
ఉత్తర కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాడేపల్లి రూరల్: రాబోయే మూడురోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో దక్షిణ కోస్తాలో పూర్తి పొడి వాతావరణం నెలకొంటుందన్నారు. అయితే రాయలసీమలో ఆది, సోమవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని, మంగళవారం ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపారు.
చదవండి:
మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం
పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్