north coast
-
నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ మీదగా ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు,రేపు(శుక్ర,శని)వారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొందిఈనెల 13వ తేదీన రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. ఏపీలో గత మూడు రోజుల్లో సగటున 10 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన మూడు రోజుల్లో రాయలసీమతో పాటు రాష్ట్రంలో సగటున రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైంది. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర కోస్తాలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘పశ్చిమ’లో భారీ వర్షం: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటున 13.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెంలో అత్యధికంగా 70.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా ఏలూరులో 51.4 మి.మీ. కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ పలుచోట్ల వర్షాలు పడ్డాయి. గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. గుంటూరు నగరంతో పాటు సత్తెనపల్లి, మేడికొండూరు, ఫిరంగిపురం, పెదకూరపాడు, క్రోసూరు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
ఏపీ: ఉత్తర కోస్తాకు వర్షసూచన
తాడేపల్లి రూరల్: రాబోయే మూడురోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో దక్షిణ కోస్తాలో పూర్తి పొడి వాతావరణం నెలకొంటుందన్నారు. అయితే రాయలసీమలో ఆది, సోమవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని, మంగళవారం ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపారు. చదవండి: మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్ -
భారీ వర్షసూచన.. విస్తారంగా కురిసే అవకాశం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశమున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని , మత్సకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. -
ఉత్తర కోస్తాకు వరద ముప్పు
* పొంగుతున్న వంశధార, నాగావళి... గోదావరి ఉగ్రరూపం నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలను వరద ముంపు వణికిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎగువనున్న ఒడిశా, ఏజెన్సీ ప్రాంతాల్ల కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార, నాగావళి భారీగా వరద నీరు చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఆయా నదుల తీర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వంశధార నదిలో నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరుకోవడం, నాగావళి నదిలో కూడా నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండవాగులు, గెడ్డల ఉధృతికి ఏజెన్సీలో పలు గ్రామాలతో రాకపోకలు తెగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తి, విశాఖ జిల్లాలో మరో వ్యక్తి వరదల్లో గల్లంతయ్యారు. 30 గేదెలు కొట్టుకుపోయాయి. ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, శబరితో పాటు కొండవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ అన్ని గేట్లనూ ఎత్తివేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి గంటకు అడుగు చొప్పున పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి 50 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జలదిగ్బంధంలో సిక్కోలు గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలో వంశధారకు వరద ఉద్ధృతి పెరగడంతో 11 మండలాల పరిధిలోని 124 గ్రామాలు ప్రమాదం అంచున ఉన్నాయి. ఇప్పటికే ఈ మండలాల్లోని వేలాది ఎకరాల వేసిన అరటి, మొక్కజొన్న, వరి, చెరుకు తదితర పంటలు నీట మునిగాయి. వరదలపై అప్రమత్తం: సీఎం ఆదేశం వరదలు పోటెత్తుతున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఒడిశాతో పాటు పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని పరిస్థితిపై సీఎం ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు
విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు అలముకున్నాయి. చాలాచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా, యారాడ బీచ్లో యువకుడిని రక్షించబోయిన గజ ఈతగాడు మహేష్ గల్లంతయ్యారు. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, దాంతో ఉపరితం ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర కోస్తా, తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.