్తృతంగా వెళ్లింది.చంద్రబాబునాయుడు మోసపూరితమైన పరిపాలనపై విసిగివేసారిన ప్రజలు, జగన్మోహన్రెడ్డి ఇస్తున్న వాగ్దానాలు అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఉండటంతో ప్రజల్లో వీటిపై సానుకూలంగా చర్చించుకొంటున్నారు. ఈ క్రమంలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అంటూ ప్రచారాన్ని ఉధృతంగా చేశారు.దీంతో ప్రజలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారానికి వస్తే ఆత్మీయంగా పలకరించడం, ఫ్యాను గిర్రుమంటూ తిరుగుతుందంటూ చెప్పడంతో ఆ పార్టీలో జోష్ పెంచింది. ప్రచారానికి బ్రహ్మరథం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రచారానికి గ్రామాలకు వెళ్లినా, పట్టణంలో ఏ వీధికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయనకు కరచాలనం చేసేవారు. పలుచోట్ల ఎన్నికలు అయిపోగానే తాము వచ్చి కలుస్తామని, మా సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అడ్వాన్స్గానే అడగడం గమనార్హం. ఇతరులపై ఏ విషయంలోనూ ఆధారపడని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగతం నిర్ణయాలు తీసుకొంటూ ప్రచారంలో ఫ్యాను జోరును బలంగా ఉండేలా చేసుకోవడంతో విజయవంతం అయ్యారు. ఇక టీడీపీలో విచిత్రమైన అయోమయ పరిస్థితి ఎన్నికల ముందు నుంచి ప్రారంభమై, పోలింగ్ దగ్గరకు వచ్చేసినా కొనసాగుతూనే ఉంది. చివరి నిమిషం వరకు కూడా నేను కావలి అసెంబ్లీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, ప్రచారాలు నమ్మవద్దని బీద మస్తాన్‌రావు టీడీపీ నాయకులకు చెబుతూ వచ్చారు. నాలుగుసార్లు కావలి అభ్యర్థిగా బీద మస్తాన్రావుని ప్రకటించారని నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. నామినేషన్ దాఖలు చేసే గడువు దగ్గరకు వచ్చే వరకు నరాలు తెగే ఉత్కంఠంగా కొనసాగిన అభ్యర్థిత్వం తంతులో, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి అభ్యర్థిత్వం దక్కింది. బీద మస్తాన్‌రావును నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు.అయితే కావలి అభ్యర్థిత్వాన్ని బలంగా ఆశించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రను కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కావలి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని తెగేసి చెప్పడంతో,మనస్తాపం చెంది బీద రవిచంద్ర కావలి వైపు కన్నెత్తి చూడలేదని టీడీపీ వర్గాలు చెప్పడాన్ని బట్టి తెలుస్తోంది. కొనసాగుతున్న అంతర్గత విభేదాలు టీడీపీ నాయకులతో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆయన అనుచరులు మధ్య అంతర్గతంగా బిగ్ ఫైట్ ప్రారంభమై, అది నేటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రగడలో టీడీపీ అభ్యర్ధి ప్రచారం మొక్కుబడిగా జరిగింది. ఎన్నికల ఖర్చు వ్యవహారంలో ఒక దశలో టీడీపీ నాయకులు నేరుగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డినే ప్రశ్నిస్తే, ఆయన మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా చూశారని అంటున్నారు. ఈ అంశం చంద్రబాబునాయుడు దృష్టికి బీద మస్తాన్‌రావు తీసుకెళ్తే, నేరుగా చంద్రబాబు నాయుడు కూడా విష్ణువర్ధన్‌రెడ్డిని ఎన్నికల ఖర్చు సంగతి ఏమిటని నిలదీస్తే, చూద్దాం అనే ఒకే ఒక్కమాటతో సరిపెట్టేశారని అంటున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రచారంలో పూర్తిగా చతికిలపడింది.కాకపోతే మొక్కుబడిగా ప్రచారం చేశారు.ఇక కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యేకు, మత్స్యకారులకు వార్నింగ్‌లు ఇవ్వడం కూడా ప్రజల్లో బలంగా వెళ్లిపోవడంతో ఇప్పుడే ఈ విధంగా ఉంటే గెలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయనే ఆందోళనను స్వయంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చర్చనీయాంశం చేశారు. దీంతో ప్రజల్లో చంద్రబాబునాయుడు పాలనపై వ్యతిరేకత కూడా జతకావడంతో టీడీపీ ఎక్కడ ఉందనే పరిస్థితి నెలకొని ఉంది. -
పోలీసులకు పండగే
సాక్షి, నెల్లూరు: జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటమి తప్పదని సర్వేలు తేల్చేశాయి. మరో వైపు రాజకీయ విశ్లేషకులు సైతం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎదురుగాలి తప్పదని తేల్చేశారు. దీంతో వైఎస్సార్సీపీకి గట్టి పోటీ అయినా ఇవ్వాలన్న ఆశతో ఓటుకు నోట్లు పెట్టి కోనుగోలు చేస్తున్నారు. అభ్యర్థులు ఆర్థిక స్తోమతను బట్టి నగదు పంపకాలు చేస్తున్నారు.నెల్లూరు నగరంలో మాత్రం మంత్రి నారాయణ ఓటుకు రూ.2 వేలు వంతున బహిరంగంగానే పంపకాలు చేస్తున్నారు. తమ విద్యాసంస్థల ఉద్యోగుల చేత నగదు పంపకాలు చేయిస్తూ ఉంటే వైఎస్సార్సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే నెల్లూరు రూరల్‌లో రూ.1000 వంతున, ఆత్మకూరులో రూ.2 వేలు, కావలిలో రూ.1000, ఉదయగిరిలో రూ.1000, వెంకటగిరిలో రూ.2వేలు, సూళ్లూరుపేట, గూడూరులో రూ.1000 వంతున ఓటుకు నగదు పంచుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటుకు నోటు ఇచ్చి టీడీపీ అభ్యర్థులు కొనుగోలు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టుకోలేకపోతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగదు స్వాహా.. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థులు వారికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారులను తమ నియోజకవర్గంలో బదిలీలపై వేయించుకున్నారు. ఎన్నికల సమయంలో తామెన్ని అక్రమాలు చేసినా వారు చూసీ చూడనట్లుగా ముందుగానే ఒప్పందంతోనే వచ్చినట్లు ఆరోపణలున్నాయి.ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థులు బరితెగించి ఎన్నికల సమయంలో నిబంధనలు తుంగలో తొక్కినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఓటర్లకు పంపకాలు కోసం నియోజకవర్గాలకు తరలిస్తున్న నగదును పట్టుకున్న పోలీసులు అందులో వాటాలు పుచ్చుకుని వదలివేసిన సంఘటనలున్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలీసులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం గువ్వాడి–కాంచెరువు రహదారి మధ్యలో మూడు రోజుల క్రితం టీడీపీ అభ్యర్థికి చెందిన రూ.కోటి నగదును ఓటర్లకు పంపకాల కోసం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం వెలుగులోకి రాకుండా స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పోలీసుల వద్ద పైరవీలు చేసి రూ.10 లక్షలు వారికి సమర్పించుకుని రూ.90 లక్షల తీసుకెళ్లినట్లు ప్రచారం జోరుగా ఉంది. వరికుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వద్ద ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ టీడీపీ నేతలు నగదు పంపకాలు చేస్తుండగా పట్టుకుని వారి వద్ద నున్న రూ.1.5 లక్షలు తీసుకుని వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో అనంతసాగరం మండలంలో ఇటీవల టీడీపీ అభ్యర్థికి చెందిన సమీప బంధువు ఓటర్లకు నగదు పంపకాలు చేస్తున్న సమయంలో రూ.8.5 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. అయితే అందులో రూ.7 లక్షల నగదు పక్కదారి పట్టించి రూ.1.5 లక్షలు పట్టుకున్నట్లుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఉద్యోగులు వద్ద రూ.20 లక్షలు పట్టుబడినా పోలీసులు కొంత నగదు తీసుకుని వదలివేసినట్లు ప్రచారం ఉంది. -
బాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ హంబక్
ప్రతిభ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరు పైసా ఖర్చు లేకుండా ఉన్నత చదువు చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన బృహత్తర పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకం ఒకటి. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంపశయ్యపైకి చేర్చింది. వైఎస్సార్ హయాంలో సజావుగా సాగిన ఈ పథకం మూడు సంవత్సరాలుగా గాడి తప్పింది. ఈ పథకం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాడి తప్పడంతో తల్లిదండ్రులను, విద్యార్థులను మనస్థాపానికి గురిచేస్తోంది. సాక్షి,గూడూరు: జిల్లాలో 478 కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు 83,550 మంది వివిధ రకాల కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరు 2018–19 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో స్కాలర్షిప్ రూ.90.92 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.266 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.495 కోట్లు ఉన్నాయి. గతేడాది బీసీ, ఈబీసీ బకాయిలు మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఫీజులను, స్కాలర్ షిప్‌లను 94 శాతం మంజూరు చేసినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నా.. విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.766.68 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం రూ.271.68 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. పేదలకు వరం ఫీజు రీయింబర్స్మెంట్ పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయిబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి కళాశాల గ్రేడ్‌ను బట్టి ఎస్సీ, ఎస్టీలకు ప్రతి ఏడాది ట్యూషన్ ఫీజు కింద రూ.35 వేల నుంచి రూ.90 వేల వరకు, బీసీలు, మైనార్టీలకు సంబంధించి రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు రూ. 26 వేలకు పైగా ఆయా కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. దీంతో పాటు కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్ కింద రూ.13 వేలను అందజేసింది. వీటితో పాటు స్పెషల్ ఫీజు కింద రూ. 5,500 విడుదల చేశారు. కళాశాల ఫీజులతో సంబంధం లేకుండా మెయింటెనెన్స్ కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ.680 ఇచ్చారు. ఆ సమయంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. స్పెషల్ ఫీజు కింద ఇచ్చే రూ.5,500లను నిలిపివేశారు. కేవలం ఇంజినీరింగ్‌కు రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏకు రూ.27 వేలు విడుదల చేస్తున్నారు. దీంతో మిగతా మొత్తాన్ని ఆ పేదింటి తల్లిదండ్రులు కాయకష్టం చేసి, ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన పేరు కేఆర్‌రెడ్డి, గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కరస్పాండెంట్. ఈ కళాశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు ఉంది. అయితే ఈ నెల 18న కేవలం రూ.2,875 మాత్రమే కళాశాల అకౌంట్లో జమ చేశారు. కోట్లాది రూపాయలు బకాయి ఉంటే.. కేవలం నామమాత్రంగా ఇలా చిన్న మొత్తాన్ని జమ చేయడంతో ఆయన ఖంగుతిన్నారు. కళాశాలకు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించినట్లు భ్రమ కల్పించే విధంగా ఉంది. ఈ కళాశాల నుంచి రూ.45 లక్షలు ట్రెజరీకి బిల్లు పెట్టి నెలలు గడుస్తున్నా, వాటిని ఇప్పటి వరకు క్లియర్ చేయడం లేదని కేఆర్ రెడ్డి వాపోతున్నారు. కళాశాలలో పనిచేస్తున్న 110 మంది ఉద్యోగులకు జీతాలెక్కడి నుంచి ఇవ్వగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి కళాశాలను ఎన్నాళ్లు నెట్టుకురాగలమని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక కేఆర్ రెడ్డిది మాత్రమే కాదు.. జిల్లాలో వందలాది కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ఇలాగే ఉంది. జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలు రాకపోవడంతో యాజమాన్యాలు అప్పులు చేసి కొన్నాళ్లు ఇచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఇవ్వలేమని, కొంత మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. నెలంతా కష్టపడినా.. నెల ఆఖరులో జీతాలు రాకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. – జీ శ్రీనివాసులు, అధ్యాపకులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలు చెల్లించకపోవడంతో పరీక్షలు రాయనిస్తారో లేదోనని ఆందోళనగా ఉంది. దీంతో చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నాం. ఎలాగోలా పరీక్షలు రాయనిస్తున్నారు. లేదంటే మా పరిస్థితి ఎలా?. – బీ మునిరాజా, ఎంబీఏ తీవ్ర ఒత్తిడికి గురయ్యాం పరీక్షలు రాయనిస్తారో లేదో అని ప్రతి రోజు మేమంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యాము. ఈ ప్రభుత్వానికి మాలాంటి పేద విద్యార్థులపై ఎంత విద్యార్థులపై ఎందుకింత చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు. – జే వంశీ, ఎంబీఏ -
నెల్లూరులో యువ ఓటర్లదే అంతిమ తీర్పు
సాక్షి, నెల్లూరు(పొగతోట): ఈ దఫా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలు యువత చేతుల్లో ఉన్నాయి. ఓటు నమోదుకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో యువ ఓటర్లు అధికంగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 18 నుంచి 39 ఏళ్ల లోపు నవ..యువతరం ఓట్లు కీలకం కానున్నాయి. యువ ఓట్లు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థులకు విజయం వరించినట్లే. జిల్లాలో ఓటర్లు 22,06,652 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఓటర్లు 10,52,397 మంది ఉన్నారు. 40 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఓటర్లు 81,7303 మంది ఉన్నారు. జిల్లాలో 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 27,723 మంది ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఓటర్లు 27,507 మంది మాత్రమే ఉన్నారు. ఈ నెల 25వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. నూతన జాబితాలో సుమారు 1.60 లక్షల ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా సంఖ్య 20,63604 మంది ఉన్నారు. 8 ఏళ్లలో జనాభా పెరిగారు. ప్రస్తుతం జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన దొంతు శారద దంపతులు
సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె భర్త దొంతు బాలకృష్ణ, పలువురు కౌన్సిలర్లతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో ఆమెకు ప్రాధాన్యం లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యవహారశైలి కారణంగా కొంతకాలంగా వారిద్దరి మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. వెంకటగిరి పట్టణంలో చేనేత వర్గానికి చెందిన చైర్పర్సన్ దొంతు శారద దంపతులకు మంచి పట్టు ఉంది. ఆమె సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. చైర్పర్సన్ శారద దంపతులు చేరిక వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరింది. చైర్‌పర్సన్‌తో మున్సిపల్ కౌన్సిలర్లు మల్లికార్జున్‌రావు, పరమేశ్వరి ఆమె భర్త కృష్ణమూర్తి, టీడీపీ యువజన విభాగానికి చెందిన పలువురు నాయకులు వైఎస్ జగన్మొహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి, వెంకటగిరి పట్టణ కన్వీనర్ జి.ఢిల్లీబాబు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం చేనేత విభాగం అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఇక వెంకటగిరిలో టీడీపీ అవిర్భావం నుంచి కీలకనేతలుగా ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణ ప్రముఖులు రెండు మూడు రోజుల్లో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు సమాచారం. వారి ఆగమనం వైఎస్సార్సీపీకి అనుకూలించే అంశం అని రాజకీయాలపై అవగాహన ఉన్న పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆ హాస్యం చిరస్మరణీయం
చెరుకు గడలా పొడవైన ఆకారం... దానికి తోడు మూతిపై ఫ్రెంచ్ మీసం... తెలుగుదనం ఉట్టిపడేట్టు లాల్చీ, పంచెకట్టు... భుజాలను ఎగరేస్తూ విచిత్రమైన నడక... ఠపీమని ఆగి... అలాగే వెనక్కు తిరిగి... నెల్లూరు యాసలో నోరెళ్లపెట్టి.. ‘యట్టా...’ అన్నాడంతే... థియేటర్లో నవ్వులే నవ్వులు. ఆ నవ్వులు అలాగే ఇరవై ఏళ్ల పైచిలుకు నిరాటంకంగా థియేటర్లలో వినిపించాయి. ఆ మాటకొస్తే ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి రమణారెడ్డా మజాకా! ఎన్ని హిట్ సినిమాల్లో నటించినా... రెండేళ్లు తెరపై కనిపించకపోతే... ఆ నటుడ్ని ఈజీగా మరిచిపోతున్న రోజులివి. అలాంటి ఓ నటుడు భౌతికంగా దూరమై 39 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఆ జ్ఞాపకాలు, ఆ పాత్రలు, ఆ మేనరిజాలు జనాల హృదయాల్లో పచ్చబొట్టులా నిలిచిపోయాయంటే.. ఆ వ్యక్తి ఎంత సాధించి ఉండాలి? అందుకే రమణారెడ్డి చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. నేడు ఆ మహానటుని వర్థంతి. అందుకే కాసేపు స్మరించుకుందాం. రమణారెడ్డి నెల్లూరు ప్రాంత వాసి. ఉద్యోగం శానిటరీ ఇన్స్పెక్టర్. సద్యోగం నాటకాలు వేయడం, మోనో యాక్టింగ్. సెలవు దొరికితే చాలు... చలో చెన్నపట్నం అనేవారు. అవకాశాల కోసం నిర్మాతల్నీ దర్శకుల్ని కలుస్తూ ఉండేవారు. నిర్మాత శంకరరావు... ఆయన నిర్మించిన ‘మాయ పిల్ల’(1951) సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. పాత్ర మంచిదే. సినిమానే సరిగ్గా ఆడలా. దాంతో రెడ్డిగారు జనాల్లో రిజిస్టరవ్వలా. కానీ మొక్కవోని ధైర్యంగా ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చేసి, అవకాశాలకోసం ప్రయత్నాలు సాగించారు రమణారెడ్డి. ఈ క్రమంలో ఆయన నటించిన చిత్రాలు దీక్ష, మానవతి, కన్నతల్లి. ఇవి కూడా ఆయనకు పెద్దగా పేరు తేలా. అప్పుడొచ్చింది ‘మిస్సమ్మ’. అందులో చేసిన ‘డేవిడ్’ పాత్ర రమణారెడ్డిని స్టార్‌ని చేసేసింది. ‘మేరీ... ప్లీజ్’ అని రమణారెడ్డి..., ‘ధర్మ... ప్లీజ్’ అని రేలంగి... ఆ సినిమాలో చేసిన అల్లరి అంతాఇంతానా. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి కామెడీ పంట పండించిన సినిమాలు ఎన్నో. ‘హాలీవుడ్‌కి లారెల్-హార్డీ... తెలుగు తెరకు రేలంగి-రమణారెడ్డి అంతే...’ అన్నారంతా. రమణారెడ్డి అనగానే చటుక్కున గుర్తొచ్చే పాత్ర ‘చినమయ’. ‘మాయాబజార్’లోని ఈ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చింది. ‘ఓరి నీ తెలివీ... అస్మదీయులకు విరుగుడు తస్మతీయులని వీడు కొత్త పదం కనిపెట్టాడు ప్రభూ...’ అంటూ చినమయగా... నెల్లూరు యాసలో రమణారెడ్డి చెప్పిన డైలాగ్ మరిచిపోగలమా. ‘అం అహా... ఇం ఇహీ... ఉం ఉహూ...’ అంటూ ప్రేక్షకులను నిజంగానే మంత్రముగ్ధుల్ని చేశారాయన. ‘పౌరాణిక పాత్ర చేస్తూ ఆ నెల్లూరు యాసేంటి?’ అని అడిగితే.. ‘నా భాష అది, ఎట్టా వదులుద్ది’ అనేవారు రమణారెడ్డి. ‘గుండమ్మకథ’ చిత్రంలోని ‘గంటన్న’ పాత్ర రమణారెడ్డి పోషించిన పాత్రల్లో మరపురానిది. ‘ఏమవుతాను... ఎత్తికుదేస్తే రెండు చక్కలవుతాను. వరసకు అన్ననూ... జీతంబెత్తం లేని గుమస్తాను. నన్ను గంటన్న అంటార్లేండీ...’ అంటూ ఆయన ధాటిగా చెప్పిన డైలాగులు ఇంకా జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. రమణారెడ్డి అనగానే... ఇల్లరికం, కులగోత్రాలు, దీపావళి, హరిశ్చంద్ర, కార్తవరాయుని కథ, భార్యాభర్తలు... ఇలా లెక్కకు మించిన ఆణిముత్యాలు గుర్తొస్తాయి. రమణారెడ్డికి మేజిక్ చేయడం సరదా. ఆయన మంచి మెజీషియన్ కూడా. స్వచ్ఛంద సంస్థల కోసం ఆయన పలు మేజిక్ షోలు చేసేవారు. ‘కుటుంబ సేవకు సినిమాలు ఎలాగూ ఉన్నాయి. ఈ మేజిక్షోలు సమాజ సేవ కోసం’ అనేవారాయన. కె.ఎస్.ప్రకాశరావుగారు ఓ చిత్రంలో రమణారెడ్డితో నారద పాత్ర వేయించారు. ఆయన వద్దని వారించినా ప్రకాశరావుగారు వినలేదట. దాంతో తప్పక నారదునిగా నటించారు రమణారెడ్డి. అస్తిపంజరం లాంటి ఆ ఆకారం కనిపించకుండా... ఆయనకు ఒక జుబ్బా కూడా తొడిగారు. షూటింగ్ అయిపోగానే... ‘మరి నాతో హనుమంతుడి పాత్ర ఎప్పుడు వేయిస్తున్నారు’ అని ప్రకాశరావుతో చమత్కరించారట రమణారెడ్డి. రమణారెడ్డి మృదుభాషి. జోకు పేల్చి సెలైంట్‌గా ఉండటం ఆయన స్టైల్. రెండు దశాబ్దాల పాటు అందరినీ నవ్వించిన ఆయన... 54 నాలుగేళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రమణారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా... ఆయన పాత్రలు మాత్రం జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.