‘బురద చల్లడమే ఆయన పని’ | YSRCP MLA Kolusu Partha Sarathy Firs On Chandrababu | Sakshi
Sakshi News home page

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు..

Published Sat, Mar 7 2020 1:19 PM | Last Updated on Sat, Mar 7 2020 1:32 PM

YSRCP MLA Kolusu Partha Sarathy Firs On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 80 శాతం మేనిఫెస్టోను అమలు చేశామని తెలిపారు. ఇంటింటికే వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మఒడి పథకం అమలుతో ప్రజలు సంక్రాంతి పండగ చేసుకున్నారని చెప్పారు. (పేదల కళ్లలో ఆనందమే సీఎం జగన్‌ లక్ష్యం) 

అయినవాళ్లనే నిట్టనిలువుగా ముంచారు..
చంద్రబాబు తీరుపై పార్థసారధి మండిపడ్డారు. ‘‘ఎదుటివారిపై బురద చల్లడమే ఆయన పని. అయినవాళ్లనే నిట్టనిలువుగా ముంచిన వ్యక్తి చంద్రబాబు’’ అని దుయ్యబట్టారు. బీసీలను చంద్రబాబు మోసం చేశారని.. వెనుకబడిన కులాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పార్థసారధి నిప్పులు చెరిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement