సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రిలో కొత్తరకం కరోనా వైరస్ కలకలంరేపింది. యూకే నుంచి ఢిల్లీ వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ తేలింది.దీంతో ఆమెను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్‌లో పెట్టారు. కానీ ఆమె రిపోర్ట్ రాకముందే అక్కడి నుంచి తప్పించుకుని రాజమండ్రి బయల్దేరారు. సమాచారం తెలుసుకున్న అధికారులు.. సదరు మహిళను, ఆమె కుమారుడిని పట్టుకొని ఆస్పత్రికి తరలించారు.
రాజమండ్రి రూరల్ మండలం రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళ ఈనెల 21న యూకే నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆమె కుమారుడు ఢిల్లీ వెళ్లారు. యూకేలో కరోనా పరీక్షలు చేయించుకున్నా అక్కడ ఫలితాలు రాకుండానే ఆమె బయలుదేరి భారత్‌కు వచ్చినట్టు సమాచారం. ఇక్కడ కూడా ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేశారు. ఆమెలో కొత్తరకం కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్‌లో ఉంచారు. కానీ ఆమె అక్కడి నుంచి అక్కడ నుంచి పరారై రాజమండ్రి రావడానికి బయలుదేరారు. ఈ విషయాన్ని ఢిల్లీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆమెను గుర్తించేందుకు తీవ్రంగా కృషి చేశారు. అయితే బాధితురాలి ఫోన్, ఆమె కుమారుడి ఫోన్ స్విచాఫ్ రావడంతో పాస్‌పోర్ట్ ఆధారంగా ఆమె అడ్రస్‌ను కనిపెట్టారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో సదరు మహిళను పట్టుకొని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళకు సోకింది కొత్తరకం కరోనా? కాదా? తేల్చేందుకు రక్త నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment