సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో రైతులు చనిపోయినా.. కనీసం ఆదుకోలేదని.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కేవలం 20 రోజుల్లో ఎన్యుమరేషన్ పూర్తవుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఆరు నెలలైనా ఎన్యుమరేషన్ పూర్తయ్యేది కాదు. కోవిడ్ కష్ట కాలంలో కూడా రైతులకు నెల రోజుల్లో నష్టపరిహారం ఇస్తున్నారు. లైలా తుపాను నష్టపరిహారం ఇవ్వమంటే... ఆ తుపాను తన హయాంలో రాలేదని సిగ్గులేకుండా చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. (చదవండి: మండలిలో బాబు ‘మనసులో మాట’ వివాదం)
‘‘చంద్రబాబు హయాంలో రైతులు వరి పండించేందుకు భయపడేవారు. రైతులు కొవ్వెక్కి సుబాబుల్ పండిస్తున్నారని చెప్పిన వ్యక్తి ఆయన. చంద్రబాబు హయాంలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు రోడ్లపై టమాటాలు పారేసిన రోజులు చూశాం. చరిత్రలో ఇంత వేగంగా నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని అందరికీ నమ్మకం ఉందని’’ పార్థసారధి అన్నారు. (చదవండి: అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా.. సస్పెన్షన్)
రైతులను గుండెల్లో పెట్టుకున్నారు: ఎమ్మెల్యే కాకాణి
రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ రైతులను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. గ్రామ స్థాయి నుంచే ధాన్యం సేకరిస్తున్నారు. చంద్రబాబు ట్విట్టర్‌లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన ట్వీట్‌లు నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే కాకాణి సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పెట్టిన పథకాన్ని అన్నదాత సుఖీభవ అనాలా? చంద్రబాబు సుఖీభవ అనాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, కరువు.. కవల పిల్లలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
‘‘జగన్ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో జలకళ సంతరించుకుంది. 18 నెలల్లో రూ.78వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించారు. జగన్ లాంటి ముఖ్యమంత్రి రావడం రైతుల పాలిట వరం. రైతులను అడ్డం పెట్టుకుని నీరు-చెట్టు పథకంతో చంద్రబాబు దోచుకున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాం. చంద్రబాబు హయాంలో రైతులు కూలీలుగా మారారని’’ కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment