
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతు దినోత్సవం సందర్భంగా కడప ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నాయకులు, రైతులు, పార్టీ నాయకులు నాగలి బహుకరించారు.

దివంగత మహానేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రైతు సాధికారత కోసం వైఎస్సార్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.