Parthasarathy kolusu
-
బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుంది : పార్థసారథి
-
స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకొని పిచ్చిగా మాట్లాడుతున్నాడు
-
‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’
నెల్లురు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. వైఎస్సార్ సీపీ 20 నెలల పాలనకాలంలో 90 శాతానికిపైగా హమీలను నెరవెర్చిందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోపిడి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం నాడు-నేడు పథకంలో భాగంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్ది.. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటిదాక అర్హులైన సుమారు 63 లక్షల మందికి రూ. 2,350 చొప్పున పింఛన్ అందిస్తున్నామని అన్నారు. ఏపీలో సుమారు 2,434 రోగాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చామని పేర్కొన్నారు. వైద్యం ఖర్చులు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ ఏడాదికి రూ. 13,500 అందిస్తుందని స్పష్టం చేశారు. చదవండి: రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
‘అదే నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తా..’
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో రైతులు చనిపోయినా.. కనీసం ఆదుకోలేదని.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కేవలం 20 రోజుల్లో ఎన్యుమరేషన్ పూర్తవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఆరు నెలలైనా ఎన్యుమరేషన్ పూర్తయ్యేది కాదు. కోవిడ్ కష్ట కాలంలో కూడా రైతులకు నెల రోజుల్లో నష్టపరిహారం ఇస్తున్నారు. లైలా తుపాను నష్టపరిహారం ఇవ్వమంటే... ఆ తుపాను తన హయాంలో రాలేదని సిగ్గులేకుండా చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. (చదవండి: మండలిలో బాబు ‘మనసులో మాట’ వివాదం) ‘‘చంద్రబాబు హయాంలో రైతులు వరి పండించేందుకు భయపడేవారు. రైతులు కొవ్వెక్కి సుబాబుల్ పండిస్తున్నారని చెప్పిన వ్యక్తి ఆయన. చంద్రబాబు హయాంలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు రోడ్లపై టమాటాలు పారేసిన రోజులు చూశాం. చరిత్రలో ఇంత వేగంగా నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని అందరికీ నమ్మకం ఉందని’’ పార్థసారధి అన్నారు. (చదవండి: అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా.. సస్పెన్షన్) రైతులను గుండెల్లో పెట్టుకున్నారు: ఎమ్మెల్యే కాకాణి రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ రైతులను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. గ్రామ స్థాయి నుంచే ధాన్యం సేకరిస్తున్నారు. చంద్రబాబు ట్విట్టర్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన ట్వీట్లు నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే కాకాణి సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పెట్టిన పథకాన్ని అన్నదాత సుఖీభవ అనాలా? చంద్రబాబు సుఖీభవ అనాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, కరువు.. కవల పిల్లలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ‘‘జగన్ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో జలకళ సంతరించుకుంది. 18 నెలల్లో రూ.78వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించారు. జగన్ లాంటి ముఖ్యమంత్రి రావడం రైతుల పాలిట వరం. రైతులను అడ్డం పెట్టుకుని నీరు-చెట్టు పథకంతో చంద్రబాబు దోచుకున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాం. చంద్రబాబు హయాంలో రైతులు కూలీలుగా మారారని’’ కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
‘టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’
-
‘టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’
సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాతో కలిసి ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్. అని, పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో భూములు కొట్టేశారని, ముడుపులు తీసుకుని అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టారని ఆయన విమర్శలు గుప్పించారు. (చదవండి: ప్రతిపక్షం ఉన్నట్లు బాబు భ్రమ కల్పిస్తున్నారు: అంబటి) ‘‘పేదరికం ప్రామాణికంగా పేదలకు ఇళ్ల స్థలాలను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు పేదలను విస్మరించి ఎన్ఆర్ఐలకు ఇళ్ల స్థలాలు, భూములు కేటాయించారు. ఎల్లోమీడియాతో కలిసి చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకోవడమే చంద్రబాబు ఆలోచన. ఆయన మనస్తత్వం ఏపాటిదో అర్థమవుతుంది. పేదలకు సెంటు భూమిని కూడా అమరావతిలో కేటాయించలేదు. కోట్లు దండుకుని ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు. ముడుపులు స్వీకరించి భూములు అమ్మకాలు చేశారని’’ ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: ‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’) నివాస యోగ్యం కానీ భూముల్లో లక్షలు పెట్టి దోచుకున్నారంటూ టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పెనమలూరు మండలంలో ఎకరా భూమి కోటి 20 లక్షలకుపైగానే ఉందన్నారు. 43 లక్షలకు ఎకరా భూమి ఇప్పిస్తే టీడీపీ నేతలకు సన్మానం చేస్తానన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. -
‘నక్క అరిస్తే సింహం గర్జించినట్లు కాదు’
సాక్షి,తాడేపల్లి: బీసీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలికన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహానాడు వేదికగా బీసీలను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఆయన మోసపూరిత మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని.. వారిని అనేక సందర్భాల్లో అవమానించారని పార్థసారధి ధ్వజమెత్తారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి) బీసీలకు గౌరవం పెరిగింది.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బీసీలకు శ్వాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెనతో రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24వేలు.. నాయీ బ్రాహ్మణులు, రజకులకు కూడా పది వేలు ఇస్తున్నారని తెలిపారు.పెద్ద ఎత్తున బీసీ మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. (అండమాన్‌లో ఆర్తనాదాలు) చంద్రబాబు.. కత్తెర్లు తప్ప మరేమీ ఇవ్వలేదు.. గత టీడీపీ పాలనలో నాయీబ్రాహ్మణుల తోక కత్తిరిస్తానని చంద్రబాబు హెచ్చరించారని పార్థసారధి గుర్తుచేశారు. మత్స్యకారులు తోలు తిస్తానని భయపెట్టారని.. బీసీలు జడ్జిలుగా పనికి రారని నివేదిక కోర్టులకు ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. ఆదరణ పథకం పేరుతో కత్తెర్లు తప్ప మరేమీ ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను బానిసలుగా గ్రామాల్లో టీడీపీ నేతలు చూసేవారని.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు తమ ఇంటి చుట్టూ కాళ్ళు అరిగేలా తిప్పుకునేవారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గత ఐదేళ్లలో బీసీల కోసం 50 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి ఐదువేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. బీసీల సంక్షేమానికి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వైఎస్ జగన్ 15 వేల కోట్లు ఖర్చు చేశారని పార్థసారధి వివరించారు. అందుకే చంద్రబాబు అరుపులు.. ‘‘చంద్రబాబుకు తన కుమారుడు లోకేష్ మీద నమ్మకం లేక అందరి మీద అరుస్తున్నారు. ఆయన అరిస్తే సింహం అరిసినట్టు కాదు.. నక్క అరిస్తే సింహం గర్జించినట్లు కాదు. నక్క అరిసినట్లే అవుతుందుని’’ ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేసేందుకే మహానాడు పెట్టారని పార్థసారధి నిప్పులు చెరిగారు. -
అందుకే చంద్రబాబు అరుపులు..
-
‘బురద చల్లడమే ఆయన పని’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 80 శాతం మేనిఫెస్టోను అమలు చేశామని తెలిపారు. ఇంటింటికే వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మఒడి పథకం అమలుతో ప్రజలు సంక్రాంతి పండగ చేసుకున్నారని చెప్పారు. (పేదల కళ్లలో ఆనందమే సీఎం జగన్ లక్ష్యం) అయినవాళ్లనే నిట్టనిలువుగా ముంచారు.. చంద్రబాబు తీరుపై పార్థసారధి మండిపడ్డారు. ‘‘ఎదుటివారిపై బురద చల్లడమే ఆయన పని. అయినవాళ్లనే నిట్టనిలువుగా ముంచిన వ్యక్తి చంద్రబాబు’’ అని దుయ్యబట్టారు. బీసీలను చంద్రబాబు మోసం చేశారని.. వెనుకబడిన కులాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పార్థసారధి నిప్పులు చెరిగారు. -
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
-
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ హయాంలోనే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని.. సమితి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థలు తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ఆమోదంతో ఎప్పుడు గెలవలేదన్నారు. మండలిని కించపరిచిన చరిత్ర ఆయనదని విమర్శించారు. మండలి రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం లేదని పార్థసారధి పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు.. రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని టీడీపీ చిత్రీకరించిందని మండిపడ్డారు. మండలి రద్దు తీర్మానానికి మద్దతు.. ‘మహావిష్ణువు స్వయంభూ గా వెలసిన ప్రాంతం రాయలసీమ.. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జన్మించిన ప్రాంతం..చిత్రరాజాలు తీసిన కేవిరెడ్డి జన్మించిన ప్రాంతమని’ భూమన తెలిపారు. రాయలసీమకు అన్యాయం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మండలిలో బిల్లులను అడ్డుకోవడం చంద్రబాబు సైంధవుడి పాత్రకు నిదర్శమన్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోని నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ చేస్తున్న మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని భూమన పేర్కొన్నారు. (చదవండి: శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!) (చదవండి: టీడీపీది శునకానందం: పేర్ని నాని) -
అమ్మఒడితో విద్యాభివృద్ధి సాధిస్తాం
-
జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి విద్యావ్యవస్థ పడిలేస్తోందని, ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ చర్చలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ప్రస్థానం సరైనమార్గంలో సాగలేదని, విద్యావ్యవస్థను కొందరు అభివృద్ధిపథంలో నడిపితే.. మరికొందరు నిర్వీర్యం చేశారని అన్నారు. గత చంద్రబాబు హయాంలో నాలుగువేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు విచ్చలవిడిగా అనుమతులిచ్చిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఫీజుల పేరిట జలగలు రక్తం పీల్చినట్టు.. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డబ్బులు పిండుకుంటున్నాయని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. భూ యజమాన్య హక్కుల బిల్లుకు ఆమోదం భూ యజమాన్య హక్కుల బిల్లును ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. డిప్యూటీ సీఎం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు తెచ్చినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరగనివ్వమని అన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూ లు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. రెండు కమిషన్లకు సివిల్ కోర్టు అధికారాలుంటాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, సుస్థిర విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. -
బీసీ కమిషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అంతకుముందు బీసీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో బీసీలు ఇతర వర్గాలతో సమాన స్థాయికి ఎదగాలనే బీసీ కమిషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో బీసీల అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. బీసీలను కించపరిచేవిధంగా చంద్రబాబు మాట్లాడారని పార్థసారథి గుర్తుచేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారని పేర్కొన్నారు. విస్తృత అధికారాలు, లక్ష్యాలతో బీసీ కమిషన్ చట్టం రాబోతున్నదని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని విస్తృతంగా తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని, దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానం అమలుకాకుండాపోయిందని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. టీడీపీ హయాంలో కులాల తారతమ్యాలు తగ్గలేదని, అలాంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్ బిల్లు వెనుకబడిన వర్గాలను ఆదుకుంటుందని తెలిపారు. బీసీ కమిషన్ ఏర్పాటుతో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని అన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సూచనలు ఇచ్చేందుకు బీసీ కమిషన్‌కు హక్కు ఉంటుందన్నారు. కులాల సర్టిఫికెట్ల జారీ అంశాన్ని బీసీ కమిషన్ ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు టీడీపీ ఒక్క కార్యక్రమమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలకు మేలు చేసేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సభలో టీడీపీ ప్రవర్తన ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు బీసీ కమిషన్ వైఎస్సార్సీపీ సభ్యుడు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీసీ ప్రజలకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని, పాదయాత్రలో బీసీ ప్రజల కష్టాలు తెలుసుకొని.. వారికి న్యాయం చేసేందుకు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీసీ వర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయో.. అన్ని కులాల వారందరికీ దీని వల్ల న్యాయం జరుగుతుందన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ సమస్యను బీసీ కమిషన్ పరిష్కరిస్తుందని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకూ న్యాయం జరిగేలా బీసీ కమిషన్ చూస్తుందన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లు బీసీలకు ధైర్యాన్నిస్తుందని, ఈబిల్లును ఓర్వలేక టీడీపీ సభను అడ్డుకుందని మండిపడ్డారు. -
ప్రజలకు బాబుపై విశ్వాసం పోయింది
-
‘పీఠాధిపతులంటే నీకు ఎందుకు ద్వేషం’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పీఠాధిపతులంటే ఎందుకంత ద్వేషమో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ప్రతిపక్షంపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ సీఎం అయినా తన విజయాలు, అభివృద్ధి చెప్పుకుని ఓట్లు అడుగుతారని, చంద్రబాబు మాత్రం ఏమీ చేయలేదు కాబట్టి తమపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. హిందూజా భూములకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నువ్వు చెప్పింది అబద్ధం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈడీ, సీబీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి.. 2017లో రాసిన లేఖ ఇప్పుడెలా బయటికి వచ్చింది.. మదుకాన్, రాయపాటి సాంబశివరావు నుంచి నీకు ముడుపులు ఎంత అందాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూజా భూములు అబద్ధం అయితే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా అని చంద్రబాబుకు మరోసారి సవాల్ విసిరారు. మనోజ్ కొఠారి ఒక చిన్న నగర స్థాయి నాయకుడని, అతనిపై కూడా స్టింగ్ ఆపరేషన్ చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై అధికారంలోకి రాగానే విచారణ చేస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. -
అరచేతిలో స్వర్గం చూపిస్తున్న బాబు
సాక్షి,చల్లపల్లి(అమరావతి) : ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే చంద్రబాబును నమ్మితే అరచేతిలో స్వర్గం చూపిస్తాడని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తమాజేరు ప్రధాన కూడలిలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మను పార్థసారథి, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లక్షన్నర కోట్ల అప్పుల్లో ముంచిన చంద్రబాబు, ఎంతసేపూ తన కొడుక్కి కోట్లు కూడబెట్టే పనిలో లీనమయ్యారని విమర్శించారు. ఎన్నికల ముందు వెయ్యి రూపాయలిచ్చి అన్నదాత సుఖీభవ అంటున్న చంద్రబాబు రైతు రుణమాఫీ 4, 5 విడతల బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు ఇవ్వని చంద్రబాబును రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు తోడ్పడతాయన్నారు. బాలశౌరి మాట్లాడుతూ నాడు తల్లి కాంగ్రెస్–పిల్ల కాంగ్రెస్ అన్న చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌తో బాబాయ్–అబ్బాయ్‌లా తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, బాలకోటేశ్వరరావు, అన్నపరెడ్డి వెంకటస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి గోవర్థనరావు, జిల్లా కార్యదర్శులు బొందలపాటి లక్ష్మి, షేక్ దిల్షాద్ నజరానా, అబ్దుల్కరీం, మేడూరి శ్రీనివాసరావు, అరజా శివశంకర్, వడుగు నందులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉంది’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు దొంగే.. దొంగ అన్నట్లుగా ఉందని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుపెట్టుకుని డేటా చోరీ చేయటం దురదృష్టకరమన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థం కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు తన అనుభవంతో లక్షల కోట్లు లూటీ చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రతి రంగంలో అభివృద్ధి పేరు చెప్పి తన వాటాను ముందే లెక్కవేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు అవసరం వచ్చినపుడే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం గుర్తుకువస్తుందన్నారు. ఓట్లుకు కోట్లు కేసులో తప్పు చేయలేదని చెప్పకుండా.. నాకూ ఏసీబీ ఉంది.. నాకు పోలీసులు ఉన్నారంటూ చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల లిస్ట్ దగ్గర నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చేస్తున్నారన్నారు. ఐటీ శాఖను తన కొడుకు చేతిలో పెట్టి ఓట్లు మాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ట్యాబుల్లో ప్రజల వ్యక్తిగత సమాచారం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. దమ్ముంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. -
‘ఎన్నికలకు భయపడే బాబు వరాల జల్లులు’
సాక్షి, ఉయ్యూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో భయపడి వరాల జల్లులు కురిపిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి వ్యాఖ్యానించారు. గురువారం ఉయ్యూరు వైఎస్సార్ సీపీ కార్యాలంయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 53 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, అగ్రికల్చర్ కార్యాలయంలో లిస్టును బహిర్గతం చేయాలన్నారు. పెథాయ్ తుపాన్ వల్ల నష్ట పోయిన రైతులకు ఇప్పటికీ నష్ట పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఉయ్యూరు బస్టాండ్ దగ్గర గల మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 7.56 నిమిషాలకు ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. -
‘చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవు’
-
టీడీపీవి జుగుప్సాకర రాజకీయాలు
ఉయ్యూరు (పెనమలూరు) : టీడీపీ జుగుప్సాకర రాజకీయాలు చేయడం నీచాతి నీచమని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు మండలంలోని చినఓగిరాల గ్రామానికి చెందిన దాసరి నాగ శ్రావణి ఓ కార్పొరేట్ పాఠశాల భవనంపై నుంచి పడి మృతి చెందడం, పార్థసారథి బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆ యాజమాన్యంతో మాట్లాడి రూ.8 లక్షలు నష్ట పరిహారం, విద్యార్థిని తల్లికి ఉద్యోగానికి ఒప్పించి వివాదాన్ని పరిష్కరించారు. ఈ ఘటనను జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను కలిసి ఆ పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి చేయించి మొదట అంగీకరించిన రూ.4 లక్షలు, ఉద్యోగం మాత్రమే ఇస్తామని చెప్పించడంతో బాధితులు పార్థసారథిని కలిసి తమ గోడును వినిపించారు. ఈ విషయంలో యాజమాన్యం కూడా మొదటి ఒప్పందాన్నే చేస్తామని మాట మార్చడంతో ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4 లక్షలను పార్థసారథి సోమవారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ మేరకు తన సొంత డబ్బును ప్రజలందరి సమక్షంలో అందజేశారు. అధికార మదంతో బెదిరిస్తారా?.. ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకుండా ఎక్కడ పార్థసారథికి పేరు వస్తుందో అనే దుగ్దతో అధికార మదంతో పాఠశాల యాజమాన్యాన్ని బెదిరిస్తారా.. అని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లానన్నారు. ఆ సమయంలో దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు రూ.20 లక్షలు పరిహారం కావాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయని చెప్పారు. న్యాయం కావాలా, కేసు కావాలా.. అని అడిగితే న్యాయమే చేయాలని బాధితులు కోరితేనే చైతన్య యాజమాన్యంతో మాట్లాడానని చెప్పారు. అందరి సమక్షంలోనే మాట్లాడి ఒప్పందాన్ని చెప్పానన్నారు. పేదలకు న్యాయం జరిగిందని భావించకుండా ఎమ్మెల్యే ఆ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కేసులు పెడతామని బెదిరించి నష్టం చేయాలని చూశారన్నారు. ఎవరితో మాట్లాడావో కాల్ లిస్ట్ పెట్టాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయించడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఏమని బెదిరించాడో ముందు చెబితే తానెవరితో మాట్లాడింది.., తన కాల్ లిస్ట్‌ను చూపుతానన్నారు. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎంక్వైరీ వేయించుకుని తెప్పించుకోవచ్చని సవాల్ విసిరారు. చలసాని పండు ఇలా దిగజారలేదు.. గతంలో నియోజకవర్గంలో టీడీపీ నేతలెవ్వరూ నీచంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదని పార్థసారథి గుర్తు చేశారు. ‘నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేశా. నాపై రెండు సార్లు పోటీ చేసిన పండు ఇప్పుడున్న ఎమ్మెల్యే కంటే బలమైన వ్యక్తి. కానీ మేం ఏ రోజూ దిగజారి రాజకీయాలు చేయలేదు. హుందాతనంగానే నడుచుకుని సద్విమర్శలు చేసుకున్నాం. పేదల విషయంలో న్యాయబద్ధంగానే వ్యవహరించాం. ఎమ్మెల్యేగా గెలిచాక బోడె పూర్తిగా చండాలపు రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. గ్రామీణ వాతావరణాన్ని చెడగొట్టడమే అవుతుంది.’ అని అన్నారు. ‘దాన కర్ణుడినని చెప్పుకునే బోడె.. నేను సాయం చేయడంలో జాప్యం ఉంటే.. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంలో తప్పులేదు. లేదా టీడీపీలో ఉన్న వారంతా అపర కోటీశ్వరులే కదా.. బాధిత కుటుంబానికి ఉదార స్వభావంతో సాయం చేయవచ్చు కదా’’ అని పార్థసారథి ప్రశ్నించారు. ఎవరిని బెదిరించారో, కాల్ లిస్టులేంటో అంతా త్వరలోనే బయటపెడతానన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), ఉయ్యూరు, పెనమలూరు మండలాల అధ్యక్షులు దాసే రవి, కిలారు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి గారపాటి నాని, నాయకులు దోనేపూడి సాంబయ్య, మంచికంటి నాగేశ్వరరావు, మత్తే భాను, గన్నే ధనుంజయ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వ మొండి వైఖరి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు దీక్షలో పార్థసారథి పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎందుకు సీపీఎస్ రద్దు చేయమని కోరుతున్నారో కనీసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. బాబు ప్రభుత్వం అహంకార ధోరణితో పని చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఏ క్షణాన పుట్టారోగానీ అందరినీ నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. సీపీఎస్ కారణంగా ఉద్యోగులు అనుభవిస్తున్న మనో వేదనను చంద్రబాబు ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య పెన్షన్లను సీపీఎస్ విధానంలోకి తీసుకువచ్చి మీ పేర బాండ్లు, షేర్లు ఉన్నాయంటూ సామాన్యులను ఒప్పిస్తాడేమోనన్న సందేహం వ్యక్తపరిచారు. ఉద్యోగులకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సీపీఎస్ రద్దు చేస్తుందని ప్రకటించారు. ఈ దేశంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీయేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ ద్వారా 1.80 లక్షల మంది ఉద్యోగులకు జగన్ భరోసా కల్పించారన్నారు. ఏపీసీపీఎస్ఈఏ అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసేవారికే ఉద్యోగులు అండగా ఉంటారన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. దీక్షలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు
-
‘దేవినేని ఉమ చేతకాని దద్దమ్మ’
విజయవాడ : ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతకాని దద్దమ్మ అని, కృష్ణా జిల్లాకు పట్టిన దరిద్రమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి పార్థసారథి తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారధి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కట్టినట్లు ఉందని విమర్శించారు. నీటిపారుదల శాఖా మంత్రిగా ఉంటూ ఇసుక దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు నాలుగేళ్లలో తామేదో సాధించినట్లు మంత్రిలా కాకుండా ఓ మంత్రసానిలా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ అఫిడవిట్ చూసి ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని తెలిపారు. బీజేపీకి ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేదని, అఫిడవిట్లో చెప్పిన అంశాలు అనేకసార్లు గొప్పగా చెప్పారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేతలు ఏ ప్రాతిపదికన బీజేపీతో జతకట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముంపు మండలాల సమస్య స్థాయలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడితే ఎగతాళి చేసింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి టీడీపీ వంతపాడిందని ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించడానికి టీడీపీకి ఎందుకు భయమన్నారు. ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజీ కోసం ఎందుకు సిద్ధపడ్డారని, నాలుగేళ్లు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా చూశారని ప్రశ్నించారు. -
బీజేపీని ప్రశ్నించడానికి టీడీపీకి ఎందుకు భయం