
సాక్షి, ఉయ్యూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో భయపడి వరాల జల్లులు కురిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి వ్యాఖ్యానించారు. గురువారం ఉయ్యూరు వైఎస్సార్ సీపీ కార్యాలంయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 53 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ, అగ్రికల్చర్ కార్యాలయంలో లిస్టును బహిర్గతం చేయాలన్నారు. పెథాయ్ తుపాన్ వల్ల నష్ట పోయిన రైతులకు ఇప్పటికీ నష్ట పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఉయ్యూరు బస్టాండ్ దగ్గర గల మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 7.56 నిమిషాలకు ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment