బలహీనపడిన అల్పపీడనం | Moderate rains in the state today and tomorrow | Sakshi
Sakshi News home page

బలహీనపడిన అల్పపీడనం

Published Thu, Sep 7 2023 4:44 AM | Last Updated on Tue, Sep 12 2023 8:56 PM

Moderate rains in the state today and tomorrow - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. ఈ అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల వైపు పయనిస్తూ బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ప్రస్తుతం ఈ ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలో­మీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రెండురోజులు ఉత్తర కో­స్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీ­మలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలి­పింది.

బుధవారం ఉదయం నుంచి రాత్రి వర­కు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మ­న్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సరుబుజ్జిలిలో 12 సెంటీమీటర్లు, చిలకలపల్లి­లో 10.8, దేవరాపల్లిలో 8.7, డుంబ్రిగుడలో 4.3, పెందుర్తిలో 4, రేచర్లలో 3.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్ప­పీడనం బలహీనపడిన నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతా­వరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మళ్లీ అల్ప­పీడనంగానీ, ఉపరితల ఆవర్తనం/ద్రోణిగానీ ఏర్పడితే వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement