
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖపట్నంలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్, ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విజయవాడలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా కేంద్రం ఉన్నందున విశాఖలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు అంత్యంత అవసరమన్నారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 పడకల ఆయుష్ ఆస్పత్రి నిర్మాణ పరిస్థితిపై కూడా ప్రస్తావించారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో 4200 ఆయుష్ హెల్త్, వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించగా.. అందులో ఏపీలో ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. (చదవండి: విశాఖలో ఓ ప్రబుద్ధుడు నిర్వాకం..)
విశాఖ అభివృద్ధితో, పలు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు అంశం, సమస్యల పరిష్కారంపై గళమెత్తారు. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్ల ఏర్పాటుపై విజ్ఞప్తి విశాఖకు రావాల్సిన, కావాల్సిన ప్రాజెక్టులు, అంశాలను సంబంధిత మంత్రుల దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకువస్తున్నారు. రెండు రోజుల క్రితమే విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. ప్రధానంగా విశాఖ నుంచి పర్యాటక ప్రాంతమైన అరకుకు నడుస్తున్న వి్రస్టాడం కోచ్‌లు పెంచాల్సిన అవసరం ఉందని, తద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆయనతో అంగీకారం వచ్చేలా చేశారు. అదే విధంగా విశాఖ నుంచి తిరుమలకు, విశాఖ నుంచి హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని చేసిన విన్నపానికి కూడా రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సానుకూల స్పందన లభించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల ఏర్పాటు విషయంపై రాజ్యసభ ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. (చదవండి: టీడీపీ లాయర్లే జడ్జిలు)
Comments
Please login to add a commentAdd a comment