‘టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’ | YSRCP MLA Parthasarathy Comments On TDP Leaders | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు

Published Mon, Aug 31 2020 1:15 PM | Last Updated on Mon, Aug 31 2020 2:29 PM

YSRCP MLA Parthasarathy Comments On TDP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాతో కలిసి ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్. అని, పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భూములు కొట్టేశారని, ముడుపులు తీసుకుని అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టారని ఆయన విమర్శలు గుప్పించారు. (చదవండి: ప్రతిపక్షం ఉన్నట్లు బాబు భ్రమ కల్పిస్తున్నారు: అంబటి)

‘‘పేదరికం ప్రామాణికంగా పేదలకు ఇళ్ల స్థలాలను సీఎం వైఎస్‌ జగన్‌ ఎంపిక చేశారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు పేదలను విస్మరించి ఎన్ఆర్ఐలకు ఇళ్ల స్థలాలు, భూములు కేటాయించారు. ఎల్లోమీడియాతో కలిసి చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకోవడమే చంద్రబాబు ఆలోచన. ఆయన మనస్తత్వం ఏపాటిదో అర్థమవుతుంది. పేదలకు సెంటు భూమిని కూడా అమరావతిలో కేటాయించలేదు. కోట్లు దండుకుని ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించారు. ముడుపులు స్వీకరించి భూములు అమ్మకాలు చేశారని’’ ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: ‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’)

నివాస యోగ్యం కానీ భూముల్లో లక్షలు పెట్టి దోచుకున్నారంటూ టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పెనమలూరు మండలంలో ఎకరా భూమి కోటి 20 లక్షలకుపైగానే ఉందన్నారు. 43 లక్షలకు ఎకరా భూమి ఇప్పిస్తే టీడీపీ నేతలకు సన్మానం చేస్తానన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement